వృశ్చిక రాశి: జూలై తర్వాత జీవితంలో టర్నింగ్ పాయింట్! | Vrischika Rashi Ugadi Rashi Phalalu 2026-27 In Telugu, Know Your Sri Parabhava Nama Samvatsara Vrischika Rashi Astrology Predictions | Sakshi
Sakshi News home page

Vrischika Rashi Predictions: జూలై తర్వాత జీవితంలో టర్నింగ్ పాయింట్!

Mar 18 2026 6:45 AM | Updated on Mar 18 2026 11:10 AM

Vrischika Rasi - Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం– 11, వ్యయం– 5, రాజయోగం– 2, అవమానం– 6
విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)

Vrischika Rashi Ugadi Rashi Phalalu 2026-2027: ఈ సంవత్సరం గురువు మిథునంలో (అష్టమం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (భాగ్యం) అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (రాజ్యం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (పంచమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (అర్ధాష్టమం) కేతువు సింహంలో (దశమం); తర్వాత రాహువు మకరంలో (తృతీయం) కేతువు కర్కాటకంలో (భాగ్యం) సంచరిస్తారు.

దైనందిన కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేస్తుంటారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో జూన్‌ వరకు చికాకులు. సంవత్సరం అంతా సాధారణ ఫలితాలు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం జూన్‌ వరకు ఇబ్బందికరంగానూ, జూలై నుంచి బాగా అనుకూలంగానూ ఉంటుంది. విద్యా విజ్ఞాన వినోద కార్యకలాపాలలో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పిల్లల శుభ కార్యాలకు అధిక వ్యయం చేస్తారు. చోరభయం, రోగభయం, అగ్నిభయంతో జులై వరకు ముఖ్య వ్యవహారాలను వదిలేస్తారు. ఋణ వ్యవహారాలు అనుకూలం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకుంటారు. అక్టోబర్‌ వరకు చిన్న చిన్న ఇబ్బందులు.

 ఉద్యోగ వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు ద్వితీయార్ధంలో అభివృద్ధికరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. వ్యాపారులకు జులై నుంచి అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో శ్రమతో విజయాలు. షేర్‌ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలం. ఈ రాశి స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు. శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి. గర్భిణులకు ప్రతిబంధకాలు ఉండవు. 

ధనూ రాశి: అనవసర అప్పులు చేయొద్దు… ఈ రాశివారికి హెచ్చరిక

విశాఖ 4: శ్రమతో పనులు సాధ్యపడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం.

అనురాధ: ఆర్థికంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు విజయవంతం. 

జ్యేష్ఠ: తెలియని భయం. కుటుంబ సభ్యులతో కలహాలు. అనవసర ప్రయాణాలు. గురువుల సందర్శన.

శాంతి మార్గం: నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజూ పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన విశేష ఫలప్రదం. పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభçప్రదం.

ఏప్రిల్‌: కుటుంబంలో అనైక్యత. స్వబుద్ధితో పనులు సానుకూలం అవుతాయి. పనుల్లో చికాకులు. ఒంటరిగా దూర ప్రయాణాలు తగ్గించండి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. 

మే: పనులు వాయిదా వేస్తారు. సొంత విషయాల్లో గోప్యత పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు. అనుకున్న ప్రణాళికలకు, ఆచరణకు పొంతన ఉండదు. జూన్‌: నూతన ప్రయత్నాలు సాగకున్నా, రోజువారీ వ్యవహారాలు బాగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల సహకారం బాగుంటుంది. 

జులై: పనులు సానుకూలం అవుతున్నట్లుగా గోచరించినా, ఏదో ఒక చికాకు దాగి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వ్యవహార చికాకులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుణ్య, శుభకార్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. 

ఆగస్ట్‌: చాలాసార్లు సోమరితనం ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు విజయలక్ష్యంతో ముందుకు వెడతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సహకారం బాగుంటుంది. 

సెప్టెంబర్‌: క్రమక్రమంగా మంచి ఫలితాలు. ఉద్యోగ వ్యాపారాలలో పనుల సానుకూలతలో అన్ని వనరులు సహకరిస్తాయి. అక్టోబర్‌: ఉద్యోగులకు అనుకూలత  తక్కువ. సకాలంలో అన్న వస్త్రాలు సమకూరని పరిస్థితి. ఇతరుల మాటలు విని కుటుంబ కలహాలు తెచ్చుకుంటారు. వ్యాపారులు ఓర్పు వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. 

నవంబర్‌: బంధువుల సహకారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. జరగవని వదిలేసిన పనులు కూడా పూర్తవుతాయి.

డిసెంబర్‌: కాలాన్ని లాభదాయకంగా మార్చుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచుతారు. శుభకార్య ప్రయత్నాలలో భార్య తరఫు బంధువులు సహకరిస్తారు. కొత్త ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకు సానుకూలం. 

జనవరి: మంచి మార్పులు ఉంటాయి. ఓర్పుగా ప్రవర్తించి విజయాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువులు సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

ఫిబ్రవరి: కుటుంబ అవసరాలు తీర్చడానికి బాగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలలోను, కుటుంబ వ్యవహారాలలోను బంధు మిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. అందరి సహకారం ఉంటుంది. ఏదో తెలియని అంశాలలో కలహాలు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. అలంకరణ వస్తువుల కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. వాహనములు, ఎలక్ట్రికల్‌ వస్తువులకు మరమ్మతులు చేయించాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement