కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్! | TVS Launches TVS Paddock Premium Retail Network for High End Bikes | Sakshi
Sakshi News home page

కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!

Jun 7 2026 3:29 PM | Updated on Jun 7 2026 3:59 PM

TVS Launches TVS Paddock Premium Retail Network for High End Bikes

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ 'టీవీఎస్ ప్యాడాక్' అనే కొత్త ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కంపెనీ దీనిని స్టార్ట్ చేసింది.

టీవీఎస్ ప్యాడాక్ ద్వారా వినియోగదారులు సాధారణ షోరూమ్ కంటే మంచి ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ప్రీమియం అవుట్‌లెట్లను లండన్‌కు చెందిన చెక్‌ల్యాండ్ కిండ్లీసైడ్స్ సంస్థ రూపొందించింది. ఇందులో కొత్త ప్రీమియం బైకుల ప్రదర్శన ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులకు ప్రత్యేక సలహాలు ఇచ్చే కన్సల్టేషన్ జోన్లు, బ్రాండ్‌కు సంబంధించిన మెర్చండైజ్ వస్తువులు, సర్వీస్ సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

అయితే.. తొలి టీవీఎస్ ప్యాడాక్ అవుట్‌లెట్లు 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత దశలవారీగా వీటిని దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. 2026 ఇన్నోవా క్రిస్టా లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement