తులా రాశి: ఈ రాశివారికి అదృష్ట కాలం.. ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు! | Tula Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27 | Sakshi
Sakshi News home page

తులా రాశి: ఈ రాశివారికి అదృష్ట కాలం.. ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు!

Mar 18 2026 6:30 AM | Updated on Mar 18 2026 6:30 AM

Tula Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం– 5, వ్యయం– 14, రాజయోగం– 6, అవమానం– 3
చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)

ఈ సంవత్సరం గురువు మిథునంలో (భాగ్యం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (దశమం) అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (లాభం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (షష్టం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (పంచమం) కేతువు సింహంలో (లాభం); తర్వాత రాహువు మకరం (అర్ధాష్టమం)లో కేతువు కర్కాటకంలో (రాజ్యం) సంచరిస్తారు.

దైనందిన కార్యక్రమాలలో సాధారణ స్థితి. సమయపాలనతో పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు. ఆర్థిక సమస్యలను నివారించుకుంటారు. ఆదాయం సకాలంలో అందుతుంది. పెద్ద పెద్ద వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, శుభకార్య విజయాల వలన ఖర్చులు. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు. కొత్త స్నేçహాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. సకాలంలో కావలసిన ఋణాలు. ఆరోగ్య అనుకూలత. ఉద్యోగ కార్యకలాపాలలో గౌరవ మర్యాదలు. ప్రమోషన్లకు, స్థానచలనాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు. వ్యాపార ఋణాలు తీర్చుకోవడానికి, మొండి బాకీల వసూలుకు అనుకూలం. మార్కెటింగ్‌ ఉద్యోగులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు పూర్తి సానుకూలత. షేర్‌ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలో, కోర్టు వ్యవహారాలలో విజయావకాశాలు.  

ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ భద్రత అధికం. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం. బంధువులతో వైరం రాకుండా జాగ్రత్తపడండి. గర్భిణులు చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు. సుఖ ప్రసవం జరుగుతుంది.

చిత్త 3, 4 : వృత్తి వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. ఆదాయ వ్యయాలను అదుపు చేస్తారు. 
స్వాతి: కొన్ని పనులు తేలికగాను, మరికొన్ని పనులు అధిక శ్రమతోను పూర్తవుతాయి. 
విశాఖ 1, 2, 3: రోజువారీ పనులు అకాలంలో పూర్తి అవుతుంటాయి. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.
శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. పుట్టతో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో రోజూ అర్చనలు చేయండి. లేకుంటే ఇంటిలోనైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. 

ఏప్రిల్‌: మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్య, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరి నుంచి సహకారం. పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చికాకులు సృష్టిస్తుంది. 

మే: గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు అనుకూలం కాదు.

 జూన్‌: కొన్ని సందర్భాలలో కలహప్రదంగా వ్యవహరిస్తారు. పనులు సరిగా సాగవు. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. 

జులై: బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు ఆగ్రహావేశాలకు లోనవుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ఆగస్ట్‌: సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు. స్థానచలన ప్రయత్నాలు వేగవంతం. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. 

సెప్టెంబర్‌: ఆర్థిక వనరులు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పుణ్య, శుభకార్యాలలో శుభ పరిణామాలు. పెద్దలను, బంధువులను దర్శిస్తారు. 

అక్టోబర్‌: వాహనాల కొనుగోలు, పాడైన వస్తువుల మరమ్మతులపై శ్రద్ధ చూపుతారు.  కుటుంబ అవసరాలు తీర్చడంలో, శుభకార్యాలలో లాభదాయక ఫలితాలు. 

నవంబర్‌: చాలా విజయాలు సాధిస్తారు. వాహన ఖర్చులు పెరుగుతాయి. పనుల వాయిదా వల్ల చికాకులు. ఉద్యోగ, ఆర్థిక విషయాలలో సత్ఫలితాలు. పిల్లల గురించి మంచి వార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్‌: తెలివిగా వ్యవహారాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఇబ్బందికరం. వృత్తి ఉద్యోగాలలో విజయాలు. ఋణ సౌకర్యం అవసరానికి తగిన విధంగా అందుకుంటారు.

 జనవరి: ఆదాయ వ్యయ ఋణ వ్యవహారాలలో సమన్వయం. ఇబ్బంది లేని జీవనం. క్షణం వృథా చేయకుండా ఉంటారు. ఎంతటి పని అయినా తేలికగా సాధిస్తారు. ఫిబ్రవరి: అనేక విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. అవయవ ప్రతికూలతలు. ఉద్యోగంలో అభివృద్ధి. ఊహించని లాభాలు పొందుతారు. 

మార్చి: ఒక్కోసారి విజయపరంపర కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇబ్బందికర ఘటనలు ఎదురవుతాయి. వృత్తి విషయాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ చూపక కలహాలకు అవమానాలకు అవకాశం ఇస్తారు. వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement