మకర రాశి: పెట్టుబడుల్లో జాగ్రత్త… ఈ రాశివారికి ముఖ్య హెచ్చరిక | Makara Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27 | Sakshi
Sakshi News home page

మకర రాశి: పెట్టుబడుల్లో జాగ్రత్త… ఈ రాశివారికి ముఖ్య హెచ్చరిక

Mar 18 2026 6:48 AM | Updated on Mar 18 2026 6:48 AM

Makara Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 1, అవమానం– 2
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)

ఈ సంవత్సరం గురువు మిథునంలో (షష్ఠం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (సప్తమం) అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (అష్టమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (తృతీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (ద్వితీయం) కేతువు సింహంలో (అష్టమం); తర్వాత రాహువు మకరంలో (జన్మం) కేతువు కర్కాటకంలో (సప్తమం) సంచరిస్తారు.

దైనందిన కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి. వాటిని తెలివిగా దాటవేస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయం వల్ల తరచుగా కలహాలు. ఆర్థిక కార్యకలాపాలలో ఓర్పు అవసరం. ఖర్చులు పరిధి దాటతాయి. శుభకార్యాల కోసం, వస్తువుల మరమ్మతుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఓర్పు అవసరం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. ఫైనాన్స్‌ వ్యాపారులకు అక్టోబర్‌ నుంచి మోసపూరిత వాతావరణం. అవసరానికి కావలసిన ఋణాలు అందవు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. అక్టోబర్‌ నుంచి ఆరోగ్య సమస్యల వల్ల పనులకు ఆటంకాలు. ఉద్యోగ కార్యకలాపాలలో మంచి ఫలితాలు. తోటివారి నుంచి సహకారం తక్కువ. మార్కెటింగ్‌ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. 

జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయ పరిస్థితులు. వ్యాపారులకు అనవసర చికాకులు. శ్రమాధిక్యం, లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల సలహాలు విని పెట్టుబడుల జోలికి పోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. షేర్‌ వ్యాపారులు తెలివిగా వ్యాపారం చేసినా, అనుకున్న స్థాయి ఫలితాలు దక్కవు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం దారి మళ్ళుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సహకారం అందవు. కోర్టు వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ విధి నిర్వహణలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. అయితే, ఆర్థిక ఎదుగుదల తక్కువ. అక్టోబర్‌ తరువాత వైద్య విషయంలో కూడని సలహాలు అందుతాయి. గర్భిణులు అక్టోబర్‌ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉత్తరాషాఢ 2, 3,4: ప్రతిపనికీ అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. కొత్త పెట్టుబడులకు కాలం అనుకూలం. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.

శ్రవణం: ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. వృథా ఖర్చులను నియంత్రించ గలుగుతారు. 

ణాలు తీర్చే ప్రయత్నంలో గొప్ప కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అధిక శ్రమ తప్పదు. 
ధనిష్ఠ 1, 2: ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూరప్రాంత సందర్శన చేస్తుంటారు. ఏ విషయంలోనూ స్థిరబుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయాలలో అవసరమైన సలహాలు అందవు. 

శాంతి మార్గం: ప్రతినిత్యం ఎక్కడ వేదపారాయణ జరుగుతున్నా వెళ్ళి వినడం ప్రారంభించండి. ప్రాతఃకాలంలో దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్తోత్ర  పారాయణ లేదా శ్రవణం చేయండి. అక్టోబర్‌లో గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. గురువారం శనగలు, తీపి పదార్థాలను దానం చేయండి. సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగవు. వృత్తి విషయాలలో ఒత్తిడి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో అనుకూల వార్తలు. కోరుకున్న రీతిగా స్వేచ్ఛగా సంచరిస్తారు. సంతానం ద్వారా అనుకూలత. 

మే: పెద్దల ఆరోగ్య విషయంగా, పిల్లల వృద్ధి విషయంగా చికాకులు. రోజువారీ పనులలో సమయ పాలన చేయలేరు. ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. షేర్‌ వ్యాపారులకు 15వ తేదీ వరకు అనుకూలం. విద్యా వ్యాసంగం, ప్రయాణాలు ఇబ్బందికరం. 

జూన్‌: తెలివి బాగా పనిచేసినా, చాలా పనులు సాధించలేని పరిస్థితి. ఖర్చులు విచిత్రంగా వస్తుంటాయి. వాటిని నియంత్రించలేరు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. ప్రయాణాలు తగ్గించాలి. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేసి అమలు చేసి సఫలమవుతారు. 

జులై: సమస్యలు సరిచేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. ఆర్థిక విషయాలు సామాన్యం. వృత్తి విషయంలో తోటివారి సహాయ సహకారాలు, అధికారుల అండదండలు బాగుంటాయి. 

ఆగస్ట్‌: స్వయంగా చేసుకునే పనులు బాగా పూర్తవుతాయి. ఇతరుల సమస్యలపై దృష్టి పెట్టకుండా, మీ రోజువారీ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. 

సెప్టెంబర్‌: శ్రమ ఎక్కువ అయినా, సోమరితనం ప్రదర్శించకుండా వేగంగా ప్రణాళికలు చేస్తే సానుకూల ఫలితాలు అందుతాయి. 18వ తేదీ తరువాత సానుకూలత తక్కువ. సహకరించేవారు తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఋణ సౌకర్యం సరిలేక కొన్ని పనులు ఆగుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. 

అక్టోబర్‌: ఆకస్మిక ధనలాభం. వృత్తి రీత్యా తరచు అవరోధాలు. శుభ, పుణ్యకార్యాలలో మీ శ్రమ ఆలస్యంగా సఫలం అవుతుంది. ఋణ వ్యవహారాలలో అవమానాలు రాకుండా జాగ్రత్తపడండి. ఇతరుల మాటలు నమ్మి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి విషయాలు స్వయంగా చూసుకోండి. 

నవంబర్‌: కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తిరీత్యా కలహాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉండవు. ఆరోగ్య సమస్యలకు మంచి సలహాలు అందుతాయి. తరచుగా విద్యాభంగం పొందుతారు.

డిసెంబర్‌: మంచి మార్పులకు శ్రీకారం పడుతుంది. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ ప్రదర్శించి అధికారుల ప్రోత్సాహం అందుకుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపారాలలో పనివారిపై ఆధారపడటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు బాగుంటాయి.

 జనవరి: ఆర్థిక లావాదేవీలు సమస్య కాకుండా జాగ్రత్త పడతారు. రోజువారీ పనులలో అవాంతరములు ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమస్యలు రాకుండా చూసుకుంటారు. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ప్రతి నిమిషం ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. 

ఫిబ్రవరి: మోసపూరిత వాతావణానికి దగ్గరవుతారు. కలహాలు, ఋణాలు, వాహన చికాకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నిత్యం వెంబడిస్తాయి. స్త్రీలు పని ఒత్తిడికి లోనవుతారు. ఋణ వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు. మార్చి: మానసిక చికాకులు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా పనులు సానుకూలం చేయలేని స్థితి. ఆర్థిక వెసులుబాటు సామాన్యంగా ఉంటుంది. వస్తువుల కొనుగోలులో మోసపోతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement