బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే | BC JAC wide ranging meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే

Nov 2 2025 9:29 PM | Updated on Nov 2 2025 9:38 PM

BC JAC wide ranging meeting In Hyderabad
  • బిసి రిజర్వేషన్లపై పోరాటాన్నీ పల్లె పల్లెకు విస్తరించాలి
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల్లో ఉన్న నేతలు జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాగా కలిసి సాగుదాం
  • నవంబర్ లో పార్లమెంటు ముట్టడి చేపడతాం
  • బిసి రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం చేస్తాం
  • నేటి రిజర్వేషన్ల ఉద్యమం రేపటి సామాజిక తెలంగాణ రాష్ట్రo ఏర్పాటుకు నాంది పలుకుతుంది
  • ఐక్యమత్యమే ఆయుధంగా చేసి బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడుదాం
  • బీసీ జేఏసీ విస్తృత స్థాయి  సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, బిసి ఎస్సి ఎస్టి నేతల వెల్లడి
  • బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని రాష్ట్రంలో ఉధృతం చేయడానికి అష్టాంగ ఆందోళన పేరుతో కార్యాచరణ ప్రకటించిన బీసీ జేఏసీ
  • బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బిజెపి, కాంగ్రెస్ లదే
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇక ప్రత్యక్ష సమరమే
  • బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
  • సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగిన బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం
  • ఉత్కంఠ భరితంగా, సమాలోచనతో, రెండు నెలల కార్యాచరణ ప్రకటన

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఈనెల 20వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద తెల్పాల్సిందేనని, లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు సంయుక్తంగా హెచ్చరించారు

నేడు(ఆదివారం, నవంబర్‌ 2వ తేదీ) హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ కల్చరర్ సెంటర్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు భవిష్యత్ కార్యాచరణ పై బీసీ జేఏసీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా, కో చైర్మన్ దాసు సురేష్ , కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలు సమన్వయం చేశారు

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన జేఏసీ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది సభ చాలా ఉత్కంఠ భరితంగా, సమాలోచనలతో దీర్ఘకాలిక వ్యూహం తో జరిగింది  ఈ సమావేశo లో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ, న్యాయవాద, డాక్టర్స్, మేధావుల సంఘాల నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు వేలాదిమంది హాజరయ్యారు

 ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మానాడు జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, ప్రముఖ సినీ నటులు ఆర్.నారాయణమూర్తి, సినీ దర్శకులు ఎన్ శంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలురీ గౌరీశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, పాల్గొని మాట్లాడారు

బీజేపీ నేతగా రాలేదు.. బీసీ బిడ్డగా వచ్చా: ఈటెల రాజేందర్‌
బీసీ జేఏసీ సమావేశానికి బిజెపి నేతగా తాను రాలేదని, ఒక బీసీ బిడ్డగా హాజరయ్యానని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ చేస్తున్నాం పోరాటానికి తన వంతు మద్దతు ఉంటుందని ఈటెల రాజేందర్‌ తెలిపారు దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బీసీలకే అన్యాయం జరుగుతుందని దగా పడ్డ బీసీలు దండుగట్టే సమయం ఆసన్నమైందన్నారు బీసీ జేఏసీ నాయకత్వం ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి నిస్వార్థంతో నిజాయితీతో బీసీల కోసం ఉద్యమించేవారు బాధ్యత తీసుకోవాలని గమ్యాన్ని ముద్దాడె వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు

వెనకకు తగ్గే ప్రసక్తి లేదు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని, రాహుల్ గాంధీ ఆదేశించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తామని వారు అన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు వి హనమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మైనింగ్ చైర్మన్ ఈరవత్ అనిల్ వెల్లడించారు

తెలంగాణలో మరో ఉద్యమం: మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్
దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని పార్టీలను పక్కనపెట్టి బీసీలకు సామాజిక న్యాయం దక్కడానికి తెలంగాణలో మరో పోరాటాన్ని రూపొందించాలని వారు పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల సాధనలో బీసీలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనే రీతిలో ఒక్కటే జట్టు గట్టి పోరాడాలని, టిఆర్ఎస్ పార్టీగా, బీసీ బిడ్డలుగా బీసీ జేఏసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు తెలంగాణ ఉద్యమ తరాహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని వారు సూచించారు

మేము ప్రత్యక్షంగానే ఉద్యమంలో పాల్గొంటాం
బీసీ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు  బీసీ ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ముందుకు తీసుకెళ్తే కచ్చితంగా విజయం సాధించడం ఖాయమన్నారు నాటి దేశ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వర్గీకరణ పోరాటం వరకు శాంతియుతంగా పోరాడితేనే విజయం సిద్ధించిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బిజెపిలను ఒత్తిడి పెంచడానికి శాంతియుత పోరాటమే లక్ష్యంగా బీసీ ఉద్యమం ముందుకు సాగలని ఆయన తెలిపారు బీసీ జెఎసి రాజీ లేకుండా నిజాయితీగా కొట్లాడాలని, జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని ఎమ్మార్పీఎస్ బలపరుస్తుందని ఆయన వెల్లడించారు

రాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమవుతాం
బీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి కాదని బీసీ సమాజానికి సకల జనులు అండగా నిలబడతారని ఇది మొన్న జరిగిన రాష్ట్ర బంద్  తో తేటతలమైందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీసీ ఉద్యమానికి మాల మాదిగ, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సమాజం తోడుగా ఉంటుందని రాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమై బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలపరుస్తామని ఆయన వెల్లడించారు

పోరాడితే పోయేది ఏమీలేదు: ఆర్.నారాయణమూర్తి
తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేద్కర్ ఫూలే చూపించిన మార్గంలో బీసీలు ఐక్యమై గల్లీ నుండి ఢిల్లీ వరకు దండుగట్టాలని, పోరాడితే పోయేది ఏమీలేదని, చరిత్రలో పోరాడిన సమాజమే విజయ తీరాలకు చేరిందని బీసీలు కూడా తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చా

 పల్లె పల్లెకు విస్తరించాలి: రిటైర్డ్ ఐఏఎస్ కొల్లేటి ప్రభాకర్
బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని, రాష్ట్ర బంద్ తర్వాత  బీసీ ఉద్యమం రాష్ట్రంలో బలపడిందని బిసిల బలాన్ని బలగాన్ని చూపించే తరుణ వాసనమైందని ఆయన తెలిపారు

  బీసీ జేఏసీ కార్యాచరణ 
  (అష్టంగా ఆందోళనలు)

బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో అష్టంగా ఆందోళనలు పేరుతో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్ దాసు సురేష్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలు ప్రకటించారు

1) నవంబర్ ఆరవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు

2) నవంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయసాధన కోసం పల్లె నుండి పట్నం వరకు "బీసీల ధర్మపోరాట దీక్షలు"

3) నవంబర్ 16వ తేదీన రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

4) నవంబర్ 20 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున నవంబర్ 18వ తేదీన పార్లమెంటు సభ్యుల పైన ఒత్తిడి పెంచడానికి "ఎంపీలతో బీసీల ములాఖత్"

5) నవంబర్ 23వ తేదీన బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం

6) డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి

7) డిసెంబర్ మూడోవారం నుండి పల్లె నుండి పట్నం వరకు బీసీల బస్సు యాత్ర

8) జనవరి 4వ వారంలో లక్షలాది మందితో "వేలవృత్తులు- కోట్ల గొంతులు" అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement