breaking news
Ugadi Panchangam
-
పంచాంగ శ్రవణం.. తరలివచ్చిన జనం
నిజాంపేట్: అది వేంకటేశ్వర స్వామి సన్నిధి.. భక్తులకు పెన్నిధి.. ఆలయ ప్రాంగణం వేదికగా పంచాంగ శ్రవణం.. స్థానికులు భారీగా తరలివచ్చి శ్రద్ధాసక్తులతో వీక్షించారు. ఇదీ ఆదివారం సాయంత్రం బాచుపల్లిలోని క్రాంతినగర్ కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించిన సన్నివేశం. ‘సాక్షి’మీడియా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. ‘సాక్షి’డైరెక్టర్ రాణిరెడ్డి, ఆలయ చైర్మన్ కాంతారావు, సర్క్యులేషన్ జీఎం కీర్తికిరణ్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం చేసిన కళాత్మక కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్సాచార్యులు పంచాంగ పఠనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాశిఫలాల గురించి చాలా విపులంగా వివరించారు. ‘విశ్వాసం అని నామధేయంతో ఈ సంవత్సరముంది. విశ్వాసులు అంటే సూర్యుడి ప్రజ్వలితం ఏ «విధంగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అంతే ప్రజ్వలితంగా ఉంటుంది. అందరి జీవితాల్లో విశ్వావసు అంత గొప్ప వెలుగును నింపుతుంది. 12 రాశుల వారికి 12 స్థానాల్లో శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అనంతరం అన్ని రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజయోగం, అవమానం ఏ యే స్థాయిల్లో ఉందో వివరించారు. తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సరర్‌గా వ్యవహరించింది. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ మేనేజర్ వినోద్‌కుమార్, మహేశ్‌రెడ్డి, స్థానిక నాయకులు జీవీ రెడ్డి, కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్‌రెడ్డి, సంగమేశ్, మహేశ్, వెంకటేశ్, భూపతి, చరణ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.రాశి ఫలాలు తెలుసుకున్నాం.. ఉగాది పండుగ సందర్భంగా మా కాలనీలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. పంచాంగంతో మా రాశుల ఫలాలు తెలుసుకున్నాం. సిద్ధాంతి గారి ఆధ్యాతి్మక ప్రసంగం ఎంతో ఆలోచింపజేయడంతోపాటు ఆచారించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. – జి.ప్రసన్న, క్రాంతినగర్అవగాహన కలిగింది.. శుభ ముహూర్తాలు, అందులో గ్రహాల బలాల వల్ల జరిగే ఫలితాలు బాగా అర్థమయ్యాయి. సాక్షి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు రాశి ఫలాలపట్ల అవగాహన ఏర్పడింది. –ఎ.ఊర్మిళ చాలా సంతోషంగా ఉంది.. ఉగాది పండుగను ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి మీడియా ఆ«ధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాదిని ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. తెలుగు పండుగల ప్రాధాన్యతను ఇలా చాటి చెప్పడం మంచి పరిణామం. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. – కాంతారావు, ఆలయ కమిటీ చైర్మన్, క్రాంతినగర్‘సాక్షి’ చొరవ అభినందనీయం ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సాక్షి మీడియా ఎంతగానోకృషి చేస్తోంది. వాటితోపాటు పండుగలను నిర్వహిస్తూ తెలుగు సంప్రదాయాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. – నందిగామ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి -
పంచాంగ సూచనలు
సూర్యభగవానుడు ధనస్సురాశిలోఉండే మాసాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షణ, శివార్చన సర్వసిద్ధిప్రదం. విద్యాప్రాప్తి కొరకు మేధా సంపత్తి కొరకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. నీలంరంగు ఉమ్మెత్త పూలతో అర్చన చేయుట సర్వకార్యసిద్ధి, శత్రుసంహారము. సంసార సంబంధమైన సర్వబాధలు నివారణకు లకీ‡్ష్మనరసింహస్తోత్ర పారాయణ చేయండి. శ్రీచక్రం ఇంట్లో వుంటే శౌచం ఎక్కువగా పాటించాలి. శివునికి బిల్వపత్రం, గణపతికి గరిక, విష్ణువుకు తులసి మహాప్రీతి. సంతానప్రాప్తికి శివారాధన విశేష ఫలితాలనిస్తుంది. బృహస్పతి అనుగ్రహం కోసం గురువారం శనగలు దానం చేస్తే మంచిది. షష్టిపూర్తి 60 నిండిన తర్వాత సంవత్సరాలలో చేసుకోవలెను. ఉగాదినాడు పంచాగానికి కాలపురుషాయ నమః అని పూజ చేయవలెను. కలియుగంలో భగవంతుడి నామస్మరణం ముక్తికి సులభోపాయం. రోజూ గణపతి స్తోత్ర పారాయణ వలన విఘ్నాలు తొలగును. దక్షిణామూర్తి, హయగ్రీవ దేవతా ఆరాధన వలన విద్యాప్రాప్తి. నిత్య భగవదారాధన తర్వాత, లోకక్షేమం కొరకు కూడా ప్రార్థించుట మంచిది. రోజూ కొంత సమయం దేశక్షేమం కొరకు దైవారాధన చేయుటచే మంచి నాయకులు ఉద్భవిస్తారు. దేవతారాధన ఎంతో– పితృదేవతా రాధనకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ఉగాదినాడు పంచాంగ పూజ, శ్రవణం తప్పక చేయవలెను. నిత్యపూజలో నివేదన చేసే పదార్థం మీద ఆవునెయ్యి తప్పనిసరిగా వేయాలి. నిత్యం దేశక్షేమం కోసం కొంత సమయం దైవారాధన చేయండి. కుజగ్రహశాంతికి సుబ్రహ్మణ్య, హనుమ పూజలు శ్రేయస్కరం. అక్షరాభ్యాసములకు ఉత్తరాయనం విశేషం కొత్తబియ్యాన్ని పితృదేవతలకు నివేదించిన తరువాతే ఉపయోగించాలి. రోజు దైవారాధన అయ్యాక భగవంతునికి యథాశక్తి నైవేద్యం పెట్టవలెను పుష్కర శ్రాద్ధం సోదరులు అందరూ కలసి పెట్టరాదు. విడిగానే పెట్టాలి. గరికతో రోజూ గణపతిని అర్చిస్తే, కార్యవిజయం, కేతుగ్రహానుకూలం. పితృ దేవతారాధన సరిగా చేయకుంటే కుటుంబంలో దోషాలు వస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మి ఆరాధన చేయండి. మాసశివరాత్రి రోజు శివకళ్యాణం చేయుట ద్వారా వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. బుధ గ్రహ అనుగ్రహం కోసం విష్ణు స్తోత్రములు పారాయణ చేయవలెను. ప్రతిరోజూ ఉదయకాలంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. శని త్రయోదశీ ప్రదోషకాలంలో శివపూజ ద్వారా సర్వసౌఖ్యాలు అందుతాయి. దీపారాధన చేయుటకు ‘‘వత్తులు’’ స్వయంగా తయారు చేసుకోవాలి. కనుమ రోజున ప్రయాణం చేసే ఆచారం మన ప్రాంతాలలో లేదు. మారేడు, తులసీ, తెల్లజిల్లేడు దేవతా వృక్షాలు. వీటిని స్నానం చేయకుండా ముట్టుకోరాదు. వ్యాసపూజ రోజున యతీశ్వరులను పూజించాలి. దుర్గాపూజలు చేయుట ద్వారా రాహుగ్రహ శాంతి కలుగును. గురు, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే విద్యాభంగం ఏర్పడుతుంది. పేగు మెడలో వేసుకుంటే నాళవేష్టన జనన శాంతి చేయించాలి. వర్జ్యంలో పుడితే విషఘటికా శాంతి చేయించాలి. శుక్ర, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే వైవాహిక జీవితం ఇబ్బందికరం. అస్థి సంచయనం కేవలం ఒక జీవనదిలోనే చేయాలి. రెండు మూడు నదులలో చేయరాదు.శంకుస్థాపన చేసిన రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయుట దోషం కాదు. శుక్ర నక్షత్రాలలో రాహువు, రాహు నక్షత్రాలలో శుక్రుడు ఉండడం వైవాహిక జీవితానికి ఇబ్బంది. శనివారం నువ్వులనూనె శరీరానికి రాసుకొని స్నానంచేయుట ద్వారా శనికి శాంతి. కార్తీకమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కైశిక ద్వాదశి అని అంటారు. కుజ గ్రహ శాంతి చేయించినా కుజదోషం ఉన్నవారికి ‘’కుజదోషం ఉందనే’’ చెప్పాలి. భగినీ హస్త భోజనం కార్తీక శుద్ధ విదియ నాడు చేయుట ఆయుర్వృద్ధి.గ్రహణ శాంతిగ్రహణ శాంతి: గ్రహణ సమయంలో ఇంట్లోని అన్ని వస్తువుల మీద దర్భలు ఉంచడం మన సనాతన ధర్మం. గ్రహణ ఆరంభంలో అందరూ సనాతన ధర్మం ఆచరించేవారు. స్నానం చేసి దైవ సంబంధ స్తోత్ర పారాయణ మంత్ర, జపాదులతో కాలక్షేపం చేసి గ్రహణానంతరం స్నానం చేయండి.దానం: వెండిచంద్రబింబం, నాగపడగ, బియ్యం, గోధుమలు, తెలుపువస్త్రం, కెంపు, రాగిపాత్ర, కంచుపాత్ర, నువ్వులు, ఆవునెయ్యి, దక్షిణ దానం ఇవ్వవలెను. గ్రహణం రోజు, మరుసటి రోజు లేదా మరల పౌర్ణమి లోపు దానం ఇయ్యవచ్చును. వెండితో చంద్రబింబం మాదిరిగా (బొట్టు బిళ్ళ మాదిరి) చేయించి దానం చేయవలెను.దాన సంకల్పం: ‘‘మమ జన్మరాశి జన్మనక్షత్రవ శాద్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే’’దాత చదవవలసిన శ్లోకం: తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమ తారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.. ఎటువంటి దానం ఎప్పుడు ఇచ్చినా దానంతో పాటుగా ‘స్వయంపాకం’ ఇవ్వడం శుభప్రదం. గ్రహజపం వంటివి చేయించినాసరే ఇవ్వండి.గ్రహణశాంతి అనేది మహర్షులు గ్రంథస్థంగా చెప్పిన అంశం. దీనికి వైదికాచారం జోడించి పెద్దలు చెప్పే విషయాలను ప్రస్తావన చేశాం. సూర్య చంద్రులను ప్రత్యక్ష దైవాలుగా భావన చేసి మనం నిత్యం దైవ సంబంధ కార్యాలు చేస్తూ ఉంటాము. వారిరువురిలో ఏ ఒక్కరైనా ప్రత్యక్షంలో లేరు అంటే గ్రహణంగా భావన చేసి శాంతి పూజ చేయుట మన మతాచారం. అందుకోసమే ప్రతి అమావాస్య వెళ్ళిన మరుసటిరోజున, గ్రహణం మరుసటిరోజున, జాతాశౌచ, మృతాశౌచములకు మరుసటì æరోజున దేవతామందిరం అంతా కూడా శుభ్రంచేసి మరలా విగ్రహాలను కడిగి శుద్ధి చేసి దేవతామందిరములో పెట్టి అర్చన చేయడం మన సంప్రదాయం. -
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
మేష రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–7.అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (తృతీయ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (లాభ), కేతువు సింహరాశి (పంచమ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (వ్యయం)లో సంచారం. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని, పనులు పాడవడం జరగదు. దూకుడుగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపం చేస్తారు. బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి, పనివాళ్లతో సమస్యలున్నా, లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు, కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఋణాలను ఎగవేసే వారు ఎక్కువ అవుతారు. కొత్త ఋణాలు దొరకవు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. నరాలు, ఎముకల సమస్యలు పెరగగలవు. మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా, మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు. రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా, ఆశించిన ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు çఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలు మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.అశ్వని: ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అందరితో మైత్రీ భావంతో ఉంటూ, సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు. మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి: మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ మధ్యలోనే వదిలి వేస్తూ ఉంటారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచనా పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ. ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి. శాంతి మార్గం: నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి. రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి. మే 15 తరువాత శని/ గురువులకు జపం దానాలు చేయడం, నవముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: గురు, కుజుల అనుకూలత బాగుంది. ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పనీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు. మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు. అందరికీ మీ మీద వైరభావం రాగలదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. పనులు వాయిదా వేయకండి. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిదికాదు. మే: కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి. వ్యయంలో వున్న రాహు, శని, శుక్ర సంచారం వల్ల ఎక్కువగా ఇుబ్బందికర çపరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి. ఋణాలు తీర్చడం, కొత్త ఋణాలు దొరకడం కష్టమవుతుంది. జూన్: జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి. ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు. బంధువుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ముందుజాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు. జులై: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వ్యవహారాలలో ఓర్పు, సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆగస్ట్: అన్ని పనులు చక్కగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు 21వ తేదీ నుండి వేగవంతమవుతాయి. మీకు అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. స్వబుద్ధితో కార్య జయం. ధన ధాన్యలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. సెప్టెంబర్: బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా, తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు. అక్టోబర్: కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు. అన్న, వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది. అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది. మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి.నవంబర్: వాక్ నియంత్రణ పాటించడం, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి. ఆర్థిక వెసులుబాటు ఉన్నా, అనవసర ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్: ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం. ప్రతిపనికీ అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు. శుభకార్యాలు, బంధు మిత్రుల కలయిక, కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, శ్రద్ధగా ఋణములు, ఖర్చులు నిర్వహిస్తారు. జనవరి: మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి. ఫిబ్రవరి: కాలం అనుకూలంగా ఉంది. గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఋణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర అవుతాయి. స్థిరబుద్ధిని ప్రదర్శించండి. మార్చి: మొండి ధైర్యం పెరుగుతుంది. వ్యయ గ్రహచారం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలత తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. వృషభ రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–3.కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (ద్వితీయ) స్థానంలో ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (దశమ), కేతువు సింహరాశి (చతుర్థ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (లాభ) సంచారం. శని, గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులను అదుపు చేయగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన ఋణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాలను సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు. షేర్ వ్యాపారులకు లాభాల పంట. రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం. మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవయోగం ఉంది.కృత్తిక 2, 3, 4 పాదాలు: అంతా శుభప్రదంగా ఉంటుంది. తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాపారులకు ఋణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. రోహిణి: తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. ప్రజాసంబంధాలు పెంచు కుంటారు.మృగశిర 1, 2 పాదాలు: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. పుణ్యకార్య, శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ. ఖర్చులు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతః కాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని, నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం. పంచముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: అన్ని పనులలోను ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు వెడతారు. మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయత్నించవలసిన పనులు ఏమయినా ఉంటే 14వ తేదీ లోపుగా చేయండి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. మే: ఎక్కువకాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిరోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్: ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తుంటాయి.పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. జులై: చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతిపనీ అనుకూలమే. మనస్సౌఖ్యం ఎక్కువ. ధనధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబపరంగా అన్నీ అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఋణ, ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు. ఆగస్ట్: అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి. భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది. తరచుగా పనులు మరచిపోతుంటారు. పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది. అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది. సెప్టెంబర్: వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. గత సమస్యల పరిష్కారానికి, కొత్త పనుల ప్రణాళికా రచనకు ఈ నెల అనుకూలం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అందరి నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు. అక్టోబర్: మనోధైర్యంతో ఉంటారు. విద్యా, వినోద, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది. పదిమందికీ సలహాలు ఇస్తారు. ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్: ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబపరంగా గురు, శుక్ర, కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. జ్ఞాతి వైరం ఎక్కువగా ఉం టుంది. శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలలో విçఘ్నాలు ఎదురవుతాయి. అనవసర కాలక్షేపాలు చేస్తారు. డిసెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా, అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు. ఇతర వ్యాపకాలు పనికిరాదు. కేవలం వృత్తి, కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. పాత ఋణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. జనవరి: పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భోజన వసతి 17వ తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఫిబ్రవరి: గోచారం చాలా బాగుంది. ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి, ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి: కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిథున రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–4, అవమానం–3.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (జన్మ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (నవమ), కేతువు సింహరాశి (తృతీయం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (దశమ) సంచారం. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతుంటారు. చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ప్రతిపనీ పరధ్యానంగా చేస్తారు. మీ ప్రయత్నాలు ఏవీ సరిగా సాగవు. చతుష్పాద జంతువులతో ఇబ్బంది ఉంటుంది. సమయపాలనతో రోజువారీ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మే వరకు కొన్ని సమస్యలు ఉంటాయి, మే తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబ వ్యవహారములలో ఇతరుల ప్రమేయాన్ని ఖండిస్తేనే సుఖపడతారు. ఉద్యోగ విషయాల్లో మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు. ప్రతిపనీ మీ అవగాహన లోపం వలన ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆలోచనలకు, అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనిశ్చితి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువ. అనవసర ఖర్చులను నియంత్రించలేకపోతారు. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వస్తునష్టం ఉంటుంది. కొత్త ఋణాలు సకాలంలో అందవు. పాత ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చికాకుపడుతుంటారు. మార్కెటింగ్ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత మంచి ఫలితాలు పొందగలరు. షేర్ వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. రైతులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందు తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిపనీ చికాకు పెడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. విదేశీ నివాస ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలలో పనులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు చాలా విషయాలలో ధైర్యంగా ఉన్నా, బుద్ధి కుశలత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుంచి పెరుగుతుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కలవర పడుతుంటారు. ఆరోగ్యంలో తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర ఘటనలేవీ ఉండవు. జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం.మృగశిర 3, 4 పాదాలు: మీ స్వభావ సిద్ధమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. చతుష్పాద జంతువులు, పెంపుడు జంతువులు ఇబ్బంది సృష్టిస్తాయి. నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా కొంత అనుమానించేలా ఉండటంతో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. ఆరుద్ర: అంతా శుభ పరిణామాలే ఉంటాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. విద్యా, విజ్ఞాన, విషయ శోధనలో కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ధనం వెసులుబాటు, పనివారి సహకారం తక్కువగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు: తరచుగా బుద్ధి స్థిమితం కోల్పోతుంటారు. ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు. అస్థిర బుద్ధితో ఏ పనీ సరిగా చేయలేరు. ఋణ విషయాలలో అవమానకర ఘటనలు ఉంటాయి. శాంతి మార్గం: కుజ గురువులకు జప, దాన, తర్పణ వంటివి తరచుగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రోజూ పఠించండి. ప్రదోషకాలంలో శివాలయంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు సంతృప్తికరంగా వ్యాపారం చేయగలుగుతారు. గురువులను, పూజ్యులను తరచుగా దర్శిస్తుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు సానుకూలం. మే: చాలా అనుకూల వాతావరణం. స్వయంగా పనులు పర్యవేక్షించడం, స్వబుద్ధితో ఆలోచించడం, సమయపాలన ద్వారా విజయావకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహకారం, తోటివారి సహకారం బాగా అందుతుంది. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్: కేవలం ఓర్పు, సహనం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఋణ సౌకర్యం తగ్గుతుంది. జులై: వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. ధనవ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. వస్తువులను తరచుగా మరచిపోతుంటారు. కార్యవిఘ్నం తరచుగా ఉంటుంది. మొండి ధైర్యంతో పనులకు శ్రీకారం చుడతారు. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్: చాలా విచిత్రమైన కాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. విజయాలు సాధిస్తారు. పని ఒత్తిడి ఎక్కువ. అనుకోకుండా కొత్త పనులు చేయవలసి వచ్చి రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సెప్టెంబర్: ఇబ్బందులు లేని కాలమే నడుస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేస్తారు. అంతా శుభంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంటుంది. పెద్దలు, పూజ్యులు, గురువుల సందర్శన, పుణ్యకార్య నిర్వహణలో కాలక్షేపం జరుగుతుంది. అక్టోబర్: సాధారణ జీవనశైలితో ముందుకు వెడతారు. తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం బాగుంటుంది. అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారం బాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు ఇబ్బంది లేకున్నా, భయంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు, శ్రమాధిక్యం ఉంటాయి. నవంబర్: ఊహాతీతంగా పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోని వ్యక్తులు కూడా సహకారం అందిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అప్పులు తీర్చడానికి అనుకూలం. ప్రయాణాలు అధికంగా చేస్తారు. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: శుక్ర, కుజుల అనుకూలత తక్కువగా ఉన్నందున కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకుండా కాలక్షేపం చేయండి. ప్రతి విషయంలో ఓర్పు అవసరం. స్నేహితుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండండి. బంధువర్గంతో కలసి చేసే వ్యాపార వ్యవహారాలు సానుకూలం కావు. పుణ్యకార్య, పుణ్యక్షేత్ర సందర్శన ఖర్చులు పెరుగుతాయి. జనవరి: తరచుగా చేస్తున్న పనులు మానేసి, దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. రవి, కుజ, శుక్ర, బుధ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారాన్ని స్వయంగా సాధించుకోవాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. ఋణ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: చాలాకాలం తరువాత అనుకూల గ్రహచారం చూస్తున్నారు. 13వ తేదీ నుండి కొంత మార్పు, 23వ తేదీ నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. పుణ్య, శుభకార్యాలు చేస్తారు. క్రమంగా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఈనెల ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఋణ సమస్యలు తీరడానికి మంచి మార్గం దొరుకుతుంది. మార్చి: గ్రహచారం అద్భుతంగా ఉంది. అందరూ సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. వాహన కొనుగోలు, అలంకరణ వస్తు కొనుగోలు పనులు వేగంగా జరుగుతాయి. కర్కాటక రాశిఆదాయం–8, వ్యయం–2, రాజయోగం–7, అవమానం–3పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (నవమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అష్టమ), కేతువు సింహరాశి (ద్వితీయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (భాగ్య) సంచారం. ఒక్కోసారి అనుకూలత, ఒక్కోసారి ప్రతికూలత ఎదురవుతాయి. మే నెల నుంచి మానసిక, శారీరక శ్రమ ఎక్కువ. మీ వస్తువులను ఏదో ఒక రూపంగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలనే విషయాలలో అనవసర ప్రయత్నాలు చేస్తారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. రోజువారీ పనుల్లో సమయపాలన లేక ఇతర పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు, మీకు సమన్వయం కుదరక బాధపడతారు. పెద్దల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల ప్రమేయం ఎక్కువ. ఉద్యోగులు మే తరువాత అధికారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటారు. మే వరకు తెలివిగా ప్రవర్తిస్తారు. స్థానచలనం, ప్రమోషన్ ఆశించిన రీతిలో ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు మే నెల నుండి ఉన్నాయి. వ్యాపారులకు జాగ్రత్తలు మే నుంచి ఎక్కువ అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన ఉండదు. మే తరువాత నిల్వలు తీసే ఖర్చులు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో అనుకూలత లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్ద ఇబ్బంది లేకున్నా, మంచి వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నుంచి చికాకులు పెరుగుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ. నకిలీ పురుగు మందులు, ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో మే నుంచి ప్రతికూలతలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. సమర్థంగా ప్రవర్తించలేరు. అనవసర విషయాలు కలవర పెడుతుంటాయి. లేని అనారోగ్యాలకు కూడా భయపడతారు. గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మే 15 తరువాత ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించలేక ఇబ్బందులకు లోనవుతారు. పునర్వసు 4వ పాదం: అనవసర ప్రయాణాలతో ఖర్చులు ఎక్కువవుతాయి. అందరితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సానుకూలత ఉండదు. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులకు సçహాయం చేసి అవమానాలకు లోనవుతుంటారు. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉన్నా, ఆశించిన ఫలితాలు అందవు. పుష్యమి: వృథా కాలక్షేపాలు అధికం అవుతాయి. వృత్తి విషయంలో మీ ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. కుటుంబ విషయాలలో మంచి చేసినా అవమనాలకు లోనయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష: తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని స్థానచలనం లేదా మార్పు ఉంటుంది. సమయపాలన లేకుండా పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.శాంతి మార్గం: రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ మంచిది. కేతువుకు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది. శివాలయంలో రోజూ ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. గురు రాహు కేతువులకు జపదానం తర్పణం మేలో చేయించండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్వయంగా విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అధికారుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కులవృత్తిలో ఉన్నవారికి అనుకూలం. మే: ఆరుగ్రహాలు భాగ్య, రాజ్య, లాభ స్థానాలలో ఉన్నా, జన్మ కుజ, నవమ శని వల్ల ఏదో తెలియని భయం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే భావన పీడిస్తుంటాయి. సమస్యలు ఉన్నా, పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుంది. జూన్: మొదటివారంలో ఆశ్లేష వారికి అనుకూలత తక్కువ. అన్నీ బాగున్నట్లుగా ఉన్నా, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తంగా నిర్వహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే సూచన. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఈ నెలలో కొత్త ఋణాలు చేస్తే, వాటిని తీర్చడం కష్టం. జులై: పుష్యమీ నక్షత్రం వారికి 20వ తేదీ నుండి కొంచెం శ్రమ ఎక్కువ. రాశివారు అందరూ ఏదో ఒక రకంగా పను వాయిదా వేస్తుంటారు. ప్రతిచోట, ప్రతిపనిలోనూ అధిక ఖర్చులు తప్పవు. భోజనం, నిద్ర వంటి రోజువారీ పనుల్లోనూ జాప్యం ఎదురవుతుంది. ఆగస్ట్: వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో పనులు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు విడనాడండి. సెప్టెంబర్: ఆర్థిక సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. ఇంటి విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారు సహకరించరు. కుటుంబ సమస్యల పరిష్కారం తేలికవుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో కాలక్షేపం బాగా సాగుతుంది. అక్టోబర్: కొత్త పనులు చేపట్టినవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారి ప్రతికూలత ఎక్కువ. అధికారుల రక్షణ విశేషంగా ఉంటుంది. స్వబుద్ధితో పనులు సానుకూలం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తేలికగా పూర్తి చేసుకుంటారు. నవంబర్: తెలివి, ఓర్పుతో విజయాలు సాధిస్తారు. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. డిసెంబర్: భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందవు. కొత్త ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. జనవరి: అన్నింటిలోనూ 17వ తేదీ నుంచి అడ్డంకులు పెరుగుతాయి. కోపావేశాలను అదుపు చేసుకోవలసిన కాలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు తగ్గించండి. కలహాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. ఫిబ్రవరి: ఎవరూ మీకు సరిగా సహాయ సహకారాలు చేయరు. పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. మార్చి: అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ నిర్వహణ, వృత్తి నిర్వహణ ఒకదానికి మరొకటి అవరోధాలు సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత తక్కువ. కుజ, గురు, శాంతి చేయించండి. ఉద్యోగ ఒత్తిడితో మీరు అందరితో కలహిస్తారు. ఇతరుల వ్యవహారాలు కలహప్రదంగా మారతాయి. సింహ రాశిఆదాయం–11, వ్యయం–11, రాజయోగం–3, అవమానం–6.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (లాభ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (సప్తమ), కేతువు సింహరాశి (జన్మ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (అష్టమ) సంచారం. మనస్పర్థలు రావడం, వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఏడాది కాలక్షేపం అవుతుంది. గురుబలం ఈ సంవత్సరమంతా శ్రీరామరక్ష. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసినా, సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతుంటారు. రోజువారీ పనుల్లో భోజన, స్నాన, నిద్రలకు కూడా సమయపాలన ఉండదు. కుటుంబ విషయాల్లో మితభాషణ అవసరం. శని, రాహు సంచారం బాగా లేదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు బాగా ఉంటాయి. మీ కింద పనిచేసేవారి ద్వారా ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ తప్పదు. పనివారితో సమస్యలు ఎక్కువ, లాభాలు తక్కువ ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది లేదు కాని, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత, కొత్త ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాత, జీర్ణ çసమస్యలు ఉంటాయి. అయితే మంచి వైద్యం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువైనా, పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు. రైతులకు శ్రమ ఎక్కువ. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఇతరుల సలహాలు పాటించకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. నిత్యం వైద్యుల సలహాలు, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి.మఘ: మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. పుణ్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బ: ఇతరులను నమ్మి ధనం పెట్టుబడులు పెట్టవద్దు. మీ వస్తువులను ఎక్కడైనా మరచిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతాయి. చేసే పనులలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. రోజువారీ పనుల్లో సమయపాలన లోపిస్తుంది. ఉత్తర 1వ పాదం: మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చక ఉద్యోగ, వ్యాపార కుటుంబ విషయాలలో ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పనీ మళ్లీ మళ్లీ చేయవలసి వస్తుంది. అందరినీ అనుమానిస్తుంటారు. పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. శాంతి మార్గం: శని రాహు కేతువులకు శాంతి చేయించండి. మే నెల నుంచి ప్రతి నెలా ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి భువనేశ్వరీ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి. కుదిరినప్పుడు చండీహోమం చేయించండి. సప్తముఖ రుద్రాక్షధారణ చేయడం శుభప్రదం.ఏప్రిల్: ప్రశాంతత కోసం, ధైర్యం కోసం ధ్యానం చేయండి. ప్రతిపనీ కాలవ్యయం, ధనవ్యయం సూచిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా, పాత ఋణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. వ్యవహార ప్రతిబంధకాలు గోచరిస్తున్నాయి. మే: తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని సూచన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. రోజువారీ పనుల్లోనూ తెలియని ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. జూన్: మఘ నక్షత్రం వారికి 7వ తేదీ నుంచి ఆరోగ్య చికాకులు ఉంటాయి. అయితే శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా శుభ, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. జులై: పుబ్బా నక్షత్రం వారు 23 వరకు, ఉత్తర 1వ పాదం వారు 23 నుంచి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. పుబ్బవారు ఈనెల 21 నుండి కొంచెం ఎక్కువ చికాకులు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో చిక్కులు తలెత్తవచ్చు. కుటుంబ, ఆరోగ్య, వృత్తి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: శ్రమ చేసి ముఖ్యమైన సమస్యలు తీర్చుకోండి. ఒకటి రెండు ప్రయత్నాలు చేయడం ద్వారా సహకరించం అనే వ్యక్తులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 నుంచి కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సెప్టెంబర్: ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేయడం, బద్ధకించడం మానకుంటే, 14వ తేదీ నుంచి మంచి పరిణామాలు ఉంటాయి. మీ శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల తోడ్పాటు పెరుగుతుంది. అక్టోబర్: పుబ్బ నక్షత్ర జాతకులు మీ వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంతి ద్వారా పరిశీలన చేయించుకోండి. చాలా సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యసాధనకు కృషి చేస్తారు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. నవంబర్: కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నా, పనుల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందగలరు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళి కలు గురించి చర్చిస్తారు. డిసెంబర్: తెలివిగా కార్యసాధన చేస్తారు. అవరో«ధాలను లెక్కచేయరు. ఉద్యోగంలో కొత్త రకంగా అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు అందుతాయి. రైతులకు విద్యార్థులకు అనుకూలం. దేవాలయ దర్శనములు చేస్తుంటారు. జనవరి: శుభా శుభ పరిణామములతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ, వ్యయ, ఋణ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మాత్రం పూర్తి భిన్నంగా చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి: ప్రతి విషయం సునిశితంగా పరిశీలించి చేయడానికి అలవాటు పడండి. పని ఒత్తిడి 13వ తేదీ నుంచి పెరుగుతుంది. మీ ఇంటి యజమాని లేదా షాపు యజమానితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే రెండు మాసాల గోచారంలో అనుకూలత తక్కువగా గోచరిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఈ నెలలోనే ఆ పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. మార్చి: చేయవలసిన పనులు మానేసి అనవసర వ్యవహారాల్లో తలమునకలు అవుతుంటారు. గ్రహచార ప్రతికూలతలు పెరుగుతున్నాయి. రాబోవు మూడు నెలలలో కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఋణ విషయాలలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాల క్షేపం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణములు విడనాడండి. కలహాలు, కొత్త ప్రయత్నాలు విడనాడండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలత తక్కువగా ఉంది. కన్యా రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (దశమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (షష్ఠ), కేతువు సింహరాశి (వ్యయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (సప్తమ) సంచారం. మే నెల వరకు పుణ్యకార్యాలు, «ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. «సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ప్రతిపనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. కొన్నిసార్లు భయం పొందుతారు. రోజువారీ పనుల్లో మే నుంచి సమయపాలన లేకుండా ప్రవర్తిస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగ విషయాలలో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు. ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది. మే నెల నుంచి మీ కింద పనిచేసే వారితో ఇబ్బంది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఋణ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. కొత్తగా వచ్చే సమస్యలేవీ ఉండవు. భార్యాపిల్లల ఆరోగ్య విషయంలోనూ శుభ పరిణామాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడానికి ఆలస్యమవుతుంది. అయితే నష్టం ఉండదు. షేర్ వ్యాపారులకు తెలివి, ధైర్యం ఉన్నా అనుకున్న ఫలితాలు దక్కవు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా సమయానికి మంచి సలహాలు అందడం వల్ల నష్టం ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. నిరుత్సాహం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా, ధైర్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కావలసిన రీతిలో లబ్ధి పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి కాని, నష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలు చూస్తారు. గర్భిణీ స్త్రీలు కంగారు పడనవసరం లేదు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో సుఖజీవనం సాగిస్తారు.ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు: ఇతరుల విషయాలలో ఎక్కువగా కలుగ చేసుకోవద్దు తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సంఘంలో అనుకూల స్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. అయితే ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. హస్త: ప్రయాణాలను వీలయినంత తగ్గించుకుంటే లాభిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి కాలక్షేపాలు పనికిరాదు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనులు వదిలేసి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు: వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల విషయాలలో కూడా ధైర్యంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ కుటుంబ విషయాలలో పనివారితో సమస్యలు తరచుగా ఉంటాయి. ఋణ వెసులుబాటు అవసర సమయంలో అందక ఒత్తిడికి లోనవుతారు. శాంతి మార్గం: ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ‘‘శ్రీరామశ్శరణంమమ’’ అని చెబుతూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రాతఃకాలంలో లకీ‡్ష్మనారాయణ పూజ చేయండి. ఏప్రిల్‌లో శని శాంతికి జపదానాదులు చేయించండి. రామాయణ పారాయణ మంచిది. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాలు ఆశించిన రీతిగా సాగుతాయి. గురు, కుజుల అనుకూలత దృష్ట్యా ఋణ సమస్యలు ఎలా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు బాగా నడపగలుగుతారు. పాత ఆరోగ్య సమస్యల పట్ల కూడా తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తరచు శుభకార్యాలలో పాల్గొంటారు. మే: అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ చికాకులు రాగలవు. తెలివిగా ఓర్పుగా ఉన్నా, వాత ఆర్థిక ఆరోగ్య కోర్టు సమస్యలు తిరగబెట్టగలవు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టమవుతుంది. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. జూన్: అందరికీ సహకరిస్తారు. మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్నిసార్లు అనుకోని లాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అయినా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. బంధువులకు సహాయం చేస్తారు. జులై: బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యసాధనలో అనుకూల స్థితిని పొందుతారు. కొన్ని మంచి ఫలితాలు కూడా అందుతాయి. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. ఇతరులపై ఆధారపడి ఏ పనినీ మొదలు పెట్టవద్దు. ఆగస్ట్: ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. మితభాషణ ఓర్పు అవసరం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. శుభకార్య ప్రయత్నాలు లాభదాయకంగా పూర్తవుతాయి. సెప్టెంబర్: చిత్త నక్షత్రం 3వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ఆరోగ్య ఋణ సమస్యలు రాగలవు. రాశి వారు అందరికీ 14వ తేదీ నుంచి దూర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. వాహనాలు, ఆభరణాల మరమ్మతులకు ధనవ్యయం బాగా అవుతుంది. అక్టోబర్: అభివృద్ధి నిరోధకమైన అంశాలను సరి చేసుకుని మంచి జీవనం వైపు ప్రయాణం చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. నవంబర్: పనులు సకాలంలో జరగకపోవడం తప్ప మిగిలినవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అందరి నుంచి సహకారం ఉంటుంది. ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.డిసెంబర్: ఉద్యోగులు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు పరిస్థితులు సానుకూలం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. జనవరి: సంతృప్తికరంగా కాలక్షేపం జరుగుతుంది. పనులు ఆలస్యమైనా, సానుకూలం అవుతాయి. ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. గత సమస్యల పరిష్కారానికి అవకాశం చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. ఫిబ్రవరి: కుటుంబ విషయాలు మినహా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారాలలో ఏదో ఒక అడ్డంకి గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అసలు ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. మార్చి: పనులు ఆలస్యమైనా, సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, ఇబ్బందికరం కాదు. రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణం. తులా రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–2, అవమానం–2.చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (భాగ్య) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (పంచమ), కేతువు సింహరాశి (లాభ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (షష్ఠ)లో సంచారం. చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం. మే నెల నుంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్య, శుభకార్యములు, సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. గత సమస్యలు తీరే అవకాశం మే నెల నుంచి పెరుగుతాయి. రోజువారీ పనులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో శుభ పరిణామాలు ఎక్కువ. ఉద్యోగులకు ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కావలసిన వనరులు సమకూరి, ఇబ్బందిలేని వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మే తరువాత ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా, వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంది. పాతా ఋణాలు తీరుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరుతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి. మే నెల నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు ఈ సంవత్సరం జూన్ నుంచి విశేష లాభాలను అందుకుంటారు. రైతులకు శ్రమ కొద్ది లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం, వరుణుడు, సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మే నుంచి విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సమస్యల పరిష్కారానికి మే నుంచి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ప్రశాంత జీవనం సాగిస్తారు. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని అధిగమించి జూన్ నుంచి విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచివైద్యం లభించి సుఖప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 పాదాలు: అద్భుతాలు చూస్తారు. కుటుంబ అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టి మంచి జీవనం సాగిస్తారు. విజయాలు సాధిస్తారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులు, పూజ్యులను దర్శించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వాతి: కుటుంబంలో పెద్దల ఆరోగ్య విష యంగా సేవలు చేయవలసి రావడంతో సొంత పనులలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మితభాషణ అవసరం అని గ్రహించండి. విశాఖ 1, 2, 3 పాదాలు: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలపై మంచి పట్టు సాధిస్తారు. ఋణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల విషయంలో చేయవలసిన పనుల పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది.శాంతి మార్గం: గురు రాహువులకు జప, దానాదులు చేయండి. సంవత్సరారంభంలో రోజూ దేవీ భాగవతం పారాయణ చేయడం బాగుంటుంది. ప్రాతఃకాలంలో విష్ణు సహస్ర నామ పారాయణం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టక పారాయణం ద్వారా పాత సమస్యలు పోతాయి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొన్ని వ్యవహారాలు లాభదాయకంగానూ, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఈ నెల ఎంత మౌనం వహిస్తే అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. మే: మితభాషణ, ఓర్పు ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. గురుబలంతో వృత్తి, ఆర్థిక, ఆరోగ్య వ్యవహార లాభాలు ప్రారంభం అవుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. జూన్: కోపావేశాలు తగ్గించుకోవాలి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. భోజనం అయిష్టమైన విధానాలతో ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయి. జులై: పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలోను, విదేశీ నివాస, కోర్టు, ఋణ వ్యవహారాలలో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా గొప్ప అనుకూల స్థితి. ఆదాయ, వ్యయ, ఋణ వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆగస్ట్: అద్భుతమైన కాలమనే చెప్పాలి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కాలం వృథా చేయకుండా ప్రయత్నించండి. ధన, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్: కుజగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. రోజువారీ పనులు బాగానే ఉన్నా, ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి వెంబడిస్తుంది. ఋణ వ్యవహారాలు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఋణ, ఆరోగ్య విషయాలలో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రభావం వలన కలçహాలు పెరగవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేస్తారు. మీ వద్ద పనిచేసేవారు మీకు బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో కాలక్షేపం చేస్తారు. డిసెంబర్: చాలా వ్యవహారాలను తెలివిగా సాధిస్తారు. పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ వద్ద పనిచేసేవారు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. జనవరి: కుటుంబ వ్యవహారాలను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. బంధువులకు, స్నేహితులకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలత. ఫిబ్రవరి: తెలివిగా ధైర్యంగా వ్యవహార లాభం అందుకుంటారు. వృత్తి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ చేయమని ప్రత్యేక సూచన. ఆదాయ, వ్యయాలను సమర్థంగా నిర్వహిస్తారు. అవసరమైన ఋణాలు సకాలంలో అందుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాలం. షేర్ వ్యాపారులు లబ్ధి పొందుతారు. మార్చి: ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయ కలహాలకు దారి తీస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని తెలివిగా దాటతారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ప్రతి విషయంలో ఆర్థిక వెసులుబాటు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం. మీ పిల్లల నుంచి ఆశించిన ఫలితాలు అందక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. వృశ్చిక రాశిఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–2.విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అర్థాష్టమ), కేతువు సింహరాశి (దశమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశి (పంచమ) సంచారం. ఏ పనిలోను స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు, చోరులు వంటి వారితో చికాకు పడుతూనే ఉంటారు. పరుషంగా మాట్లాడుతుంటారు. రోజువారీ పనుల్లో ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. మీ నుంచి కుటుంబీకులకు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి. భోజన, స్నానాదికాలలో కూడా సమయపాలన లేక జీవనశైలి ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు. ప్రమోషన్, స్థానచలనాలు అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. వ్యాపారులకు అనుకూల లాభాలు లేకున్నా, ఇబ్బందులు ఉండవు. నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి లావాదేవీలు, ఆస్తి తగాదాలలో ఇబ్బందులు తప్పవు. మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మే తరువాత డబ్బు ఇబ్బందులు తప్పవు. కొత్త ఋణాలు సకాలంలో అందవు. వాత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. షేర్ వ్యాపారులకు మే వరకు లాభాలు బాగుంటాయి. మే తరువాత లాభాలు తక్కువగా ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు మే నుంచి ఏకాగ్రత లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాలే శరణ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో విద్య కోసం వెళ్ళేవారికి మే వరకు కాలం అనుకూలం. ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు. కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం లేదనే భావనకు లోనవుతారు. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీలలో సమస్యలు వెంటాడుతాయి. గర్భిణీ స్త్రీలకు మే నుంచి జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు, పెద్దల సంరక్షణ తప్పనిసరి.విశాఖ 4వ పాదం: దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. ఋణ అసౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేయవలసిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్వబుద్ధితో చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ. అనురాధ: స్పష్టత లేని నిర్ణయాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జ్యేష్ఠ: అవసరమైన సమయాలలో ఆత్మీయులు స్పందింపక పోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. çగౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఋణం, ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడతారు. శాంతి మార్గం: మార్చి నెలలో రాహువుకు, మే నెలలో గురువుకు శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవీ భాగవత పారాయణం చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణుపూజలు చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఋణాలు ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మే: స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 15వ తేదీ తరువాత గురుగ్రహ శాంతి చేయించండి. అందరి సహాయ సహకారాలు, గౌరవం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలు చేయండి. ఒంటరిగా దూర ప్రయాణాలు విరమించుకోండి. జూన్: ఆత్మీయుల సేవలను గుర్తించరు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మరలా తిరగబడే అవకాశం ఉంటుంది. అవసరాలకు తగిన డబ్బులు సర్దుబాటు జరగదు. కొన్ని సందర్భాలలో మనో నిబ్బరం ప్రదర్శిస్తారు. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జులై: కోపావేశాలకు అనుకూల కాలం కాదు. ఉద్యోగ రీత్యా అనవసర తిరుగుడు పెరుగుతుంది. జీర్ణసంబంధ ఇబ్బందులు రాగలవు. పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. అధికారులు, తోటివారు సహకరించరు. అవసరానికి ధనం అందుబాటు తక్కువ. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆగస్ట్: కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. చాలా విషయాలలో స్వయంగా శోధించి, విజయాలు అందుకుంటారు. తెలియక చేసిన పొరపాట్లు నెలాఖరులో సరిచేసుకునే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబసభ్యులు సహకారం తక్కువ. ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ స్థితి ఉంటుంది. సెప్టెంబర్: అధిక గ్రçహానుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వ్యయాలు సమతూకంగా లేకున్నా, సమర్థంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో కొత్త ఋణాలు చేయవద్దు. అక్టోబర్: ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు మంచి మాటలు చెప్పినా, అవి వికటించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. నూతన ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరం. అవసరానికి తగిన ధనం చేకూరదు.నవంబర్: పనులు కొంచెం ఇబ్బందికరం అవుతున్నా, అన్నింటా సమర్థంగా వ్యవహరిస్తూ ముందుకు వెడతారు. ఫలితాలు ఆశించిన రీతిగా ఉండవు. విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగవు. డిసెంబర్: వృత్తి ఉద్యోగాలను శ్రద్ధగా నడపలేని పరిస్థితి ఉంటుంది. పనులు దాటవేసే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పిల్లలు వ్యతిరేక ధోరణితో ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలలో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఋణాలు చేయవద్దని సూచన. జనవరి: మంచి కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ధైర్య స్థైర్యాలను అన్ని విషయాలలోనూ ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. గత సమస్యలకు పరిష్కారాలను త్వరగా వెదకగలుగుతారు. కొత్త ఋణాలు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఫిబ్రవరి: మంచి అనుభూతులు మిగిల్చే కాలం. అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం అయినా, తెలివిగా వ్యవరించి, లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. కుటుంబ, వృత్తి విషయాలు రెండింటినీ సమర్థంగా నడిపి మంచి పేరు సాధిస్తారు. మార్చి: రోజువారీ పనులలో బాగా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరులకు సçహాయం చేయడాన్ని ఒక విధిగా భావించి చేస్తుంటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అధికారుల తోడ్పాటు తక్కువ అయినా నష్టంలేని జీవితం సాగుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. ఆదాయ, వ్యయ ఋణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. మాట నిలబెట్టుకోలేరు. ధనూ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–5మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (సప్తమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (తృతీయం), కేతువు సింహరాశి (భాగ్య) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (అర్ధాష్టమ) సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేసిన పనులకు తగిన గుర్తింపు రాదు. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ జీవనానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. స్నేహితులతో మిత సంభాషణ, సంచారం చేయండి. రోజువారీ పనులపై ప్రత్యేక దృష్టి ఉంచండి. కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబసభ్యుల కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదరద్వేషం తప్పదు. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసుకుంటే మీకు కావలసిన చోటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరూ సహకరించకపోయినా, విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సూచనలు అందుతాయి. వ్యాపారులకు కొన్నిసార్లు విశేష మందగమనం, కొన్నిసార్లు విశేష లాభాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి. ఋణ విషయాలు సానుకూలం. వాత సంబంధ ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు. మార్కెటింగ్ ఉద్యోగులు జూన్ నుంచి తేలికపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు బుద్ధి, ఓర్పుతో లాభాలు అందిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు మంచి కాలం. కోర్టు వ్యవహారాలలో స్వయంగా అన్నీ శోధిస్తే విజయం పొందగలరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగం చేయమని సూచన. వాహన కొనుగోలుకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో అంతా లాభదాయకం. ఈ రాశి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతిపనీ చేయగలం అనే ధీమా ఉంటుంది. ఉద్యోగినులకు ప్రమోషన్లు ద్వితీయార్ధంలో అందుతాయి. వ్యాపారులు శ్రమతో పనులు పూర్తి చేసు కుంటారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. జూన్ దగ్గర నుంచి అంతా అనుకూలం. కావలసిన వైద్య సదుపాయాలు, మంచి సంరక్షణ అందుతాయి. మూల: ఎవరికీ హామీలు ఇవ్వవదు. ముఖ్య వ్యవహరాలలో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం కావడం మేలు. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. పూర్వాషాఢ: మీ సహననానికి పరీక్షా కాలం. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా, సమస్యలు ఉండవు. వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యాపారులకు విజయావకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు వద్దు అనుకుంటూనే ప్రారంభించి, రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ. శాంతి మార్గం: కుజగ్రహ సంచారం ఎక్కువ ఇబ్బందికరం. జూన్ వరకు నెలకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతాయి. రోజువారీ జీవనశైలిలో విశేష మార్పులు చూస్తారు. కొన్ని సందర్భాలు ఆనందాన్ని, కొన్ని సందర్భాలు విచిత్రమైన భయాలు కలుగజేస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మే: ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారో తెలియని పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం ఇవ్వకండి. «అవసరానికి దనం సర్దుబాటు కాకపోవచ్చు. ఇల్లు లేదా వాహనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. 15వ తేదీ తరువాత అనుకూలం. జూన్: తెలివిగా ఉద్యోగ, వ్యాపార సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో నిబద్ధతతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జులై: కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఏకాగ్రత లోపిస్తుంది. వాత సమస్యలు తరచుగా వెంటబడే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్న వస్త్రాలు అందవు. స్థానచలన విషయంలో ప్రతికూలతలు రాకుండా జాగ్రత్త పడండి. తెలియని పొరపాట్ల వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆగస్ట్: అనవసర చర్చలు, వృథా కాలక్షేపాలతో అవసరమైన పనులు దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు తగ్గుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు, వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. సెప్టెంబర్: ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధు మిత్రుల కలయిక మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్య శుభ కార్యాలలో మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. సర్వత్రా విజయం ఉంటుంది. అక్టోబర్: కొన్ని విశేష కార్యక్రమములకు శ్రీకారం చేస్తారు. కాలం చాలా బాగుంది. పనులు వేగం చేయండి. బంధు మిత్రులు బాగా సహకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. నవంబర్: 15వ తేదీ తరువాత అడ్డంకులు తరచుగా వస్తాయి. ఆలోచనా శక్తి బాగున్నా పనుల అమలు కష్టం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అందరూ సహకారం చేస్తున్నట్లుగా ఉన్నా, అది భ్రమ. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే అభివృద్ధి ఉంటుంది.డిసెంబర్: అనవసర భయాందోళనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు నియంత్రించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యం. మంచి ఆలోచనలు చేసినా అమలు చేయలేని స్థితి. జనవరి: బంధుమిత్రుల రాకపోకలలో కలహాలకు అవకాశం ఇవ్వవద్దని సూచన. కొన్ని పనుల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉన్నా, ఋణ విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. కుటుంబ అవసరాలు తీర్చడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. విహార యాత్రలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఫిబ్రవరి: కాలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసేవారు మాత్రమే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. మార్చి: అంతా శుభ పరిణామాలతో గడచిపోతుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యవహారాలు ఈ నెలలో పూర్తి అయ్యే దిశగా పయనిస్తాయి. ఉద్యోగులకు చాలా విశేషమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు బాగా అనుకూలం. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. మకర రాశిఆదాయం–8, వ్యయం–14 , రాజయోగం–4, అవమానం–5 .ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (షష్ఠ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (ద్వితీయ), కేతువు సింహరాశి (అష్టమం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (తృతీయ) సంచారం. కేవలం శని, రాహు సంచారం అనుకూలత వల్ల విజయాలు సాధిస్తారు. అయితే జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాలలో చికాకులు ఉంటాయి. స్వబుద్ధి, స్వశక్తితో విజయాలు సాధిస్తారు. శ్రమతో కూడిన పనులు జూన్‌లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రోజువారీ పనుల్లో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలను కొంచెం ఓర్పుగా చూసుకోవాలి. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది. ఉద్యోగాలలో శని అనుకూలత వల్ల సర్వత్రా విజయమే. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు జూన్ వరకు విశేషం. సంవత్సరం అంతా శుభమే. వ్యాపారులు మార్పులు చేపట్టే ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు. ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించి జూన్ వరకు సుఖపడతారు. జూన్ తరువాత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశములు ఉ్తన్నాయి. తరువాత కొత్త ఋణాలు అందడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు అంతా శుభసూచకమే. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలలో మంచి లాభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు. ఇబ్బందిలేని జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబవృద్ధి సాధించుకుంటారు. గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభప్రదంగా ఉన్నా, అధైర్యం పొందుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయండి.ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు: అనాలోచిత కార్యములు ఎక్కువగా చేస్తుంటారు. నమ్మకంగా మోసగించే లక్షణాలు వున్నవారు మీ పనులలో చొరబడతారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాలలో ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రవణం: మరింత శ్రద్ధ అవసరం. ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇతర వ్యాపకాలు ఆకర్షించినా, వాటి జోలికి పోవద్దని సూచన. మితభాషణ, ఓర్పు మీకు శ్రీరామరక్షగా గుర్తించండి. ధనిష్ఠ 1, 2 పాదాలు: కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి గౌరవం అందుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. వ్యాపారులకు వర్కర్స్ ద్వారా సహకారం అందుతుంది. కొత్త అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలుపై దృష్టి ఉంచుతారు. కుటుంబ ప్రోత్సాహం అద్భుతంగా అందుకుంటారు. శాంతి మార్గం: గురువుకు, కుజుడికి మే నెలలో శాంతి చేయించండి. రోజూ శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. గురుచరిత్ర పారాయణ, సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అష్టముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండేవారు సుఖంగా ఉంటారు. అనవసర ప్రయోగాలు చేసేవారు ఇబ్బందులు పడతారు. ఈ నెలంతా వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వలన అద్భుత ఫలితాలు రాగలవు. విద్యార్థులకు కాలం అనుకూలం. మే: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కోపావేశాలకు గురి అవుతుంటారు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అధికంగా దూర ప్రయాణాలు చేయవద్దు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి విషయానికి అతిగా స్పందించవద్దు. జూన్: బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. జీవనోపాధి మార్గాలు సాధారణ స్థాయిలో నడుస్తాయి. కుటుంబ విషయాల్లో ఎప్పుడెలా సమస్యలు తలెత్తుతాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభం చేకూరుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. జులై: 16 తర్వాత అనుకూలత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళితే విజయావకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా సంచరించేవారికి ఈ నెల చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: చాలా విషయాలు స్వయంగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవు. పూర్తి అనుకూలమైన కాలం కాకున్నా, సరిగా ప్రయత్నిస్తే సమస్యలు దూరం అవుతాయి. కొత్త అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంగా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. సెప్టెంబర్: కోపావేశాలు లేనివారికి, తొందరపాటు నిర్ణయాలు చేయనివారికి చాలా మంచి కాలం. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే వాటి అమలు కష్టసాధ్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్: భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన లాభం, ప్రయాణ సౌఖ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు కొంత శ్రమను పొందినా, లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు లాభదాయకం. నవంబర్: చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి. ధైర్యం తెలివి ప్రతి విషయంలో ప్రదర్శిస్తారు. మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలు చూడడం విడనాడండి. కావలసిన ఆర్థిక వెసులుబాటు, మనిషి సహకారం బాగా అందుతాయి. ప్రశాంత జీవనంతో సుఖపడతారు. డిసెంబర్: వ్యాపార అవరో«ధాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలలో విచిత్రస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఈ నెలలో కదలికలు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాలు మినహా ఇతర పనులు చేపట్టవద్దు అని సూచన. ఋణాలు అవసరానికి సర్దుబాటు కావు. జనవరి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, కుటుంబ విషయాలు మినహా మిగిలిన వాటిని వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవడం మంచిది కాదు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి: శుభాశుభ పరిణామాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో ఎక్కువగా కలుగచేసుకోకండి. పనులు స్వయంగా చేసుకోండి. ఆగ్రహావేశాలు తగ్గించండి. చాలా ఒత్తిడితో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తారు. శుభకార్య పుణ్యకార్యాలలో ధనవ్యయం అధికం అవుతుంది. మార్చి: మంచి మార్పులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ విజయాలకు దగ్గర అవుతారు. రాబోవు మూడు మాసాలలో చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. వేగంగా పనులు పూర్తి చేసి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రశాంత జీవనం చేస్తారు. కుంభ రాశిఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–7, అవమానం–5ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (పంచమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (జన్మ), కేతువు సింహరాశి (సప్తమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (ద్వితీయ) సంచారం. ఏలినాటి శని తృతీయ భాగంలో నడుస్తుంది. రాహువు పెద్దగా యోగించకపోయినా, గురుబలం అనుకూలత వలన మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్నిసార్లు తెలివిగాను, కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తన ఉండేలా చూసుకోండి. రోజువారీ పనులలో స్థిరచిత్తం లోపించడంతో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో అనవసర కలహాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తిస్తుంటారు. గురుబలం వలన పెద్దస్థాయి కుటుంబ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలలో కొన్నిసార్లు ఓర్పుగా ప్రవర్తించి మంచి ఫలితాలు, కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు. అధికారులతో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపారులకు అంతా శుభ ఫలితాలే ఉన్నా, తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది. ఋణ విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి సరిలేక తగిన ఫలితాలు అందుకోలేరు. షేర్ వ్యాపారులకు శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో తప్పుదోవ పట్టించేవారిని గుర్తించి, దూరంగా ఉంచడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో చికాకులు, మోసం వెంట వచ్చినా చివరకు లాభాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మందగమనంగా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. రాహు ప్రభావం వల్ల మీ సేవలకు తగిన గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగానే ఉన్నా, అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందుతారు. దేవీ భాగవత పారాయణ చేయండి. దుర్గా/దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.ధనిష్ఠ 3, 4 పాదాలు: తరచుగా మోసాలకు గురవుతారు. శారీరకంగా ఇబ్బంది ఉందనే భావన గోచరిస్తుంది. చేయవలసిన పనులు ఆపేసి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అంతా బాగున్నా, తెలియని భయం వెంటాడుతుంది. అవసరాలకు కావలసిన డబ్బు అందుతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయరు. శతభిషం: వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు చికాకులు సృష్టిస్తాయి. గొప్ప కోసం విరాళాలు ఇవ్వాల్సి వచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు: ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అనుమానాలు పెరుగుతాయి. నేత్ర బాధలు చికాకులు కలిగిస్తాయి. అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్ తగ్గించండి.శాంతి మార్గం: శని, రాహు, కేతువులకు శాంతి చేయించండి. రోజూ ఇంద్రాక్షీ స్తోత్రం మరియు పిప్పలాద కృత శనిస్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీశంకర రుద్రాక్షధారణ చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది.ఏప్రిల్: సమస్యలు ఉన్నాయో లేవో చెప్పలేని సందిగ్ధ కాలం. ఓర్పుగా ఉండాలి. కొత్త పనులు చేయడం మంచిది కాదు. ఋణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలు రాగలవు. శతభిషా నక్షత్రం వారికి మానసిక అసౌకర్యం, పూర్వాభాద్ర వారికి ఆర్థిక అసౌకర్యం, ధనిష్ఠ వారికి ఉద్యోగ అసౌకర్యం ఉంటాయి. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కువవుతాయి. మే: మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అందరి సహకారం బాగుంటుంది. పూజ్యులు, గురువులు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. జూన్: జూన్, జులై నెలల్లో స్నేహితులు చేసిన పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్ వ్యాపారాలకు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఋణ, ఆరోగ్య విషయములలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడండి. ఓర్పు అవసరం. జులై: మనో ధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా, విజ్ఞాన, ప్రదర్శన చేస్తారు. చాలా వ్యవహారాలలో అడ్డంకులు రావడం, వాటిని తొలగించుకోవడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ. విద్యా వ్యాసంగం బాగుంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. ఆగస్ట్: ఋణ, ఆరోగ్య విషయాలలో ప్రతికూల సలహాలు ఇచ్చేవారికి ఆకర్షితులు అవుతారు. ఆదాయం తక్కువ, ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ప్రతివారికి సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. లాభదాయక సంఘటనలు ఉంటాయి. పెద్దలను దర్శించడం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్: అభివృద్ధికి మీ కోపావేశాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో తెలియని çపరిస్థితి. మితభాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. పనివారిని నమ్ముకొని పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. అక్టోబర్: పనులు సకాలంలో సవ్యంగా పూర్తవని కారణంగా చికాకులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో, తోటివారితో ఇబ్బందులు పెరుగుతాయి. రోజువారీ పనులు కాకుండా కొత్త çపనులు చేపట్టవద్దు. నవంబర్: పనులు సానుకూలం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అన్ని అంశాలలోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూలం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పనులు సకాలంలో అవుతాయి. డిసెంబర్: మానసిక అశాంతి ఎక్కువైనా, విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు ధైర్యం ప్రదర్శిస్తారు. ఉద్యోగాలలో అంతా సానుకూలమే. వ్యాపారులు ప్రోత్సాహకర ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. జనవరి: 13వ తేదీ నుండి జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ వరకు అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణ చికాకులు, ఆరోగ్య చికాకులు ఉంటాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా సంచరించాలి. కొత్త వ్యవహారాలు చేయవద్దు. ఫిబ్రవరి: తరచు ఇబ్బందులు వస్తుంటాయి. అయినా తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు కాని, రాబోవు మూడు మాసాలు ఒత్తిడిగానే సాగుతుంది. ఆరోగ్యం, స్థానచలనం విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు రాగలవు. మార్చి: తరచు ఎదురయ్యే సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ భద్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అధికంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీన రాశి ఆదాయం–5, వ్యయం–5 , రాజయోగం–3, అవమానం–1పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అర్థాష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (వ్యయ), కేతువు సింహరాశి (షష్ఠ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (జన్మ) సంచారం. ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం ప్రారంభం. జన్మ శని, వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ మీరు, మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు. ఇతర పనులు ఆపివేయండి. ప్రతిపనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా ఇబ్బందిలేని జీవనశైలి ఉంటుంది. అలసత్వం, పనులు వాయిదా వేయడం, అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగులు తోటివారితోను, మీ కింద పనిచేసే వారితోను జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత ఉన్నట్లు కనిపించినా, పనులు పూర్తి కావు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. పనివారితో సమస్యలు, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ఋణ విషయములో అవమానాలు ఎదురవకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. గుండె, ఎముకల సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారుల ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం కాదు. రైతులు స్వబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలలో బాగా సçహాయం చేస్తారు అనుకునేవారు కూడా మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు చికాకులతో సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవ. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఇతరుల విషయాలలో కలుగచేసుకోవద్దు. దూర ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద దృష్టి ఉంచరు. మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోగా విమర్శలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి.అనవసర భయాందోళనలు పెరుగుతాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్యలహరి పారాయణ శ్రేయోదాయకం.పూర్వాభాద్ర 4వ పాదం: అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య, ఋణ, కోర్టు విషయాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. అన్ని పనుల్లోనూ వాయిదాలను ఇష్టపడుతుంటారు. ఉత్తరాభాద్ర: వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువ. రేవతి: వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మిత్రుల సలహాలు, బంధు సహకారం అనుకూలించవు. మతిమరపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తుంటారు. శాంతి మార్గం: శని, రాహు, కుజ గ్రహశాంతి అవసరం. రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయస్వామికి ‘‘శ్రీరామ జయరామ జయజయరామ’’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, ప్రదోషకాలంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. గౌరీశంకరం రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ఈ నెలలో చేసే కొత్త ఋణాలు భవిష్యత్తుకు ప్రమాదం అవుతాయి. పనులు వాయిదా వేయడం మానుకోండి. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణాలు విడనాడడం శ్రేయస్కరం. రోజువారీ పనులు మినహా కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవదు.్ద మే: ఒక విచిత్రమైన కాలం. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. చాలా అంశాలలో తెలివి ప్రదర్శించి చికాకులు పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతుంటాయి. జూన్: కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ పనులు ఆలస్యమైనా, సానుకూలంగా పూర్తవుతాయి. వాహన, ప్రయాణ, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. జులై: పనులు సాధించే వనరులు ఉన్నా, ఆలస్యం అవుతుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. అవయవాలు కొంత ప్రతికూలిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు మందగమనంగా ఉంటాయి. ఆగస్ట్: మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతికూల సలహాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. చేయవలసిన పనులు ఆలస్యంగానూ, అనవసరమైన పనులు వేగంగానూ చేస్తూ ఉంటారు. ఎవరినీ నమ్మలేని స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు సానుకూలంగా సాగుతాయి.సెప్టెంబర్: విచిత్రమైన కాలం. ద్వితీయార్ధం కార్య వైఫల్యాలు ఉంటాయి. కొత్త పనులు చేయవద్దు. రోజువారీ పనులలోనూ, వృత్తి వ్యవహారాలలోనూ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. అక్టోబర్: బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. స్థానభ్రష్టతకు, కుటుంబంలో అనైక్యతకు అవకాశాలు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు విరమించండి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దని సూచన. నవంబర్: విచిత్రమైన కాలం. ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తవదు. ప్రతిదానికీ భయపడుతూ ఏ ప్రయత్నమూ సవ్యంగా చేయరు. మానసిక పరిస్థితికి, ఆచరణకు పొంతన ఉండదు. పుణ్యకార్యాలలో అవరోధాలు రాకుండా జాగ్రత్తపడండి. చిన్న చిన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డిసెంబర్: ఉద్యోగంలో మీ అధికారులు బాగా ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారులకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పుణ్యకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను సేవించుకుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. జనవరి: క్రమంగా లాభాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పని లాభదాయకంగా పూర్తవుతుంది. గత సమస్యల పరిష్కారానికి, భవిష్యత్ ప్రణాళికలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ చాలా అనుకూలం.ఫిబ్రవరి: చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఋణ వ్యవహారాలలో అవమానాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణములు, ఒంటరి ప్రయాణాలు రాబోవు మూడు మాసములు అనుకూలంగా అగుపించడం లేదు. ఆర్థికలావాదేవీలు ఇబ్బందికరం. మార్చి: ఆరోగ్య చికాకులు రాగలవు. తెలివిగా పనిచేయగలిగిన శక్తి ఉన్నా, నిస్తేజంగా ఉండిపోతారు. పనులు అనుకూలం కావు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడతారు. మేష సంక్రమణ ఫలముది.14 ఏప్రిల్ 2025 ఉదయం 5:33లకు విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమీ సోమవారం స్వాతి నక్షత్రం వజ్రనామయోగం, కౌలవ కరణం మీనలగ్న సమయంలో రవి మేషరాశిలో ప్రవేశం. సోమవారం సుభిక్షం. సంధ్యాకాలం ప్రజలకు సుఖం. స్వాతీ నక్షత్ర సమయంలో ప్రవేశం హానికలుగును. రోహిణీ చక్ర విధానంగా చూడగా మంచి వర్షానికి అవకాశం. సంవత్సరం అంతా ఉన్నది. ప్రవేశకాల గ్రహ సంచారం ప్రకారం లగ్నంలో చాతుర్గ్రహ కూటమి అందులోను, శని, రాహువులు పరిపాలనా రంగంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. సమాజంలో ఇబ్బందికర ఘటనలకు అవకాశం గోచరిస్తుంది. అయితే గురుసంచారం బాగుంది. కావున సాధారణ స్థాయి ఇబ్బందులుగా గుర్తించవచ్చు.రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ ఫలముది.22–06–2024 పగలు (22.35 వి.ఘ.) గం.2:32ని.లకు విశ్వావసు సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశీ ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మ యోగం తైతుల కరణం తులా లగ్నం సమయంలో రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం. ‘‘అపరేహేః ఆర్ద్రా ప్రవేశం అతిలోక పీడా’’ అపరాహ్ణ కాలములో ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశం లోకులకు ఇబ్బంది. చంద్రుడు మేషంలో ఉన్న కారణంగా దివారాత్రి దోషం తోడయి ఎక్కువ కాలం నీటి ఎద్దడి. అయితే రవి చంద్రులకు ఇరువురికీ శుభగ్రహ కలయిక వలన దోషం తక్కువగా భావించాలి. ద్వాదశ్యాం శుభప్రోక్తం అని చెప్పబడినది. ఆదివారం పశువులకు నష్టం. కశ్యపవచనం దృష్ట్యా భరణిలో చంద్రుడు ఆర్ద్రా ప్రవేశ కాలంలో వున్న కారణం సస్యవృద్ధిగా గమనించాలి. సుకర్మ యోగం సువృష్టి అని చెప్పబడినది. భరణ్యాది చతుష్కమండలం దృష్ట్యా సస్యానుకాలం వర్షయోగం చెప్పబడినది. తులాలగ్న సమయంలో ప్రవేశం సువృష్టి. తైతుల కరణం నిత్యశుభం. ఫలితం: సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సూచన: ఈరోజు వర్షం కురిసినట్లయితే, దానిని ఆధారం చేసుకొని భవిష్య వర్షయోగం నిర్ణయిస్తారు.చంద్రచారముజ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ బుధవారం ‘‘సుభిక్షం క్షేమమారోగ్యం వృష్టిసస్య వివర్ధనం స్వధర్మ నిరతాభూపాః జ్యేష్టాదౌ సౌమ్యవాసరేః’’ సస్యానుకూల వర్షాలు పాడిపంటలు సమృద్ధి ఉంటుంది. రాజులు ధర్మ నిరతులై ఉంటారు. ‘‘ఆషాఢే పంచమీ శుక్లా సోమవారో యదా భవేత్ సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్భవం’’ ఆషాఢ శుక్ల పంచమీ సోమవారం కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను సూచిస్తోంది. ‘‘ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ స్వాతీ సంయుతా మహద్వర్షం భవేద్ధ్రువం’’ అధిక వర్షాలకు అవకాశం. ‘‘ఆషాఢే కృష్ణపక్షే రోహిణీ ఏకాదశీ యుతామధ్యమ వర్షాలు మధ్యంగా సస్యాలు ఫలిస్తాయి. పుష్య అమావాస్య ఆదివారం దుర్భిక్షం మాఘ ఫాల్గుణాలలో అని గ్రహించాలి.మకర సంక్రాంతి పురుష లక్షణ ది.14 జనవరి 2026 రా.8:51లకు పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం, గండ యోగం, కౌలవ కరణం సింహలగ్న సమయాన రవి మకరంలో రవి ప్రవేశం. తర్పణాలు సంకల్పాలు 15 జనవరి ఉదయం నుండి ప్రారంభం కుంకుమోదక స్నానం రాజులకు అరిష్టం. విచిత్ర వస్త్రధారణ శుభం. మందాకినీ నామధేయం రాజులకు నష్టం. -
పంచాంగం చూస్తుండగా కాటేసిన నాగుపాము
కరీంనగర్: మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ ఎరబాటి భాస్కర్‌రావు సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు సీనియర్ సిటిజన్ హరిహర ఆలయం నిర్మాణకర్త రాజేశ్వర్‌రావును కాల్వశ్రీరాంపూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం నాగుపాము కాటువేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాగం చూస్తుండగా పెరట్లో నుంచి పామువచ్చి కాలుపై కాటువేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. గమనించిన రాజేశ్వర్‌రావు అప్రమత్తమై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఫోన్‌చేయగా హూటాముటిన కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యానికి 108లో కరీంనగర్‌కు తరలించారు. రాజేశ్వర్‌రావు కుమారుడు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రఘుపతిరావు, తదితరులు ఉన్నారు. -
ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి: స్వరూపానంద
సాక్షి, విశాఖపట్నం: తెలుగు ప్రజలందరూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక విశాఖలోని శ్రీ శారదాపీఠంలో కూడా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడింది. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయి. ఈ ఏడాదిలో ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు. -
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం.. ఈ ఏడాదిశుభ ముహూర్తాలు ఇవే!
చైత్రమాసం ►22.03.23 బుధవారం, శుక్ల పాడ్యమి ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం. ►26.03.23 ఆదివారం, షష్ఠి రోహిణి, మకరలగ్నం, తె.2.51 గృహారంభం. ►27.03.23 సోమవారం, షష్ఠి రోహిణి, మేషలగ్నం, ఉ.8.15 క్రయవిక్రయాలు, నూతన వస్త్ర ఆరంభము. ►29.03.23 చైత్ర శుద్ధ అష్టమి నుంచి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురు మౌఢ్యమి. ►30.03.23 గురువారం, శు. నవమి పునర్వసు, మేషలగ్నం, ఉ.8.03 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►05.04.23 బుధవారం, శు. చతుర్ధశి ఉత్తర, మేషలగ్నం ఉ.7.39 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►06.04.23 గురువారం, పూర్ణిమ హస్త, మేషలగ్నం, ఉ.7.35 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►07.04.23 శుక్రవారం, బ. పాడ్యమి చిత్త, మేషలగ్నం, ఉ.7.31 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►08.04.23 శనివారం, విదియ స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►10.04.23 సోమవారం, చవితి అనూరాధ, మేషలగ్నం ఉ.7.20 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దసం, కేశఖండన. ►12.04.23 బుధవారం, సప్తమి మూలా, మేషలగ్నం ఉ.7.12 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►15.04.23 శనివారం, దశమి ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. వైశాఖమాసం ►21.04.23 శుక్రవారం, వైశాఖ శు. విదియ భరణి, కన్యాలగ్నం సా. 4.40 వ్యాపారం, క్రయవిక్రయాలు. ►23.04.23 ఆదివారం, చవితి రోహిణి, కర్కాటకలగ్నం, ఉ.11.45 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►25.04.23 గురుమోఢ్యమి త్యాగం ►26.04.23 బుధవారం, సప్తమి పునర్వసు, కన్యాలగ్నం, సా. 4.20 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►27.04.23 గురువారం, సప్తమి పుష్యమి, వృషభలగ్నం, ఉ.7.41 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►30.04.23 ఆదివారం, దశమి మఘ, వృషభలగ్నం, ఉ.7.29 వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►03.05.23 బుధవారం, త్రయోదశి హస్త, వృషభలగ్నం, ఉ.7.18 వివాహం, గృహారంభం, ఉపనయనం, శంకుస్థాపన. ►03.05.23 బుధవారం, చతుర్దశి చిత్త, మకరలగ్నం రా.12.22 వివాహం, గర్భాధానం. ►05.05.23 శుక్రవారం, వైశాఖ పూర్ణిమ స్వాతి, కన్యాగ్నం, మ.3.45 క్రయవిక్రయాలు, దస్త్రం. ►07.05.23 ఆదివారం, బ. విదియ అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►10.05.23 బుధవారం, పంచమి పూర్వాషాఢ, వృషభలగ్నం, ఉ.6.50 క్రయవిక్రయాలు, సమస్తశుభాలు. ►10.05.23 నుంచి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంకుస్థాపనలు, బోరింగ్లు నిషిద్ధం. ►11.05.23 గురువారం, షష్ఠి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 అన్నప్రాశన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. ►14.05.23 ఆదివారం, దశమి శతభిషం, మిథునలగ్నం, ఉ.9.24 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠమాసం ►21.05.23 ఆదివారం, శు. విదియ మృగశిర, మిథునలగ్నం ఉ.9.56 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►25.05.23 గురువారం, షష్ఠి పుష్యమి, మిథునలగ్నం, ఉ.8.40 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►26.05.23 శుక్రవారం, సప్తమి మఖ, మీనలగ్నం రా.1.52 వివాహం, గర్భాధానం, ప్రయాణాలు. ►31.05.23 బుధవారం, ఏకాదశి స్వాతి, మిథునలగ్నం, ఉ.8.16 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంకుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. ఆషాఢ మాసం ►03.06.23 శనివారం, పూర్ణిమ అనూరాధ, మీనలగ్నం రా.1.20 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►05.06.23 సోమవారం, బ. విదియ మూల, మిథునలగ్నం, ఉ.7.20 సమస్త శుభాలు. ►07.06.23 బుధవారం, చవితి ఉత్తరాషాఢ, మిథునలగ్నం ఉ.7.49 అన్నప్రాశన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 వివాహం, గర్భాధానం, ప్రయాణం. ►08.06.23 గురువారం, పంచమి శ్రవణం, కన్యాలగ్నం, మ.1.30 డోలారోహణం, క్రయవిక్రయాలు. ►09.06.23 శుక్రవారం, సప్తమి శతభిషం, మీనలగ్నం, రా.12.56 వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణమాసం ►23.07.23 ఆదివారం, శు. షష్ఠి ఉత్తరా, కన్యాలగ్నం ఉ.11.50 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►26.07.23 బుధవారం, శు. నవమి స్వాతి, వృశ్చికలగ్నం, మ.4.09 క్రయవిక్రయాలు, డోలారోహణం. ►28.07.23 శుక్రవారం, శు. దశమి అనూరాధ, కన్యాలగ్నం, ఉ.10.15 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►30.07.23 ఆదివారం, శు. చతుర్దశి మూలా, కన్యాలగ్నం ఉ.10.07 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►31.07.23 సోమవారం, శు. చతుర్దశి పూర్వాషాఢ, ధనుర్లగ్నం సా.5.01 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►04.08.23 శుక్రవారం, బ. తదియ పూర్వాభాద్ర, ధనుర్లగ్నం సా.4.45 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►05.08.23 శనివారం, బ. చవితి ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం మ.1.30 క్రయ విక్రయాలు, ప్రయాణం. ►06.08.23 ఆదివారం, బ. పంచమి రేవతి, కన్యాలగ్నం, ఉ.11.05 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►07.08.23 సోమవారం, బ. షష్ఠి అశ్వని, కన్యాలగ్నం, ఉ.10.19 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►08.08.23 మంగళవారం శోభకృత్నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుంచి శోభకృత్ నామ సంవత్సర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు ►19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం ►20.08.23 శుక్లపక్షం, ఆదివారం, చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►20.08.23 ఆదివారం, పంచమి చిత్త, కర్కాటకలగ్నం, రా.2.58 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►24.08.23 గురువారం, నవమి అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 వివాహం, గృహప్రవేశం. మిథునలగ్నం, రా.2.40 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.08.23 శనివారం, దశమి మూలా, వృషభలగ్నం, రా.11.45 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►30.08.23 బుధవారం, పూర్ణిమ శతభిషం, వృషభలగ్నం, రా.11.30 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►31.08.23 గురువారం, బ. పాడ్యమి శతభిషం, వృశ్చికలగ్నం, ఉ.11.48 రాఖీపూర్ణిమ, వివాహం, క్రయవిక్రయాలు. ►01.09.23 శుక్రవారం, బ. విదియ ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం, ఉ.11.45 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ రేవతి, వృషభలగ్నం, రా.11.18 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. చవితి రేవతి, వృశ్చికలగ్నం, ఉ.11.35 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. పంచమి అశ్వని, వృషభలగ్నం, రా.11.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►04.09.23 సోమవారం, బ. పంచమి అశ్విని, వృషభలగ్నం, ఉ.9.20 క్రయవిక్రయాలు. ►06.09.23 బుధవారం, బ. అష్టమి రోహిణి, వృషభలగ్నం, రా.11.02 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాధానం. ►07.09.23 గురువారం, బ. అష్టమి రోహిణి, వృశ్చికలగ్నం, ఉ.10.21 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►07.09.23 గురువారం, బ. నవమి మృగశిర, మిథునలగ్నం, రా.1.25 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►10.09.23 ఆదివారం, బ. ఏకాదశి పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 శంకుస్థాపన, క్రయవిక్రయాలు, గృహప్రవేశం, ప్రయాణాలు. భాద్రపద మాసం ►16.09.23 శనివారం, శు. విదియ హస్త, వృశ్చికలగ్నం, ఉ.10.46 డోలారోహణం, అన్నప్రాశన, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►17.09.23 ఆదివారం, శు. తదియ చిత్త, ధనుర్లగ్నం మ.1.53 డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►18.09.23 సోమవారం, శు. తదియ చిత్త, శుభ సమయం ఉ.10.30 నుంచి వినాయక చవితి పూజ గణపతి నవరాత్రులు. ►24.09.23 ఆదివారం, శు. ఏకాదశి పూర్వాషాఢ, వృశ్చికలగ్నం,ఉ.10.30 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►25.09.23 సోమవారం, శు. ఏకాదశి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►29.09.23 శుక్రవారం, శు. పూర్ణిమ ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.2.36 క్రయవిక్రయాలు. ►30.09.23 నుంచి మహాలయ పక్షం/పితృపక్షం ముహూర్తాలు ఉండవు. ►14.10.23 మహాలయ అమావాస్య ఆశ్వయుజ మాసం ►15.10.23 ఆదివారం, శు. పాడ్యమి చిత్త, వృశ్చికలగ్నం, ఉ.8.50 శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవీ పూజలు. ►16.10.23 సోమవారం, శు. విదియ స్వాతి, వృశ్చికలగ్నం ఉ.8.45 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►18.10.23 బుధవారం, శు. చవితి అనూరాధ, వృశ్చికలగ్నం, ఉ.8.36 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు ►19.10.23 గురువారం, శు. పంచమి జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 సరస్వతీ పూజ. ►21.10.23 శనివారం, శు. అష్టమి ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 వివాహం, గృహప్రవేశం. ►22.10.23 ఆదివారం, దుర్గాష్టమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.11.33 అన్నప్రాశన, శంకుస్థాపన. ►23.10.23 సోమవారం, మహర్నవమి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.8.18 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►24.10.23 మంగళవారం, విజయదశమి ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుంచి 11.45 లోపు విజయ ముహూర్త కాలము. ►25.10.23 బుధవారం, ఏకాదశి శతభిషం, ధనుర్లగ్నం, ఉ.10.09 ఉపనయనం, వివాహం, శంకుస్థాపన. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 సమస్త శుభాలు. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కన్యాలగ్నం, తె.4.21 వివాహం, గృహప్రవేశం. ►28.10.23 శనివారం, అశ్వయుజ పూర్ణిమ రా.1.05 నుంచి 2.22 వరకు చంద్రగ్రహణం ►01.11.23 బుధవారం, బ. చవితి మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. ►01.11.23 బుధవారం, బ, చవితి మృగశిర, మిథునలగ్నం, రా.10.12 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, గర్భాధానం. ►09.11.23 గురువారం, బ. ఏకాదశి ఉత్తర, వృశ్చికలగ్నం, ఉ.07.18 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. కార్తిక మాసం ►16.11.23 గురువారం, శు. తదియ మూలా, ధనుర్లగ్నం, ఉ.9.05 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►17.11.23 శుక్రవారం, శు. పంచమి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.5.41 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శనివారం, శు. పంచమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శని/ఆదివారం, శు. పంచమి/షష్ఠి శ్రవణం, తులాలగ్నం, తె.5.05 వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►19.11.23 ఆదివారం, శు. సప్తమి శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 వివాహం, గృహప్రవేశం. ►22.11.23 బుధవారం, శు. దశమి ఉత్తరాభాద్ర, మిథునలగ్నం, రా.8.55 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, గర్భాధానం. ►23.11.23 గురువారం, శు. ఏకాదశి ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.33 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►23.11.23 గురువారం, శు. ద్వాదశి రేవతి, తులాలగ్నం, తె.5.18 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►24.11.23 శుక్రవారం, శు. ద్వాదశి రేవతి, ధనుర్లగ్నం, ఉ.8.25 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అన్నప్రాశన. ►24.11.23 శుక్రవారం, శు. త్రయోదశి అశ్వని, మిథునలగ్నం, రా.8.41 వివాహం, గృహప్రవేశం. ►25.11.23 శనివారం, శు. త్రయోదశి అశ్వని, ధనుర్లగ్నం, ఉ.9.25 సమస్త శుభాలు. ►29.11.23 బుధవారం, బ. విదియ మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 వివాహం, శంకుస్థాపన. ►01.12.23 శుక్రవారం, బ. చవితి పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 గృహారంభం. ►02.12.23 శనివారం, బ. పంచమి పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►03.12.23 ఆదివారం, బ. సప్తమి మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 గర్భాధానం, ప్రయాణం. ►06.12.23 బుధవారం, బ. నవమి ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►06.12.23 బుధవారం, బ. దశమి ఉత్తర, తులాలగ్నం, తె.4.30 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►07.12.23 గురువారం, బ. ఏకాదశి హస్త, మిథునలగ్నం, రా.7.45 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. 08.12.23 శుక్రవారం, బ. ఏకాదశి చిత్త, మిథునలగ్నం, రా.7.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. మార్గశిర మాసం ►15.12.23 శుక్రవారం, శు. చవితి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.3.56 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.12.23 బుధవారం, అష్టమి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, ఉ.9.13 అన్నప్రాశన, వివాహం. ►20.12.23 బుధవారం, నవమి రేవతి, తులాలగ్నం, తె.3.38 వివాహం, ప్రయాణం. ►21.12.23 గురువారం, దశమి అశ్విని, తులాలగ్నం, తె.3.29 గృహారంభం ►28.12.23 గురువారం, బ. విదియ పునర్వసు, మకరలగ్నం, ఉ.8.42 గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి ఉత్తర, మకరలగ్నం, ఉ.8.06 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి హస్త, వృశ్చికలగ్నం తె.3.36 వివాహం, గృహారంభం. ►04.01.24 గురువారం, అష్టమి హస్త, మకరలగ్నం, ఉ.8.12 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►05.01.24 శుక్రవారం, దశమి స్వాతి, తులాలగ్నం, రా.2.29 ప్రయాణాలు. పుష్యమాసం ►13.01.24 శనివారం, శు. విదియ శ్రవణం ఉ.11.45 డోలారోహణం, బారసాల. ►15.01.24 సోమవారం, పంచమి శతభిషం ఉ.10.09 మకర సంక్రమణం ►18.01.24 గురువారం, అష్టమి అశ్విని ఉ.10.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►21.01.24 ఆదివారం, ఏకాదశి మృగశిర, ఉ.9.45 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►25.01.24 గురువారం, పూర్ణిమ పునర్వసు ఉ.8.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►02.02.24 శుక్రవారం, బ.సప్తమి స్వాతి ఉ.9.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాçశన. ►05.02.24 సోమవారం, దశమి అనూరాధ ఉ.7.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. మాఘ మాసం ►14.02.24 బుధవారం, శు. షష్ఠి అశ్విని, ధనుర్లగ్నం తె.3.54 వివాహం, గృహారంభం. ►17.02.24 శనివారం, నవమి రోహిణి, తులాలగ్నం, రా.11.40 వివాహం, గర్భాధానం. ►18.02.24 ఆదివారం, నవమి రోహిణి, మేషలగ్నం, ఉ.10.43 వివాహం, గృహారంభం. ►19.02.24 సోమవారం, దశమి మృగశిర, మేషలగ్నం, ఉ.10.39 ఉపనయనం, అక్షరాభ్యాసం, గృహారంభం. ►21.02.24 బుధవారం, త్రయోదశి పుష్యమి, తులాలగ్నం, రా.11.21 గర్భాధానం. ►24.02.24 శనివారం, పూర్ణిమ మఖ, వృషభలగ్నం ఉ.11.45 వివాహం. ►25.02.24 ఆదివారం, బ. పాడ్యమి ఉత్తర, ధనుర్లగ్నం తె.3.14 గృహారంభం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►28.02.24 బుధవారం, చవితి చిత్త, వృశ్చికలగ్నం రా.11.51 వివాహం, గృహప్రవేశం. ►02.03.24 శనివారం, సప్తమి అనూరాధ, ధనుర్లగ్నం, రా.2.49 వివాహం, గృహప్రవేశం. ఫాల్గుణ మాసం ►15.03.24 శుక్రవారం, శు.షష్ఠి రోహిణి, ధనుర్లగ్నం, రా.1.55 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►17.03.24 ఆదివారం, అష్టమి మృగశిర, వృషభలగ్నం ఉ.10.20 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, వృషభలగ్నం ఉ.10.06 ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, తులాలగ్నం, రా.9.45 గర్భాధానం, ప్రయాణాలు. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, తులాలగ్నం, రా.9.23 వివాహం. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, ధనురలగ్నం, రా.1.31 వివాహం, గృహప్రవేశం. ►24.03.24 ఆదివారం, పూర్ణిమ ఉత్తర, వృషభలగ్నం, ఉ.9.51 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►25.03.24 సోమవారం, పూర్ణిమ ఉత్తర, మేషలగ్నం, ఉ.8.19 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►27.03.24 బుధవారం, బ. విదియ చిత్త, మేషలగ్నం, ఉ.8.15 ఉపనయనం, ప్రతిష్ఠ, గృహారంభం. ►27.03.24 బుధవారం, తదియ స్వాతి, ధనుర్లగ్నం, రా.1.17 వివాహం, ప్రయాణాలు. ►30.03.24 శనివారం, పంచమి అనూరాధ, వృషభలగ్నం, ఉ.9.27 ఉపనయనం, ప్రతిష్ఠ. ►01.04.24 సోమవారం, సప్తమి మూలా, మేషలగ్నం, ఉ.7.51 అక్షరాభ్యాసం. ►03.04.24 బుధవారం, నవమి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.9.11 అన్నప్రాశన, ఉపనయనం, వివాహం. ►03.04.24 బుధవారం, దశమి శ్రవణం, తులాలగ్నం రా.8.35 వివాహం, గర్భాధానం. ►04.03.24 గురువారం, ఏకాదశి ధనిష్ఠ, ధనుర్లగ్నం, రా.12.41 వివాహం, గృహప్రవేశం. -
నవగహ్ర సంచార భాష్యాలు 2023– 24.. జరుగబోవు సంఘటనలు
► శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం వర్ధిల్లుతుంది. ► జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దయ ప్రజలకు లభిస్తుంది. ► యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ► పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడతాయి. ► అరబ్ దేశాలలో నిరసనలు. భారీ కుంభకోణాలు బయటపడతాయి. ప్రముఖుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ► ఇండోనేషియా, చైనాలో భూకంపం వల్ల అపార నష్టం. ► విజిలెన్స్, ఈడీ, సీబీఐ దాడులు సంచలనాత్మక నేర సంబంధమైన విషయాలు బయటపెడతాయి. ► సముద్ర వాతావరణంలో చెడ్డ మార్పులు దెబ్బతీస్తాయి. (అరేబియా, బంగాళాఖాతం) ► తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వనున్న బీజేపీ. ► కొన్ని రాష్ట్రాల మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటనున్న బీజేపీ ► పాకిస్తాన్, చైనాలతో భారతదేశానికి సరిహద్దు వివాదాలు శ్రుతిమించి రాగానపడతాయి, సరిహద్దులలో అప్రమత్తత, ఉద్రిక్తత వాతావరణం. ► గ్రేటర్లో ప్రతి కొనుగోలు గోల్మాల్. ► బిట్‌కాయిన్ భవిష్యత్తులో కొంపదీస్తుంది. ► పెట్రోల్ ధరలకు సమానంగా ఉల్లి ధర, కొన్ని కూరగాయలు. ► క్రీడాకారుల భద్రతా విషయంలో విశేషమైన జాగ్రత్తలు అవసరం. ► తెలంగాణలో బలం పెంచుకోనున్న కమలం. ► పెరిగిన రేట్ల వలన సామాన్య ప్రజలకు అగ్నిపరీక్షా కాలం. ► కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జలబీభత్సం, ఆర్థికనష్టం. ► కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పూర్తిగా బలహీనపడే సూచనలు ఉన్నాయి. ► చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది. ► జమ్మూ, కాశ్మీర్ల విషయంలో ప్రధాని సంచలనాత్మక నిర్ణయాలు. ► ముప్పయి ఏళ్ళకే సైట్, స్పాండిలైటిస్. ఆరోగ్యం భాస్కరాదిత్యం అని గ్రహించండి. ► గో హత్యల నిషేధం దిశగా చట్టాలు అమలు. ► భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న అమిత్ షా. ► ఆయుర్వేదం మందులు అధిక ధర కలిగి ఉంటాయి. ప్రజలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తారు. ► మమతా బెనర్జీ జాతకంలో మహారాజయోగం నడుస్తోంది. (2024) ► పామాయిల్ సాగుబడి గిట్టుబాటు అవుతుంది. ► విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తప్పని కష్టాలు. ► చేతులెత్తనున్న ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ, ప్రజల నెత్తిన శఠగోపం. ► దేవాలయాలలో చోరీలు అధికం అవుతాయి. ► సెల్‌ఫోన్ యువత పెడదోవ పట్టడానికి, నాశనానికి కారణం అవుతుంది. ► రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు. ► వంట నూనెల ధరలు ఆకాశంలోకి వెళ్తాయి. ► చేదెక్కనున్న పంచదార. ► అందరికీ సూర్యుడు ముఖ్యం (సోలార్ పవర్). ► 2024వ సంవత్సరంలో రాజకీయాలలో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది. ► డ్రంకెన్ డైనోసర్స్ విజృంభిస్తారు. నపట్టాలు ఉంటాయి కానీ భూములే ఉండవు. ► కోడిగుడ్డు, మాంసం ధరలు అధికమవుతాయి. ► వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అధికం అవుతాయి. ► ప్రతికూల గ్రహస్థితి వల్ల విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. ► హోమియోపతి వైద్యానికి అత్యంత ఆదరణ. ► డ్రాగన్ కంట్రీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది. ► మరింత అధికం గృహ సంబంధిత పన్నులు. ► శ్రీలంక, టర్కీకి గడ్డుకాలం. ► మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. (నూనె ధరలు పెరగడం దీనికి కారణం) ► నీట మునిగే కొన్ని ప్రాంతాలు. ► ప్రకృతిలో అందం నశిస్తుంది. మనుషులలో జీవత్వం తగ్గిపోతుంది. ► ఆహారం కాలుష్యం, ఆయువు క్షీణం. ► దొంగతనాలు పెరుగుతాయి. ► చిరుధాన్యాలు మంచి ధర కలిగి ఉంటాయి. పంట వేసిన వాడికి పంట పండుతుంది. ► కొత్త రకాలైన ఆహారపు డైట్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ► గో సంతతికి గడ్డుకాలం. ► ఇదివరకు తల్లిపాలు కొరత ఇప్పుడు పిల్లల కొరత. ► ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోనున్న నూతన జనాభా. ► డయాబెటిస్, ఊబకాయం అధికమవుతాయి. ► బ్రిటన్‌కి గడ్డుకాలం (గురువు గారు చెప్పిన దాంట్లో మార్పులేదు). ► అనాథల సంఖ్య పెరుగుతుంది. ► కొన్ని వ్యాపారాలు రాత్రికి రాత్రే మూతపడతాయి. ► నఅంతరించిపోతున్న కళలకు గుర్తింపు, సహాయం లభిస్తుంది. ► బంగారం దుకాణాలకు ఎక్కువ సెక్యూరిటీ అవసరం. ► నఇదే పద్ధతిలో ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంటు. ► ఉన్నత పదవులలో ఉన్నవారికి భద్రత మరింత అవసరం. ► ఈత వస్తే సముద్రం పక్కన ఇల్లు కట్టుకోండి. ► టమాటాలు, డ్రగ్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ► నసౌరశక్తి వ్యాపారాలు బాగుంటాయి. ► అంగవైకల్యంతో ఉన్నవారికి శుభవార్త. ► మెడికల్ రంగంలో నూతన మార్పులు కలిసివస్తాయి. ► అన్ని దేశాల జీడీపీ గణనీయంగా మారబోతుంది. ► వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. శ్వాసకోస వ్యాధులకు మందులు దొరకవు ► విమానం నడిపేవారికి దారి కనబడక గమ్యం మారుతుంది. ► భూకంపాలు కనివిని ఎరుగని రీతిలో పెరుగుతాయి. నూతన ప్రదేశాలకు ఇవి వ్యాప్తి చెందుతాయి. ► నీటి కాలుష్యం పెరుగుతుంది. ► ప్రకృతి బీభత్సాల వల్ల కలిగిన నష్టం అందరికీ సమానంగా అందుతుంది. ► ఇవి బీద, బిక్కు, పేద, గొప్ప, అధికారి అన్నది లేకుండా పెద్ద దేశాలు, చిన్న దేశాలు అనేది లేకుండా బాధిస్తాయి. ► బియ్యం, కందిపప్పు. మినపపప్పు దినుసులు సామాన్యుడికి దొరకడం కష్టం అవుతుంది. ► పేకముక్కలలాగా నేలకొరిగే కట్టడాలు. ► రాగి, మట్టిపాత్రల ప్రాధాన్యత పెరుగుతుంది. ► దంచికొట్టనున్న ఎండలు. ఇంట్లో ఉండలేము, బయటకు వెళ్ళలేము. ► ఆర్గానిక్ పంటల ప్రాధాన్యం పెరుగుతుంది. ► నిమ్మకాయల వాడకం పెరుగుతుంది (అధిక ధర కలిగి ఉంటాయి). ► ఎలక్టాన్రిక్ వెహికిల్స్ వాడకం పెరుగుతుంది. ► పురాణ కట్టడాలే కాదు నూతన కట్టడాలు కూలిపోతాయి. ► పెరిగిపోనున్న రేడియేషన్. అంతరించిపోనున్న మరికొన్ని పక్షులు. ► జమ్ము కాశ్మీర్‌కు శుభవార్త, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో కాశ్మీర్. ► కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, బ్యాంకులో భద్రంగా ఉన్నాయి (ఋణాలు) ► గ్యాంబ్లింగ్‌లో కొత్త అధ్యాయాలు, పోలీసులకు చుక్కలు. ► వృద్ధాశ్రమాలకు అడ్వాన్స్‌లు, డిపాజిట్లు. ► పోపు లేకుండా పులిహోర ప్రసాదం. ► బ్రిటన్ ప్రధానమంత్రికి గడ్డుకాలం. ► అన్నింటికీ లోన్లు ఇచ్చే బ్యాంకులు మధ్యాహ్న భోజనానికీ లోన్ ఇస్తాయి. ► ఆఫ్రికా ఖండానికి ఆకలి బాధలు. ► అగ్నిప్రమాదాల్లో అంతరించి పోనున్న జీవరాశులు. ► రణరంగంగా మారనున్న భారతదేశం. ► పాకిస్తాన్లో ప్రకృతి బీభత్సం ఎక్కువ అవుతుంది. ► యూరప్‌కు గడ్డుకాలం. ► ధాన్యము కరువు వాటిల్లుతుంది. ► ఇండియన్ మిలటరీ బలోపేతం శత్రువులను భూస్థాపితం. ► తీవ్రవాదుల చర్యలు విస్తరిస్తాయి. ► అగ్రరాజ్యం అమెరికా చీకటిమయం. ► నార్త్ కొరియా వార్తల్లో ఉంటుంది. ► ప్రపంచ దేశాలన్నింటినీ వణికించనున్న యుద్ధభయం. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం మొదలు పెడతారో, బాంబులు పడతాయో అనే భయంతో, ఆందోళనలో ప్రజలు. ► ఓల్డేజ్ హోవ్‌ులో సౌకర్యాలు పెరుగుతాయి. శేషజీవితం గడపడానికి అనువైన ప్రదేశం. ► అకాల వర్షాలు ఈసారి కూడా రైతులపట్ల జాలి చూపవు. పంట నష్టం తప్పకపోవచ్చు. ► హైదరాబాద్ చుట్టూ భారీగా పెరగనున్న భూముల ధరలు. ► బ్యాంక్ రుణాల వడ్డీలు, యూజర్ చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి. ► మెన్స్ క్రికెట్‌కే కాదు ఉమెన్స్ క్రికెట్‌కి కూడా అభిమానుల ఆదరణ పెరుగుతుంది. ► సైబర్ నేరాలు అధికమవుతాయి. ► కారు కొనుక్కోవడానికి బతిమాలి అప్పు ఇస్తారు బియ్యం కొనుక్కోవడానికి బిచ్చం కూడా కష్టం. ► ప్రత్తి పంటకు సువర్ణకాలం. ► భవిష్యత్‌కు బంగారు బాట నీటి వ్యాపారం. ► ప్రజలలో తగ్గిపోనున్న రోగనిరోధక శక్తి. ► అనేక రైలు వంతెనలకు, బ్రిడ్జిలకు నూరేళ్ళు నిండాయి. ► గడ్డి దొరకని గడ్డుకాలము మూగ జీవుల పట్ల కాఠిన్యం వహించిన దైవం. ► పేలుళ్లు, అగ్నిపర్వతముల ప్రకంపనలు నిత్య దీపావళితో సమానం. ► క్రీడా, వైద్యరంగంలో భారత్‌కు ప్రపంచ ప్రఖ్యాతి. ► మన దేశ సహాయ సహకారాలు చాలా దేశాలకు అవసరం అవుతాయి. ► సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానం. ► ఫిబ్రవరి నుండే మనకు ఎండాకాలం ప్రారంభం. ► ఉక్కు, స్టీలు పరిశ్రమలకు అనుకూల కాలం. ► భయం నీడలో మానవుడు భద్రత లేని జీవితాలు. ► చెట్ల పెంపకం అధికమవుతుంది. ► రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కన్నా, ఉక్రెయిన్ను సమర్థిస్తున్న దేశాలకే ఎక్కువ ప్రమాదం, నష్టం వాటిల్లుతుంది. ► పాకిస్తాన్‌కు తాలిబాన్లతో, ప్రకృతితో ఇబ్బందులు ఏర్పడుతాయి.తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. కోలుకోలేని విధంగా పాకిస్తాన్ ననష్టపోతుంది. ► టర్కీ, జపాన్, ఇండోనేషియాలో భూకంపాల పరంపర కొనసాగుతుంది. ► చైనా భవిష్యత్తు బట్టబయలవుతుంది. వేసుకున్న ప్రణాళికలు బయటపడతాయి. ► వైద్యుల పంట పండించనున్న మధుమేహ రోగులు. ► యుద్ధం సంభవిస్తే జ్యోతిష ఫలితాలలో మార్పులు వస్తాయి. ► ఏ వ్యక్తి జాతకంలోనూ ఆయుఃప్రమాణం పరిశీలించలేదు. చదవండి: శ్రీ శోభకృత్నామ సంవత్సర పండుగల జాబితా ఇదే -
Dos Donts List: అమంగళమైన చేష్టలు.. ఈ పనులు చేయకండి!
► బొట్టు లేకుండా ఉండటం, కాటుక పెట్టుకోకపోవడం (అధికారం, ఆచారం కలిగినవాళ్ళు) ► గడపలపై కూర్చోవటం ► నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం. ► ఎడమ చేతితో పిల్లలను కొట్టటం (కుడి చేత్తో కొడితే శుభమని అర్థం కాదు). ► స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం (ఉతికిన బట్టలు ఉండి కూడా) ► రాత్రిపూట ఇళ్ళు చిమ్మటం, అన్నం ఎత్తి పడవేయటం ► కూర్చున్న కుర్చీల కింద, పీటల కింద నీళ్ళు చిమ్మటం (పోయటం) ► కాళ్ళు దాటుకుంటూ వెళ్ళటం (నడవటం) ► రోళ్ళు, రోకలిబండ, పాత్రలు కడగకుండా ఉంచటం ► చీకట్లో భోజనం చేయటం, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం ► భోజనం చేసి స్నానం చేయటం, సహపంక్తి భోజనాలలో మధ్యలో లేచిపోవటం ► భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం (అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు) ► అన్నం తింటూ చేతులు నాక్కోవటం ► బుసలు కొడుతూ కాఫీ, టీ వంటివి తాగటం ► అదేపనిగా కాళ్ళు ఊపడం ► ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయటం ► అన్నం చిన్నముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకొని తినడం ► మంగళ సూత్రాలతో నారింజ, బత్తాయి వంటి పండ్లను కోయడం. (మంగళ సూత్ర లోహము నిత్య ఉపయోగార్థమైన వస్తువు కాదు. పవిత్రతకు మాంగల్యానికి చిహ్నము) ► మంచం మీద కూర్చుని భోజనం చేయటం ► దీపారాధనకు ఒక్కటే వత్తి వెలిగించటం, దీపాన్ని నోటితో ఊది ఆర్పివేయటం ► అదేపనిగా ఉమ్మి వేయటం, పళ్ళు కుట్టుకోవడం, చెవులలో పుల్లలు పెట్టి కెలకటం, గోళ్ళు కొరకటం, కనుబొమ్మలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు) ► రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు) ► మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం. -
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది : గ్రహాలు వాటి స్వభావాలు
రవి ఏకాదశ రుద్రులలో ఒకడైన సూర్యభగవానుడు నవగ్రహాలకు నాయకుడు. అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి. సింహరాశ్యాధిపతి. సూర్యునకు అతి సమీపంలోకి గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు మౌఢ్యమి ఏర్పడుతుంది. రాహువు, కేతుగ్రస్తమైనా రవి గ్రహణం ఏర్పడుతుంది. రవి దశ నడుస్తున్నవారు; సింహరాశి వారు; కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు శివాలయంలో సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్యానికి, అధికారానికి, దర్పమైన జీవితానికి, సమాజంలో భయభక్తులు గల మానవులుగా జీవించడానికి రవి కారకుడు. విష జ్వరాలకు, కంటిరోగాలకు రవి కారకుడు. సూర్యారాధనలో తర్పణం ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయంలోపు సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. రవి ప్రభావం చేత జాతకునకు అనువంశికంగా వచ్చే ప్రయోజనాలు, దుర్నిమిత్తాలు సంభవిస్తాయి. తరతరాలుగా వస్తున్న సిరిసంపదలకు సూర్యుడే కారకుడు. భూదాన గుణం, అనువంశిక, వృత్తి, వైద్యం, పదవి, ప్రజాప్రాతినిధ్యం సూర్యగ్రహం వలనే సంప్రాప్తిస్తాయి. ఆత్మగౌరవానికి, అహంకారానికి, మితిమీరిన ఆత్మవిశ్వాసానికి రవి కారకుడు. రవి జాతకులు ఇష్టంలేని వాస్తవాలను గ్రహించరు. పొగడ్తలకు పొంగిపోతారు. నిజాయితీపరులు వీళ్ళ పక్కన ఉండలేరు. భజనపరులకే చోటు ఉంటుంది. కుజ, గురు, చంద్ర, బుధులతో మిత్రత్వం కలిగిన వాడు, శుక్ర, రాహు, కేతువులు, శత్రువులు. కుమారుడైన శనితో బద్ధవైరం కలిగినవాడు. స్థిరమైన భావాలకు, సంప్రదాయాలకు రవి కారకుడు. ఉన్నా లేకపోయినా గంభీరంగా ఉంటారు. విశేషమైన ఖర్చులు చేస్తారు. వీటిల్లో చాలావరకు అపాత్రదానం అవుతాయి. వీళ్ళ పేరు మీద విద్యాసంస్థలు, చెరువులు, బావులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, సేవా సదనాలు ఉంటాయి. సుదీర్ఘ రాజకీయ జీవితానికి రవి గ్రహమే కారణం. ప్రజలతో సంబంధాలు ఉంటాయి గాని, వాళ్ళతో కలిసిపోరు. పూర్వీకుల నుంచి వస్తున్న ప్రజాబలం వల్లనే గెలుస్తారు. రాజకీయ పదవిని కూడా ప్రభుత్వ ఉద్యోగం మాదిరి చేస్తారు. ఉద్యోగం నిజాయితీగా చేస్తారు. నేరస్తులను వ్యక్తిగత శత్రువులుగా భావిస్తారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయరు. పై అధికారుల మాట, మంత్రుల మాట వినరు. భార్య విషయంలోనూ వీళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలయినా చెక్కు చెదరరు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వైద్యవృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన సూర్యగ్రహ ప్రభావం చేత అపర ధన్వంతరిగా పేరు గాంచుతారు. వైద్య విధానంలో నూతన విషయాలు కనుగొంటారు. మూలికల మీద, చెట్లమీద మంచి పరిజ్ఞానం ఉంటుంది. అల్లోపతిలో కూడా అద్భుతంగా రాణిస్తారు. బీద కుటుంబంలో పుట్టినా, కష్టపడి చదివి అధికార పదవి చేపట్టడానికి రవి గ్రహం కారణం. నైపుణ్యాని కన్నా స్నేహానికి ప్రాధాన్యమిస్తారు. గుప్త దానాలు చేస్తారు. కళాసాహిత్య రంగాలలో ప్రఖ్యాతి సాధిస్తారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి న్యాయం చేస్తారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. జీవిత చరమాంకంలో అన్ని రకాల ఐహిక సుఖాలను పరిత్యజిస్తారు. రవి గ్రహ (సూర్యుని) లక్షణాలు : క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలని సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యమిస్తారు. కులగౌరవం, వంశగౌరవం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. చేసిన దానధర్మాలకు, మంచి పనులకు పెద్దగా ప్రచారం రాదు. కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు వస్తుంది. సన్నిహిత, సేవకవర్గం ఏ పని అయినా కొంత ఆలస్యంగానయినా చేయించుకో గలుగుతారు. వీళ్లను భయపెట్టి లొంగదీసుకునే యత్నాలు ఫలించవు. బంధువుల వల్ల సన్నిహిత రక్త సంబంధీకుల వల్ల, పర స్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొంతకాలం అజ్ఞాత వాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. రాజకీయ రంగంలో ప్రారంభం నుంచే ఆధిక్య స్థితి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉండి సామాన్యులను దూరం చేసుకుంటారు. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాలలోని వారికి దూరం అవుతారు. శిరోవేదన, పార్శ్యపు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా కృషి చేస్తారు. లేక అనేక ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. స్థాయి లేని వ్యక్తుల్ని మీకు పోటీగా నిలిపి వాళ్ళను బలవంతులను చేసి, మీకు పోటీగా నిలపాలనే యత్నాలు అత్యున్నత స్థానాలలోని వ్యక్తులు చేస్తారు. ఇందుకు మీ సొంత ధనం, ప్రోత్సాహం కూడా తోడవుతుంది. కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాస్పదం కావచ్చు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా రాణిస్తాయి. శనిదశ కూడా మంచిగానే ఉంటుంది. స్నేహితులు చేసే సహాయ సహకారాలు జీవితంలో మరువలేనివిగా ఉంటాయి. మహోన్నత ఆశయ సాధన ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభించడం, జీవితంలో చెప్పుకోదగిన అంశం. సిద్ధ గంధంతో శివార్చన, ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మరింత వృద్ధి సాధించ గలుగుతారు. మే నెల సాధారణంగా బాగుంటుంది. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. సంతానం వల్ల మంచి ప్రఖ్యాతి వస్తుంది. శ్లో: జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరవ్ మీ జాతకంలో రవి అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి. శుక్రుడు శుక్రుని ఆరాధించడం వలన అపమృత్యుభయం ఉండదు. విలాస జీవితం, స్త్రీ, వివాహ సౌఖ్యం, సుఖనిద్ర, విలాస వస్తువుల సేకరణ, అధునాతనమైన భవంతి, బహు వాహనాలు, నవనాగరికతకు తగిన వేషభాషలు, సౌందర్య ఆరాధన– ఇలాంటివన్నీ శుక్రగ్రహ అధీనంలో ఉంటాయి. సర్వ ఐహిక సుఖకారకుడు శుక్రుడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర నక్షత్రములు, వృషభరాశి, తులారాశి శుక్రగ్రహ స్వరాశులు, మీనరాశి, శుక్రునకు ఉచ్చక్షేత్రము, కన్యారాశి నీచక్షేత్రము. స్త్రీ సంతానానికి శుక్రుడే కారకుడు. పురుష జాతకంలో కళత్ర కారకుడు, స్త్రీ జాతకంలో భర్తృకారకుడు. శుక్ర జాతకులు తమ జీవితంలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వీరి జీవితంలో యోగావయోగాలు స్త్రీలపై ఆధారపడి ఉంటాయి. భార్య, ప్రేయసి, స్నేహితురాళ్లు గ్రహస్థితిని బట్టి ఎవరో ఒకరు జీవితంలో ప్రధానమైన మార్పులకు కారకులవుతారు. వివాహానంతరం గొప్ప స్థితి, ధనం, సౌందర్యం కలిగిన స్త్రీ భార్యగా లభించడం శుక్రగ్రహ ప్రభావమే! శుక్రగ్రహ జాతకులు పదుగురిలో గుర్తింపు పొందే ప్రవర్తన, వేష భాషలు, రూపం కలిగి ఉంటారు. మద్యం సేవించినట్లయితే అసభ్యంగా ప్రవర్తించి, గౌరవం పోగొట్టుకుంటారు. రాజకీయాలు లేనిచోట కూడా రాజకీయాలు నడపడం, తన మాట వినని వారి పతనం కోరుకోవడం, తన పరోక్షంలో సమాజం తన గురించి ఏమి చెప్పుకుంటుందో వాకబు చేయడం, నిఘాలు వేయడం, హితవు చెప్పే వాళ్ల మీద పగ పెంచుకోవడం, భజనపరులను చేరదీయడం, స్థాయి దిగజార్చుకొని పరులను పొగడడం, సన్మాన, సత్కార సభలు జరపడం, తనకు మళ్ళీ జరిపించుకొనడం వీరి దైనందిన జీవితంలో ఒక భాగం. సినీ కళాకారుల జాతకంలో శుక్ర గ్రహస్థితి ముఖ్యమైనది. రాజకీయ రంగంలో కొంతకాలం మాత్రమే రాణించగలరు. పరస్త్రీలతో రహస్య ప్రవర్తనం, శారీరక శ్రమ చేయకపోవడం, మేధస్సుతోనే మంత్రాంగం, సౌఖ్యమైన వృత్తి, ఉద్యోగాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తల్లితో, సహోదరీ వర్గంతో అనుబంధం ఎక్కువ. ఆడవాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు తగినట్లుగా ప్రవర్తించడం, జనులు హేళన చేసినా, అదీ ఓ గుర్తింపుగా భావించి పొంగిపోవడం, స్త్రీ దేవతా భక్తి, పిసినారితనం, సామాజిక న్యాయంపై చులకన, తన స్థాయివారిని కించపరచడం, తనకన్నా అధికులను కాకా పట్టడం, పూల మొక్కలు పెంచడం, కళాత్మకమైన వస్తు సేకరణ, అలంకరణ, ఓర్పు తక్కువ, క్రమశిక్షణ లేకుండుట, ఒకేసారి రెండుమూడు పనులు చేయడం, ఎదుటివారి మనస్సులోని మాట గ్రహించగలగడం, అబద్ధాలు చెప్పడం, సౌఖ్య విలాస జీవితాన్ని గడపడం, వీరి యోగ కారక లక్షణాలు. వీరికి ఉన్న పుత్రికా వాత్సల్యం చెప్పనలవికానిది. కొడుకుల పట్ల సామాన్యమైన అనుబంధమే. జాతక చక్రప్రకారం శుక్రుడు, శత్రు, నీచక్షేత్రాలలో ఉన్నట్లయితే కళత్ర వియోగం. ద్వికళత్ర యోగం, త్రికళత్ర యోగం, ప్రేమ వివాహం వల్ల అపఖ్యాతి, అవయోగం, అన్యస్త్రీ బానిసత్వం, వ్యసనం, బద్దకం పరాకాష్టకు చేరి స్త్రీ సంపాదన మీద జీవించుట, వృత్తి, ఉద్యోగం లేకుండా బిజీగా తిరుగునట్లు నటించడం వంటి లక్షణాలు కలుగుతాయి. నీచక్షేత్ర శుక్రస్థితి వల్ల భార్యతో అన్యోన్యత లేకుండుట, ప్రేమ వివాహ వైఫల్యం, విడాకులు రాకపోవడం, స్త్రీలు జీవితాన్ని పాడుచేయడం, చిన్నచిన్న గుడ్డలతో సంకోచం లేకుండా నలుగురిలో తిరగడం వంటి లక్షణాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీ జాతకంలో యోగకారక శుక్రుని ఫలితంగా అతి సౌందర్యవతి, అహంభావం, శారీరక బలహీనత, ఉన్నత విద్య, వైద్యవృత్తి, సినిమా, మోడలింగ్ రంగాల్లో రాణించగలరు. భర్త, పిల్లలపైన నియంత్రణ సాధించి బద్దకంతో పనిచేయక, అనారోగ్య లక్షణాలు వల్లెవేస్తుంటారు. సమాజసేవ, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ఉత్సాహంగా పాల్గొంటారు. భర్తను అత్తమామల నుండి విడదీయడం, అర్థంలేని సామాన్లు కొని డబ్బు నాశనం చేయడం, భర్తకు తెలియకుండా అప్పులు చేయడం, కోడళ్లను వేధించడం, నడుంనొప్పి, రక్తస్రావం, పచ్చకామెర్లు, లోబీపీ వీరి రోగ లక్షణాలు. భర్త, పిల్లల వల్ల సౌఖ్యం, గౌరవం. పుట్టినింట్లో సామాన్య స్థితి, వివాహానంతరం గొప్ప స్థితి, రుచికరమైన వంటలు చేయలేకపోవుట, సంకుచిత స్వభావం, మంచి జ్ఞాపకశక్తి వీరి లక్షణాలు. శుక్రగ్రహ లక్షణాలు :– జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పుచేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు, ఎక్కువమంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు.గతం మరచి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటారు. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన వ్యాపారాల్లో రాణిస్తారు. ముఖ్యంగా శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసివస్తాయి. విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. పడమటి, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించాలి. దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవీ పూజ కలిసి వస్తుంది. ప్రజాబలం, సంఘంలో మంచిపేరు, సన్నిహిత సహచర వర్గం అండదండలు అనుసరించి నడిచే వర్గం ఉంటారు. అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయవిద్య, సాంకేతిక పరిజ్ఞానం, అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు. శ్లో: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహవ్ మీ జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి. గురువు (బృహస్పతి) ఇంద్రునికి అన్ని విధాలా తోడ్పడటం, అవసరమైన సమయాలలో సలహాలను ఇచ్చి దేవతలను ఆదుకోవడం దేవగురువు బృహస్పతి కార్యక్రమాలు. శుభకార్యాలకు, ముహూర్తాలకు బృహస్పతి బలం చాలా ప్రధానం. గురువు రాశి మారినప్పడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు సంప్రాప్తిస్తాయి. గురువు ధన కారకుడు. జీవితంలో స్థిరత్వానికి, హోదా కలిగిన ఉద్యోగానికి, అందానికి ఈ గ్రహమే కారణం. సమస్త శుభకార్యాలకు గురుబలం కలిగిన ముహూర్తం అవసరం. తరతరాల విద్య, విజ్ఞాన పాండిత్యాలు, సనాతన సంప్రదాయాలు, తరగని స్థిరాస్తులు లభించడానికి గురువే కారణం. అనువంశిక అధికారానికి, కీర్తిప్రతిష్ఠలకు ఈ గ్రహమే కారణం. సమాజంలో మంచిని ప్రోత్సహించడం, అబద్ధాలను సహించ లేకపోవడం ఈ గ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. బంగారానికి గురువు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు బృహస్పతి అధిపతి. గురుగ్రహ జాతకులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాము నమ్మే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అపార శాస్త్ర పరిజ్ఞానం, జ్ఞానం వంటివి గురుగ్రహ అనుకూలత వల్ల సంప్రాప్తిస్తాయి. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ప్రఖ్యాతి సాధిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా తన స్థానానికి న్యాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వీళ్ళకు అందరూ సమానమే! గురుగ్రహ జాతకులు వాక్పటిమ, తేజస్సు కలిగి ఉంటారు. గురుగ్రహ లక్షణాలు: నిజాయితీ, సామర్థ్యం, పరిజ్ఞానం వీళ్ళ జీవితంలో ఓ భాగంగా నడుస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, తగిన సలహాలు ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ళకే వదిలేస్తారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళరు. తన మాట కాదన్న వాడిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. ధనం దానికదే వస్తుంది. వీళ్ళ క్రమశిక్షణా పద్ధతులు, జీవన విధానం ఆచరించాలంటే కలియుగంలో సాధ్యపడదు. దేశభక్తి, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావం ఉంటుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నా, వీళ్ళకు కుటుంబపరంగా మనశ్శాంతి ఉండదు. భార్యతో విభేదాలు, సంతానంతో తెగదెంపులు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల పరువు–ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. సంతానం ‘పండిత పుత్రః పరమ శుంఠః’ సామెతను నిజం చేస్తారు. బంధువుల ఎదుట వినయ విధేయతలు నటించి కావలసిన పనులు చక్కబెట్టుకుంటారు. పక్కకు వెళ్ళి తిట్టుకుంటారు. సహోదర, సహోదరీ వర్గానికి ధర్మబుద్ధితో వీళ్ళు చేసే సహాయం పూర్తి వ్యతిరేక ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులు సృష్టించే హీన చరిత్రలో బంధువులు భాగస్వాములవుతారు. 16 వేలు గురుగ్రహ జపం–శనగలు దానం ఇవ్వాలి. నిత్యం వైష్ణవ దేవతార్చన చేయాలి. మంచి లాభాలు, పేరు సంపాదిస్తారు. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. భూ సంబంధ వ్యాపారాలు కలసివస్తాయి. ఆస్తి విలువ పెరగడమే ధనవంతులు కావడానికి కారణం అవుతుంది. వ్యాపార కూడలి ప్రదేశాలు అద్దెకు ఇచ్చి, అమ్మే అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం వల్ల కుటుంబ ప్రతిష్ఠ పెరుగుదల ఎలా ఉన్నా వాళ్ళ స్థితి మాత్రం బాగుంటుంది. వాళ్ళ మనస్తత్వం, పద్ధతులు ఏవిధంగా ఉన్నా అదృష్టం కలసి వస్తుంది. జీవిత ప్రారంభంలో తెలిసీ తెలియక చేసిన నిర్ణయాలు, పనులు మంచిగా మలుపు తిరుగుతాయి. చిన్న పాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. అసమర్థులను జాలిపడి అందలం ఎక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై, బలమైన ప్రత్యర్థులుగా తయారవుతారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయబడిన శక్తి ఉంటుంది. స్వయంకృతాపరాధాలను సరిదిద్దుకోలేరు. సొమ్ము, పదవి, ప్రయోజనాలు కొన్ని సందర్భాలలో కోల్పోయినా, ఇతురులు మీ వల్లనే వాటిని పొందారన్న పేరు సమాజంలో వినిపిస్తుంది. హస్తవాసి మంచిదని అందరూ మెచ్చుకుంటారు. ఫిబ్రవరి, అక్టోబరు నెలల్లో ప్రారంభించే వ్యాపార, వ్యవహారాలు బాగుంటాయి. భాగస్వామ్యంలో కొంతకాలం మాత్రమే లాభపడతారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత కష్టకాలం ఎదుర్కొంటారు. సహోదర, సహోదరీ వర్గం బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పై అధికారుల వల,్ల కిందిస్థాయి సిబ్బంది వల్ల ఏకకాలంలో సమస్యలు వస్తాయి. ఋణాల విషయాల్లో అసత్య ప్రచారాలు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో నెగ్గుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆధ్యాత్మికంగా అనేక రంగాలలో అనుభవం సాధిస్తారు. మనుషుల మనస్తత్వం తెలుసుకోవడంలో విజయం సాధిస్తారు. మీకంటే వెనుక వచ్చిన వాళ్ళు మిమ్ములను దాటి ముందుకు పోయినా, వాళ్ళకన్నా ఆధిక్యాన్ని దీర్ఘకాలంలో సాధించగలుగుతారు. పెద్దలు స్థిరాస్థులు పోగొట్టినా, స్వయం శక్తితో సాధించుకోగలుగుతారు. శత్రువర్గంపై విజయం సాధిస్తారు. సొంత వాళ్ళ వల్ల ఎదురయ్యే సమస్యలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణం, ఉత్తరం దిశలు అనుకూలము. కుబేర కంకణ ధారణ వల్ల ఆర్థిక, వృత్తిపరమైన స్థిరత్వం కలుగుతుంది. శ్లో: దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతివ్ు మీ జాతకంలో గురువు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి. శని నవగ్రహాలలో శనైశ్చరుని స్థానం ప్రత్యేకమైనది. శని ఇచ్చే ఫలితాలు శుభఫలితాలైనా, అశుభఫలితాలైనా విపరీతంగా ఉంటాయి. శనికి ప్రత్యధిదేవత ఈశ్వరుడు. శని రాజ గ్రహాలతో ప్రబల విరోధం గలవాడు. రాజరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకి. శ్రమ జీవితం, వైరాగ్యం, సమధర్మం శనిగ్రహ లక్షణాలు. తమ్ముడు తనవాడయినా న్యాయం అందరికీ సమానమేనన్న వర్తన కలిగినవాడు. ప్రజా సంబంధాలు, ప్రజాదరణ, ఖండాంతర ఖ్యాతి, అధికారం, సాంకేతిక విద్యలు, ఉద్యమాలకు నాయకత్వం, జీవితాశయ సాధనకు సౌఖ్యాలను త్యాగం చేయుడం, సామూహిక మేలు కోసం పోరాడటం శనిగ్రహ లక్షణాలు. శని ఆయుర్దాయ కారకుడు. అనేక రంగాల్లో అత్యున్నత స్థితి, భోగభాగ్యాలు అనుభవించడానికి, శాశ్వత కీర్తివంతుడు కావడానికి శని కారకుడు. శని విశేష రాజయోగం ఇవ్వగలడు. శని దుష్ప్రభావాలు మాత్రమే ఇస్తారన్న ప్రచారం సరియైనది కాదు. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనూరాధ నక్షత్రాలకు శని అధిపతి. కుంభ, మకర రాశులకు శని అధిపతి. ఏలిననాటి శని నడుస్తున్నప్పుడు ఎన్నో బాధలు వస్తాయని, దివాలా తీస్తారని, సర్వనాశనం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఏలిననాటి శని కాలంలో రాజయోగం పట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకాలలో ఇతర అంశాలు పరిశీలించాలి. విశేషమైన జనాకర్షణ, రాజకీయ అధికారం, ప్రజా సంబంధాలు స్వయంశక్తి, ఆయుర్దాయం, రహస్య జీవనం, సన్యాసం, నైతిక ధర్మం, చట్ట ఉల్లంఘన, ఈశత్వం, ప్రాప్తి, ప్రతీకారం మొదలైనవి శనైశ్చరుని స్థితిననుసరించి, జాతకునికి సంప్రాప్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, విశేష జననాశనం, ప్రజా ఉద్యమాలు శని సంచార స్థితిననుసరించే ఉంటాయి. ఎవ్వరికైనా ఏల్నాటి శని ప్రభావం తప్పదు. శని దశ, అంతర్దశ, ఏల్నాటి శని కాలాలలో శని స్వతంత్రించి మహరాజయోగాన్ని, సిరి సంపదల్ని, రాజకీయ అధికారాన్ని, గొప్ప యోగం ఇవ్వగలడు. ఏల్నాటి శని కాలంలో, శని మహర్దశ, అంతర్దశలలో ఎందరో మంత్రులు, ధన అధికార మదాంధులు, సామాన్య మానవుడు సైతం అనుభవించని దుర్భర కష్టాలు అనుభవించి నహుషభ్రష్టత పొందారు. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రాలకు శని కారకుడు. కలియుగంలో నవగ్రహాలలో శనికి మించి అధిక శుభయోగం ఇవ్వగల గ్రహం మరొకటి లేదు. జాతకచక్రంలో తానున్న స్థితిని అనుసరించి, వివిధ రంగాలలో యోగాన్ని, తన దశ, అంతర్దశలలో, ఏల్నాటి శని కాలంలో ఇస్తాడు. జాతకరీత్యా శని యోగకారకుడైనప్పుడు అధికారం, సిరిసంపదలను ఇచ్చినా, తానున్న భావం సరిగా లేనప్పుడు, జాతకుడు తనకంటే పెద్దదైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం, లేక కులాంతర వివాహం చేసుకుని, అయిన వాళ్ళకు శత్రువై దూరంగా జీవించడం, భార్యావియోగం, ఏకాంత జీవితం, అనేక మంది సేవకుల మధ్య ఉన్నా, ఒంటరితనం అనుభవిస్తారు. ఇది కళత్ర విషయంలోనే గాదు, ఏ భావానికైనా, సహోదరులు, దాయాదులు, బంధువులు, ధైర్యసాహసాలు, పరువు–ప్రతిష్ఠలు, సంతానం, ఆరోగ్యం, పదవి, కీర్తి–కోర్టు వ్యవహారాలు దేనిమీదనైనా తన ప్రభావం, యోగాన్ని వృద్ధి చేసి భావాన్ని దెబ్బతీస్తాడు. శని తానున్న భావాన్ని వృద్ధి చేస్తాడా, చెడు చేస్తాడా అనేది వ్యక్తిగత జాతకచక్రంలో స్థితిని బట్టి ఉంటుంది. శనిగ్రహ జాతకులు నైతిక ధర్మానికి ప్రాధాన్యమిస్తారు. చేసిన మేలు మరువరు. పదేపదే కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అపకారం చేసిన వాళ్ళకు పదింతలు చెరుపు చేయనిదే వాళ్ళు విశ్రమించరు. కుంభ నిక్షిప్త భుజంగంలా సమయం కొరకు వేచి దెబ్బతీస్తారు. శత్రువుల పట్ల క్షమాగుణం ఉండదు. వీరి జ్ఞాపకశక్తి వీళ్ళ శత్రువులకు శాపం. వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల శ్రద్ధ వహించి కులమత భేదాలు లేకుండా ప్రవర్తిస్తారు. ప్రత్యర్థులు వీరిని ఏమి చేయలేరు. నిద్రలేమిని భరిస్తారు. అన్నపానాదులు లేక శ్రమిస్తారు. శని దశలో లేక ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అధికమైన శుభ సంబంధిత రాజయోగం లేక తత్సమానమైన యోగాన్ని అనుభవిస్తారు. శని కాలభైరవ ఉపాసకుడు. శని గ్రహ సాధారణ లక్షణాలు :– శనిగ్రహ జాతకులు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎక్కువగా వింటారు, మంచి మాటకారితనం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మోసం చేయనంత వరకూ ఇతరులను మోసం చేద్దామన్న ఆలోచనే రాదు. బంధుప్రీతి, స్నేహితుల పట్ల అవ్యాజమైన అనుబంధం వీరి లక్షణం. తన లోపం తెలుసుకున్నాక చేసిన పొరపాటును తిరిగి చేయరు. తన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. అందరిని సమభావంతో ప్రేమగానే చూస్తారు. తాను ద్వేషించే వ్యక్తులను అభిమానించే వారిని శత్రువులుగానే చూస్తారు. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. సాత్విక స్వభావం, మాటమీద నిలబడే తత్వం ఉంటుంది. నైతిక బాధ్యతలకు ప్రాముఖ్యతనిస్తారు. నమ్మిన వాళ్ళ కోసం పరిశ్రమిస్తారు. సాధారణ శరీర సౌష్టవం. అమితమైన జ్ఞాపకశక్తి, రచనా వ్యాసాంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. వీళ్ళు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం అని చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే వీళ్ళ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి. ధనం ఏదో రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. అభిమానించే ప్రజానీకం, నమ్మిన అనుచర వర్గం ఉంటారు. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుపాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. అంతకుమించి ఇబ్బంది కలగదు. బంధువర్గం కన్నా బయటి వారి సహాయ సహకారాలు బాగా అందివస్తాయి. జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు వంటివి ఇబ్బంది పెడతాయి. శ్లో: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజవ్ ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరవ్ మీ జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి. -
బుద్ధులను బట్టి జాతకాలు నడుస్తాయా?
గ్రహస్థితిని అనుసరించి మంచి, చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర సిద్ధాంతము. అన్ని శాస్త్రాలకెల్లా వేదం గొప్పది. ఈ వేదానికి ధర్మం, న్యాయం, సత్యం అనునవి మూలాధార స్తంభాలు. ధర్మాన్ని అనుసరించి ఎవరికీ వారు సక్రమంగా నడుచుకుంటే ప్రపంచస్థితి, దేశస్థితి ఇప్పటికంటే భిన్నంగా ఉండేది. మార్పు ఎక్కువ మందిలో కలిగితేనే సమాజంలో మంచి అయినా, చెడు అయినా ప్రభావం చూపుతాయి. ధర్మం ప్రస్తుతం ఒంటి కాలుమీద కూడా నడవడం లేదు. పూర్తిగా చతికిల బడిపోయింది. స్వార్థం, కోరికలు, విలాసాలు, క్షణికావేశం అనే అగ్నిజ్వాలలు ధర్మాన్ని చుట్టుముట్టాయి. అందుకే ప్రపంచంలో అశాంతి, అరాచకం అధికమయ్యాయి. మన దేశం గురించి చెప్పాలంటే ధర్మం చాలా రంగాల్లో క్షీణించింది. ఆ ప్రభావం ప్రకృతి రూపంలో, మహమ్మారి వ్యాధుల రూపంలో మనదేశాన్ని బాధించింది, బాధిస్తుంది. సామూహిక బాధలు, భయాలు, వ్యక్తిగత బాధలు, మానసిక ఒత్తిడి అధికం అవుతున్నాయి. వీటన్నింటికీ కారణం కేవలం గ్రహస్థితి ఒక్కటే కాదు, మానవులు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు, ప్రవర్తన, ధర్మాతిక్రమణ కూడా కారణం. ఎక్కడ చూసినా స్వార్థం, సంకుచిత స్వభావం, అసూయ, అధికమయ్యాయి. నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. కృతజ్ఞత అనేది కుందేటి కొమ్ములా వెదికినా కనిపించనిది. వ్యక్తుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, సంస్థల పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఈ రకమైన స్వార్థం పెరిగిపోవడం తప్పక పరిశీలించదగినది. పెద్దంతరం, చిన్నంతరం దాదాపుగా మృగ్యమైపోయింది. ధర్మాన్ని, నైతిక ధర్మాన్ని మానవుడు విస్మరించి అశాంతిని కొని తెచ్చుకుంటున్నాడు. గ్రహస్థితి బాగాలేదని బాధపడడానికి, దేవుడు దయచూపలేదని విమర్శించే వారికి ముందు ఆత్మపరిశీలన అవసరం. చూడలేని ప్రతి అంశానికి గ్రహస్థితిని, దేవుడిని అడ్డం పెట్టడం అవకాశవాదం అవుతుంది. భగవంతుడు, గ్రహాలు మనకిచ్చిన విజ్ఞానంతో మనం ఏ మేరకు ధర్మాన్ని రక్షించి సక్రమంగా ప్రవర్తించామో పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైంది. మన చేతలు, బుద్ధులు కూడా అనుకూల ఫలితాలకు కారణం అవుతుందన్న విషయం గ్రహించుట మేలు. స్వదేశాన్ని, స్వజనులను, భగవంతుడిని, తల్లిదండ్రులను మరచిపోకుండా చేతనయినంతలో నీ ధర్మాన్ని నీవు సక్రమంగా నిర్వర్తించు. ఈ విధమైన చైతన్యం అందరిలో కలిగినప్పుడు ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే ప్రకృతి శాంతిస్తుంది. గ్రహ బాధలు తగ్గి, దుస్సంఘటనలు దూరం అవుతాయి. మానవుని స్వార్థం అధికమైనప్పుడు, మేధస్సు వికటించినప్పుడు చేదుఫలితాలే దక్కుతాయి. ఇందుకు దైవాన్ని, జాతకులను, గ్రహాలను విమర్శించడం, విశ్లేషించడం వృథా. ధర్మో రక్షతి రక్షితః -
శ్రీ శోభకృత్నామ సంవత్సర పండుగల జాబితా ఇదే
మార్చి 2023 22. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది 24. రంజాన్ ప్రారంభం 26. మత్స్య జయంతి 30. శ్రీరామ నవమి ఏప్రిల్ 2023 01. గురుమౌఢ్యమి ప్రారంభం కామద ఏకాదశి, రేవతి కార్తె 05.బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం 06.హనుమాన్ జయంతి 07.గుడ్ ఫ్రైడే 09.సంకటహర చతుర్థి, ఈస్టర్ సండే 11.జ్యోతిరావు ఫూలే జయంతి 12 షహదత్ హజ్రత్ అలీ 14.అంబేద్కర్ జయంతి అశ్వని కార్తె 18. మాసశివరాత్రి, వరాహ జయంతి 22. పరశురామ జయంతి, రంజాన్ 25. శ్రీ ఆదిశంకర జయంతి, రామానుజ జయంతి 28. భరణి కార్తె మే 2023 01.అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కార్మిక దినోత్సవం 04. నరసింహ జయంతి 05. బుద్ధ పూర్ణిమ అన్నమయ్య జయంతి డొల్లుకర్తరి ప్రారంభం 08. సంకటహర చతుర్థి 11. నిజకర్తరీ ప్రారంభం 12.కృత్తిక కార్తె 14.హనుమజయంతి 15.మతత్రయ ఏకాదశి 17.మాసశివరాత్రి 19.శనైశ్చర జయంతి 25.రోహిణి కార్తె 31.నిర్జల ఏకాదశి జూన్ 2023 02.తెలంగాణ అవతరణ 04.ఏరువాక పౌర్ణమి 07.సంకటహర చతుర్థి 08.మృగశిర కార్తె 15.కూర్మ జయంతి 16.మాసశివరాత్రి 17.వటసావిత్రి వ్రతం 20.పూరీ జగన్నాథ రథోత్సవము 21.అంతర్జాతీయ యోగాదినోత్సవము 23.ఆరుద్ర కార్తె, స్కంద పంచమి 24.కుమారషష్ఠి 25.భానుసప్తమి, బోనాలు ప్రారంభం 29.తొలి ఏకాదశి, బక్రీద్ జూలై 2023 01.శని త్రయోదశి 03.గురు పూర్ణిమ 06.పునర్వసు కార్తె సంకటహర చతుర్థి 15.మాసశివరాత్రి, శనిత్రయోదశి 16.హైదరాబాద్ బోనాలు ప్రారంభం 17.దక్షిణాయనం ప్రారంభం 20.పుష్యమి కార్తె 29.మొహర్రం ఆగష్టు 2023 03.ఆశ్లేష కార్తె 04.సంకటహర చతుర్థి 08.శుక్ర మౌఢ్యమి ప్రారంభం 14.మాసశివరాత్రి 15.స్వాతంత్య్ర దినోత్సవం 17.మఖ కార్తె 19.శుక్రమౌఢ్యమి త్యాగం 21.నాగ పంచమి 25.వరలక్ష్మీ వత్రం 27.మతత్రయ ఏకాదశి 31.రాఖీ పౌర్ణిమ, పుబ్బకార్తె సెప్టెంబరు 2023 03.సంకటహర చతుర్థి 05.బలరామ జయంతి గురు పూజోత్సవము 07.శ్రీకృష్ణాష్టమి 10. మతత్రయ ఏకాదశి 12.మాసశివరాత్రి, ఉత్తర కార్తె 14. పోలాల అమావాస్య 18. వినాయక చవితి 25.పరివర్తన ఏకాదశి 28. హస్త కార్తె, మిలాద్ ఉన్ నబీ, అనంత పద్మనాభ వ్రతం 29.మహాలయ పక్షాలు ప్రారంభం అక్టోబరు 2023 01. ఉండ్రాళ్ళతద్ది 02.సంకటహర చతుర్థి, గాంధీ జయంతి 10. మతత్రయ ఏకాదశి 11.చిత్త కార్తె 12.మాస శివరాత్రి 14.మహాలయ అమావాస్య బతుకమ్మ ప్రారంభం 15.దేవినవరాత్రులు ప్రారంభం 22.దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ 23.మహర్నవమి 24.విజయ దశమి 28.వాల్మీకి జయంతి, చంద్రగ్రహణం 31.అట్లతద్ది నవంబరు 2023 01.సంకటహర చతుర్థి 07.విశాఖ కార్తె 11.ధన త్రయోదశి, మాసశివరాత్రి శని త్రయోదశి, ధన్వంతరి జయంతి 12.దీపావళి 14.బాలల దినోత్సవం 15.భగినీ హస్త భోజనం 17.నాగుల చవితి 19.భానుసప్తమి 20.అనూరాధ కార్తె డిసెంబరు 2023 03.జ్యేష్ఠ కార్తె 11.మాసశివరాత్రి 13.పోలిస్వర్గం 16.మూల కార్తె 17.ధనుర్మాస ప్రారంభం 18.సుబ్రహ్మణ్య షష్ఠి 22.గీతా జయంతి ముక్కోటి ఏకాదశి 24.హనుమత్ వ్రతం 25.క్రిస్మస్ 26.దత్తజయంతి 29.పూర్వాషాఢ కార్తె 30.సంకంటహర చతుర్థి జనవరి 2024 01.ఆంగ్ల సంవత్సరాది 07.అందరికీ ఏకాదశి 10.మాసశివరాత్రి 11.ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం 14.భోగి 15.మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం 16.కనుమ 17.ముక్కనుమ 24.శ్రావణ కార్తె 29.సంకటహర చతుర్థి ఫిబ్రవరి 2024 06.ధనిష్ఠ కార్తె 08.మాసశివరాత్రి 09.చొల్లంగి అమావాస్య 14.శ్రీపంచమి 16. భీష్మ ఏకాదశి, శతభిష కార్తె మార్చి 2024 04. పూర్వాభాద్ర కార్తె 08. మహాశివరాత్రి, మాసశివరాత్రి 12. రంజాన్ నెల ప్రారంభం 17.ఉత్తరాభాద్ర కార్తె 21.నృసింహ ద్వాదశి 23. శని త్రయోదశి 26. హోలీ 28. సంకటహర చతుర్థి 31. రేవతి కార్తె ఏప్రిల్ 2024 06.శని త్రయోదశి 07. మాసశివరాత్రి 09. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది -
కర్మ తప్పక వెంటాడుతుంది.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి భోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్టుడ్రి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసినా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?’ అని నిలదీస్తాడు. అందుకు కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద గువ్వల జంట ఒకటి వాటి గూట్లో గుడ్లతో నివసిస్తోంది. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవి చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు‘ అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. ‘కర్మ అంతగా వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు?’ అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది’ అని వివరిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. 1.చంద్రుడు : అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దంలో దిగంబరముగా చూసుకోవడం, వెక్కిరించడం వంటి చేష్టలు చేయకూడదు. 2.గురువు : సర్వ శాస్త్రాలు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువును కించపరచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుంది. గురువులను పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది. 3.బుధుడు : బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందునా బుధవారం ఈ పని అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉంది కదా అని విర్రవీగినా బుధుడు ఆగ్రహిస్తాడు. 4.శని : శనికి పెద్దలను కించపరచినా, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపం. తల్లిదండ్రులను చులకన చేసినా సహించడు. సేవక వృత్తి చేసిన వారిని శని కాపాడతాడు. 5.సూర్యుడు : పితృదేవతలని దూషిస్తే రవికి కోపం. సూర్యుడు నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదు. 6.శుక్రుడు : శుక్రుడికి భార్య భర్తనుగాని, భర్త భార్యనుగాని కించపరిస్తే కోపం. శుక్రుడు ప్రేమ కారకుడు. లకీ‡్ష్మ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు, మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టం. 7.కుజుడు : అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపం. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు. 8.కేతువు : జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడితే కేతువు ఆగ్రహిస్తాడు, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరం చేయవలసిన కార్యాలు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. 9.రాహువు : వైద్యవృత్తి పేరుతో మోసగించినా, సర్పాలకు హాని చేసినా రాహువు ఆగ్రహిస్తాడు. భ్రమకు, మాయకు రాహువు కారకుడు. శివదీక్ష నవగ్రహానుగ్రహము శ్రీమన్నారాయణునిచే శ్లాఘించబడిన మహత్తరమైన శాశ్వత శుభత్వమును కలుగజేయునదే శివదీక్ష. పార్వతీమాత పరమశివుని అనుగ్రహము కొరకు, స్వామిని వివాహము చేసుకోవడానికి కఠోరమైన శివార్చన నిర్వహించినది. లోకమాత పార్వతి మండువేసవిలో పంచాగ్నుల మధ్య, శీతకాలములో తడి వస్త్రము ధరించి, వర్షాకాలమందు జడివానలో సదాశివుని స్మరించి, శివదీక్ష నిర్వర్తించి, స్వామి కటాక్షము పొందినది. అర్ధ శరీరమును పొందగలిగినదా గౌరీ మనోహరి. శివదీక్షాపరులకు పరమేశ్వరుని అనుగ్రహము నిశ్చయము. శుభయోగమును అనేక సంవత్సరములు పొందగలరు. శివదీక్షను స్వీకరించిన కార్తికేయుడు సర్వదేవతా సేనాధిపతి అయినాడు. అర్జునుడు పాశుపతాస్త్రమును శివముఖతః పొందగలిగాడు. శివదీక్ష మానవునికి వంశానుగత శాశ్వత శుభయోగమునిస్తుంది. ఏలిననాటి శని శివదీక్షపరునికి అధికార ప్రాప్తిని, రాహువు ఆకస్మిక ధనమును, విదేశీ వ్యవహారములయందు విజయప్రాప్తిని, కుజుడు భూ సంపదలను, రవి ఆరోగ్యమును, గురువు ఉన్నత విద్య, సువర్ణ ఆభరణములను, కీర్తి ప్రతిష్ఠలను, శుక్రుడు కళత్ర వాహన సౌఖ్యములను, కేతువు విఘ్నములను హరించి అమృత యోగమును ఇస్తారు. చంద్రుడు జల సంపదలను, మనోబలమును ప్రసాదిస్తాడు. నవగ్రహములు, ద్వాదశ ఆదిత్యులు, నక్షత్ర మండలములు, శివాజ్ఞను అనుసరించి సంచరించును. శివదీక్ష స్వీకరించి తరించండి ! దీక్షా నియమములను సక్రమముగా పాటించండి. -
ఉగాది పంచాంగం: నవనాయక ఫలితాలు భవిష్య భారతం (2023– 2024)
రాజు– బుధుడు: అధికారంలో ఉన్నవారు వ్యాపార ధోరణిలో ప్రభుత్వాలు నడుపుతారు. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల మధ్య అభిప్రాయాల భేదాలు తలెత్తుతాయి. అధిక పన్నులు తప్పవు. సామాన్య మానవుడికి తినడానికి, తాగడానికి, నివసించడానికి అయ్యే ఖర్చులు అందుబాటు ధరల్లో ఉండవు. భారతదేశం తీసుకున్న కీలక నిర్ణయాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆయుర్వేద, జ్యోతిష మొదలగు అరుదైన శాస్త్రాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున మద్దతు లభిస్తుంది. దేశ ఆహార పద్ధతులలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలో మార్పులు సంభవిస్తాయి. ప్రపంచ స్థాయిలో దేశాలకు దేశాల మధ్య స్నేహం కాకుండా వ్యాపారధోరణి ఆలోచనలు తలెత్తుతాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్య నియమాలు పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. నూనె లేకుండా వంటలు చేసుకోవలసిన పరస్థితి సంభవిస్తుంది (ఆరోగ్య నియమం కాదు నూనె కొనలేని పరిస్థితులు ఏర్పడుతాయి.) చర్మ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. పెద్ద నాయకులు సభలు ఏర్పాటు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అపశ్రుతులు సంభవించే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయి. ప్రముఖ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. ధాన్యాధిపతి– శని: అన్నదాన సత్రాలు అధికమవుతాయి. లోకంలో కనివిని ఎరుగని స్థాయిలో వృద్ధాశ్రమాలు అభివృద్ధి చెందుతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ధాన్యం అపరాల దిగుబడి తగ్గుతుంది. ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి. పురుగుమందులు ఎక్కువగా ఉపయోగించబడిన పదార్థాలను స్వీకరించి తద్వారా అనేకరకాలైన రోగాలకు గురయ్యే అవకాశం ఉంది. మన సంస్కృతికి విరుద్ధమైన పోషక విలువలు లేని రకరకాల ఆహారపదార్థాలు, పానీయాలు మార్కెట్లో చలామణీ అవుతాయి. ఉచిత సేవాకేంద్రాలో కూడా వాణిజ్యపరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. నువ్వులు, జొన్నలు, రాగులు, ఉలవలు అందుబాటులో ఉంటాయి. పశుదాణాకు కొరత ఏర్పడుతుంది. అకాల వర్షాల వల్ల, వడగళ్ళవాన వల్ల, ఈదురు గాలుల వలన ధాన్య సంపదకు, పంటలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. వివిధ రకాలైన పంట పొలాలకు నష్టం కలుగుతుంది. అర్ఘ్యాధిపతి– గురువు: వేదాధ్యయనం బాగా జరుగుతుంది. తిరిగి వేదాభ్యాసాన్ని ఆశ్రయించేవాళ్ళు అధికమవుతారు. వేదమంత్రాలతో దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అతివృష్టి, అనావృష్టి కొనసాగుతుంది. అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష ప్రయాణాలలో అపశ్రుతులు చోటుచేసుకుంటాయి. ప్రజలలో దానగుణం పెరుగుతుంది. వేదపాఠశాలలు పునరుద్ధిరించబడతాయి, అరుదైన శాస్త్రాలను సంరక్షించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అధికంగా పిల్లలలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన విద్యను నేర్చుకోవాలనే ఉబలాటం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న నేపథ్యంలో ఆలోచిస్తారు. మేఘాధిపతి– గురువు: అతివృష్టి, అనావృష్టి, పిడుగుపాటులు, వడగళ్ళ వానలు సంభవం. సముద్రంలో ఆటుపోట్లు ప్రపంచస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఆస్తి నష్టం తప్పదు. జలప్రళయాలు వస్తాయి. ఆస్తినష్టం సంభవిస్తుంది. సముద్రమధ్య దీవులకు యమగండ కాలం దాపురిస్తుంది. భూకంపాలు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రకృతి నిర్దయ ప్రపంచానికి తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. సునామీలు వచ్చే అవకాశం ఉంది. అగ్నిపర్వతాలు పేలడం సర్వసాధారణం అవుతుంది. మంత్రి– శుక్రుడు: మంత్రిత్వం బ్రాహ్మణ గ్రహమైన శుక్రుడికి రావడం మంచిదే. పాలకుల ఆలోచనా విధానం, అభివృద్ధికి వ్యూహాలు బాగుంటాయి.అయితే ఆచరణలో మాత్రం తగిన ఫలితాలు రావు. అధికార పక్షానికి, విపక్షాలకు ఎన్నడూ లేని విధంగా సంగ్రామం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుంది. ముఖ్య నాయకుల అసహజ మరణం తీవ్రవిషాదానికి దారితీస్తుంది. పండ్లు, పూలు, స్వీట్లు, మద్యం అధిక ధరలు కలిగి ఉంటాయి. విదేశీ వివాహాల వ్యామోహం అన్ని హద్దులను దాటిపోతుంది. పర్వతప్రాంతాలలో దుస్సంఘటనలు సంభవిస్తాయి. ప్రేమ వివాహాలు, విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. మారుపెళ్ళిళ్ళ ప్రస్తావన నిత్యకృత్యంగా మారుతుంది. కవులు, కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్నపిల్లలు కళాసాంస్కృతిక వైజ్ఞానిక రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. బాలమేధావులను చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి లోనవుతుంది. కులమతవర్గ వివక్షలు అధికమవుతాయి. మత మార్పిడులు దేశాన్ని ఒక కుదుపు కుదుపుతాయి. మద్యం వినియోగం అధికమవుతుంది. అనేక రంగాలలో రాజకీయంగా, సామాజిక రంగాలలో, నేరచరిత్రలో స్త్రీల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. భార్యా బాధితులు అధికమవుతారు. యువతీ యువకులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉంటారు. యువత మద్యం, మాదక ద్రవ్యాల వలన నిర్వీర్యమవుతారు. సైన్యాధిపతి– శుక్రుడు: రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. సైనికుల వలన దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది. చాలా ప్రదేశాలలో ప్రభుత్వానికి పోటీగా తీవ్రవాద శక్తులు బలోపేతమవుతాయి. హ్యాకర్స్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆంతరంగిక భద్రతా వ్యవస్థకు గడ్డుకాలం. జైలు నుంచి పారిపోయే ఖైదీల సంఖ్య అధికమవుతుంది. స్త్రీలు అనేక రంగాలలో విశేషంగా రాణిస్తారు. క్రీడా, వైద్య, సాంస్కృతిక రంగాలలో స్త్రీలకు అఖండ ఖ్యాతి వస్తుంది. స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, వేధింపులు అధికమవుతాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. మారణాయుధాల వినియోగం, కొనుగోలు, రక్షణ బడ్జెట్ అధికమవుతుంది. సైన్యాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత రక్షణ రంగం బలపడుతుంది. అద్భుతమైన వ్యూహాలు రచించి, శత్రుదేశాలకు కొరకరాని కొయ్యగా తయారవుతుంది. సెక్యూరిటీ రంగంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. చాలామంది స్త్రీలు ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికవుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, షూటింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింన్ తదితర క్రీడారంగాలలో స్త్రీలు బాగా రాణిస్తారు. రసాధిపతి– బుధుడు: ప్రజాపోరాటాలు అధికమవు తాయి. బంగారం సహా లోహాలన్నీ ధర కలిగి ఉంటాయి. పెట్రోలు, డీజిల్ హింసాత్మక సంఘటన లలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మారణాయుధాల వినియోగం అధికమవుతుంది. చింతపండు, నూనె, దాల్చినచెక్క, అల్లం, నెయ్యి, పాలు, పెరుగు, హోమ ద్రవ్యాలు, పూజా, అలంకార సామాగ్రి, ఆయుర్వేద మూలికలు ధర కలిగి ఉంటాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు అనుకూల కాలం. చేతివృత్తుల వారికి ఊరట లభిస్తుంది. సంప్రదాయ వస్తువులకు, సామాగ్రికి ఆదరణ పెరుగుతుంది. నీరసాధిపతి– చంద్రుడు: చంద్రునికి నీరసాధిపత్యం వచ్చినందున నిజమైన సాహిత్య కళాకారులకి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ లభిస్తుంది. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఇబ్బందులు ఏర్పడుతాయి. ముఖ్య స్థానాలలో ఉన్న నాయకులపై లైంగిక ఆరోపణలు, స్కావ్ులు, ఇతర ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. దాచిపెట్టుకున్న సొమ్ము మనకు అందకుండా ఎక్కడ ఉందో అని రోజూ బాధపడుతున్న వారికి ఒక శుభవార్త అందుతుంది. వాళ్ళ డబ్బులు ఎవరు కొట్టేశారో, ఏ బడాబాబుల దగ్గర ఉన్నాయో బట్టబయలు అవుతుంది. దంత సమస్యలు అధికమవు తాయి. తైవాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలలో ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందే అవకాశం ఉంది. ప్రకృతి ముందు మానవుడు బలహీనుడని మరోసారి రుజువు అవుతుంది. కలుషితమైన ఆహారం, పానీయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆత్మహత్య ధోరణి ప్రపంచ స్థాయిలో అధికమవుతుంది. మంచినీళ్ళు తాగటం కూడా ఓ పెద్ద వరంగా మారుతుంది. సస్యాధిపతి– చంద్రుడు: జల ఉపద్రవాల వల్ల అనేక ప్రాంతాల్లో బీభత్సం సంభవిస్తుంది. కంట్లో నీళ్ళు, ఇంట్లో నీళ్ళు, త్రాగేందుకు మాత్రం నీళ్ళు దొరకవు. చంద్రుడికి సస్యాధిపత్యం రావడం వలన కళా సంబంధమైన, వినోద సంబంధమైన విషయాలు ప్రజలకు వైషమ్య సందేశాలను అందజేస్తాయి. భార్యాభర్తల మధ్య, యువతీ యువకుల మధ్య ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. కన్నవారి ప్రేమాభి మానాలు, రక్తసంబంధీకులు ప్రేమానురాగాలను సైతం తూకం వేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు చలామణీలో ఉంటాయి. అన్నిరకాల ధాన్యం, నిత్యవసర సరుకుల ధరలు విశేషంగా పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు హెచ్చుగానే ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితి వెనుకంజలో ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం చాలా ముఖ్యమైనది. -
ఉగాది పంచాంగం: శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం రవి భరణీ నక్షత్ర 3వ పాదంలో ప్రవేశించు కాలమే డొల్లుకర్తరీ ప్రారంభం. దీనిని చిన్నకర్తరీ అని కూడా అంటారు. రవి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించు కాలమే నిజకర్తరీ ప్రారంభం. రవి రోహిణీ నక్షత్ర 2వ పాదంలో ప్రవేశించు కాలమే కర్తరీ త్యాగము. ఈ కర్తరీ దినాలలో వాస్తు సంబంధ నూతన గృహారంభ, గృహప్రవేశాదులు చేయరాదు. కర్తరీలో చేయదగిన కార్యములు సూర్యుడు భరణి, కృత్తిక నక్షత్రాలలో ఉండే కాలంలో వివాహం, యజ్ఞం, మండపాదుల నిర్మాణం చేయవచ్చును. కర్తరీలో చేయదగని కార్యములు కర్తరీలో చెట్లు నరకడం, నారతీయడం, విత్తనాలు వేయడం, భూమిని తవ్వడం, కొత్త గ్రామాల నిర్మాణం, క్షౌరం, తోటలు వేయడం, చెరువులు, బావుల తవ్వకం, కొత్తబండినెక్కడం వంటి పనులు చేయరాదు. 05.05.2023 శ్రీ శోభకృత్నామ సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి, శుక్రవారం రోజున ‘డొల్లుకర్తరీ’ ప్రారంభము అవుతుంది. 11.05.2023 శ్రీ శోభకృత్నామ సంవత్సర వైశాఖ బహుళ షష్ఠి గురువారం రోజున నిజకర్తరీ ప్రారంభమవుతుంది. 28.05.2023 శుక్ల అష్టమి, ఆదివారం రోజున నిజకర్తరి త్యాగం. మౌఢ్యమి నిర్ణయం ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునికి సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది. జ్యోతిషశాస్త్రం మాత్రం శుభగ్రహాలైన గురు శుక్రులకు శక్తిహీనతను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య. గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమి గానూ, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే మూఢమి అని కూడా అంటారు. ఈ మౌఢ్యమి శుభకార్యాలకు పనికిరాదు. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి 01.04.2023 చైత్ర శుక్ల ఏకాదశి, శనివారం నుంచి 02.05.2023 వైశాఖ శుక్ల ద్వాదశి, మంగళవారం వరకు. శుక్రమౌఢ్యమి 08.08.2023 అధిక శ్రావణ బహుళ సప్తమి మంగళవారం నుంచి 18.08.2023 నిజ శ్రావణ శుక్ల విదియ శుక్రవారం వరకు. మకర సంక్రమణం మకర సంక్రాంతి పండుగ 15.01.2024 15వ తేదీ ఉదయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పుష్కరాలు 22–04–2023 శ్రీ శోభకృత్నామ సంవత్సరర వైశాఖ శుక్ల విదయ శనివారం నుంచి గంగానదికి పుష్కరాలు ప్రారంభం. చంద్రగ్రహణం శ్రీ శోభకృత్నామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి 28–10–2023 శనివారం రోజున రాహుగ్రస్థ చంద్రగ్రహణం. స్పర్శకాలం రా.1.04, మధ్యకాలం రా.1.43, మోక్షకాలం రా.2.33, గ్రహణ పుణ్యకాలం 1.25 గం. -
శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
-
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం. అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఉగాది పంచాంగ శ్రవణం రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఎలా జరుపుకోవాలి? తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి. నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే ! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది. ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి. బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే! ప్లవ అంటే... ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం. పండగ వేళ... తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు.. ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది... ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే.. ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి.. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్ఈడి బల్బులతో అలంకరిస్తే సరి. సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది. ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు. ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు. పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది. – డి.వి.ఆర్. భాస్కర్ -
వైఎస్సార్ పాలనను మళ్లీ చూడబోతున్నాం
-
వైఎస్సార్ పాలనను మళ్లీ చూడబోతున్నాం
సాక్షి, కాకుమాను: మహానేత వైఎస్సార్ సువర్ణపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో జననేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పురోహితులు ఆశీర్వదించారు. ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద జరిగిన ఈ వేడుకల్లో పలువురు పండితులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి 135 సీట్లు ఖాయం : విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధికమాసాలు ఎక్కువ ఉన్నందున దీనిని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని పంచాంగకర్తలు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వైఎస్ జగన్ జాతకంలోని సమస్యలన్నీ తీరిపోతాయని, అటుపై రాజయోగం పడుతుందన్నారు. 2019లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వైఎస్సార్సీపీకి 135 సీట్లు వస్తాయని తెలిపారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరుగాలనే ఉద్దేశంతో సహస్త్రచండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్ పూర్ణాహుతి కోసం వస్తారని స్వాములు శుభం పలికారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్.. ఇంటింటా మంచి జరగాలని కోరుతున్నానన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)