భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పీవీలలో ఒకటైన 'టయోటా ఇన్నోవా క్రిస్టా' కొత్త హంగులతో లాంచ్ అయింది. ఈ 2026 మోడల్ ప్రారంభ ధర రూ.19.72 లక్షలు (ఎక్స్ షోరూమ్).
రెండు దశాబ్దాలకు పైగా భారతీయ కుటుంబాల విశ్వాసాన్ని గెలుచుకున్న ఇన్నోవా క్రిస్టా, ఈసారి కొన్ని డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ కారు ముందు భాగంలో కొత్త గ్రిల్ మరింత బోల్డ్ అండ్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అలాగే ముందు.. వెనుక బంపర్ గార్నిష్‌లు కూడా అప్డేట్ అయ్యాయి. సిల్హౌట్ యథాతథంగా ఉన్నప్పటికీ డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ చాలా ఆకట్టుకుంటాయి.
క్యాబిన్‌లో కూడా పలు మార్పులు జరిగాయి. డ్యూయల్ టోన్ లెదర్ సీటు, గ్రేస్ కాపర్ ఫినిష్ ట్రిమ్స్, వుడ్ ప్యాటర్న్ ఇన్‌సర్ట్‌లతో డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్ మరింత విలాసవంతంగా కనిపిస్తున్నాయి. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఎంపిక చేసిన వేరియంట్లలో లభిస్తాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. కొత్త కారు ఎంట్రీ!
కొత్త ఇన్నోవా క్రిస్టాలో కూడా సాధారణ ఇన్నోవాలోని అదే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 148 బీహెచ్‌పీ పవర్, 343 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ ఇంజిన్ లీటరుకు 15 కిమీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.


