‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్.. | 'sakshi' festival celebrating the promise .. | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్..

Dec 21 2013 1:41 AM | Updated on Sep 2 2018 4:03 PM

‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్.. - Sakshi

‘సాక్షి’ పండుగ సంబరాలు వచ్చేశాయ్..

సాక్షి పండుగ సంబ రాలు రోజుకొకరిని లక్షాధికారిని చేయనున్నాయి. నగరంలో ఈ నెల 22 నుంచి జనవరి 5వ తేదీ వరకూ ‘సాక్షి’ఎంపిక..

విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి పండుగ సంబ రాలు రోజుకొకరిని లక్షాధికారిని చేయనున్నాయి. నగరంలో  ఈ నెల 22 నుంచి జనవరి 5వ తేదీ వరకూ ‘సాక్షి’ఎంపిక చేసిన షోరూమ్‌ల్లో కొనుగోలు దారులకు అందజేసిన కూపన్‌లకు ప్రతిరోజూ లక్కీ డిప్ నిర్వహించి, విన్నర్‌కు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.  

ఇంకెందుకు ఈ నెల 22  నుంచి  సాక్షి పండుగ సంబరాలు నిర్వహిస్తున్న షోరూమ్‌లలో షాపింగ్ చేయండి.. లక్షాధికారులు కండి. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఎంజీ రోడ్డులోని కళానికేతన్ షోరూమ్‌లో  ఘనంగా జరిగింది. కొనుగోలుదారుల హర్షధ్వానాల మధ్య నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు.  

కార్యక్రమ వివరాలను బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ వివరించారు.  కళానికేతన్ ఎండీ వి.నాగభూషణం(చంటి), సాక్షి ఏజీఎం(యాడ్స్) వినోద్ మాదాసు, బ్యూరో ఇన్‌చార్జి టి.నాగభూషణం, రీజినల్ మేజేజర్ (యాడ్స్) సీహెచ్ అరుణ్‌కుమార్, బ్రాంచ్ డెప్యూటీ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్‌తో  పాటు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు, కళానికేతన్ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement