2026 అపాచీ RTR లాంచ్: ధర ఎంతంటే? | 2026 TVS Apache RTR 160 4V launched | Sakshi
Sakshi News home page

2026 అపాచీ RTR లాంచ్: ధర ఎంతంటే?

Mar 30 2026 9:27 PM | Updated on Mar 30 2026 9:27 PM

2026 TVS Apache RTR 160 4V launched

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు 2026 అపాచీ RTR 160 4V లాంచ్ చేసింది. దీని ధర 1,25,440 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ బైక్ కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

2026 అపాచీ RTR 160 4V ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. USD ఫోర్కులు, TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ చాలా వరకు హైఎండ్ ఫీచర్స్ పొందిందన్నమాట.

2026 అపాచీ RTR 160 4V పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి డే 17.55 Bhp పవర్ అందించే 160 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటి ఫీచర్, ఇది రైడింగ్ పరిస్థితులను బట్టి పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి రైడర్‌లకు వీలు కల్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement