అమ్మకాల్లో హవా.. టీవీఎస్‌ రికార్డ్! | TVS Motor Sales In 2026 April Up 7%, Scooter Segment Drives Growth, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అమ్మకాల్లో హవా.. టీవీఎస్‌ రికార్డ్!

May 3 2026 2:42 PM | Updated on May 3 2026 4:54 PM

TVS Motor Sales in 2026 April

టీవీఎస్‌ మోటార్‌ ఏప్రిల్‌లో 4,73,970 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన  4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్‌ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన  6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి.

దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement