ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి | Sexual assault on Five years child | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి

Mar 10 2016 12:20 AM | Updated on Apr 4 2019 5:20 PM

అభం శుభం ఎరుగని ఓ చిన్నారిపై జులాయి కన్నుపడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన

  బాలుడిపై కేసు నమోదు
 టెక్కలి రూరల్:  అభం శుభం ఎరుగని ఓ చిన్నారిపై జులాయి కన్నుపడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడు.  అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల పాపను బాలుడు(15) తన ఇంట్లోకి తీసుకువె ళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  బాలిక తల్లి ఆవాల ఉమ కుమార్తె కోసం వెతుకుతూ అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న ఇంటి వద్దకు వెళ్లింది.
 
  అక్కడే ఉన్న మైనర్ బాలుడ్ని ప్రశ్నించగా తనకేమీ తెలియదని బుకాయిస్తుండగా ఇంటి పెరడవైపు నుంచి బాలిక రావడాన్ని తల్లి గమనించింది. జరిగిన దురాఘాతాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో లబోదిబోమన్న స్థానికులు బాలుణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేశారు.  టెక్కలి పోలీసులకు తెలియజేశారు. మైనర్ బాలుడు గ్రామంలో పక్షులు, పిట్టలు, ఉడుములు వేటాడుకుంటూ జీవనం సాగి స్తున్నాడు. వైద్యపరీక్షల నిమిత్తం బాలికను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలుడిని పోలీసుల అదుపులో ఉంచారు. కేసు నమోదు చేయనున్నట్లు సీఐ భవానీప్రసాద్  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement