తిరుమలలో పాము... పరుగులు తీసిన భక్తులు | snake in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పాము... పరుగులు తీసిన భక్తులు

May 19 2016 8:14 PM | Updated on Sep 4 2017 12:27 AM

తిరుమలలో పాము గురువారం కలకలం సృష్టించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం క్యూలైన్లో నిలుచుని ఉన్న భక్తుల మధ్యలో పాము ప్రత్యక్షమైంది.

తిరుమల: తిరుమలలో పాము గురువారం కలకలం సృష్టించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం క్యూలైన్లో నిలుచుని ఉన్న భక్తుల మధ్యలో పాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో పాము క్యూ లైన్లో ప్రవేశించి ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే .... తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల భారీగా క్యూ లైన్లు నిలిచారు.   సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement