రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సోమవారం స్థానిక రివర్వ్యూ కాలనీలోని కేంద్ర రైల్వేసహాయశాఖ మంత్రి కోట్ల జయ
జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు
Aug 6 2013 3:19 AM | Updated on Sep 1 2017 9:40 PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సోమవారం స్థానిక రివర్వ్యూ కాలనీలోని కేంద్ర రైల్వేసహాయశాఖ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి ఇంటి సమీపంలో రాయలసీమ ఉద్యోగ, ఉపాధ్యాయ అధ్యాపక ఐక్యకార్యాచరణ సమాఖ్య(జేఏసీ) చైర్మన్ డాక్టర్ కె.చెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా కోట్ల ఇంటి ఎదురుగానే వంటావార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడికి వెళ్లిన జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోట్ల ఇంటికి సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ పి.లింగేశ్వరరెడ్డి, నాయకులు సుంకన్న, ప్రభు, అంజనయ్య, ప్రతిమారాయ్, షీలాసౌజన్య, రాంప్రసాద్, లలితమ్మ, హేమలత, లాలప్ప, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement