ఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 1, అవమానం– 7.
మృగశిర 3,4 పాదములు (కా, కి), ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)
Mithuna Rashi Ugadi Rashi Phalalu 2026-2027: ఈ సంవత్సరం గురువు మి«థునంలో (జన్మం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (ద్వితీయం), అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (తృతీయం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (దశమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (నవమం) కేతువు సింహంలో (తృతీయం); తర్వాత రాహువు మకరం (అష్టమం)లో కేతువు కర్కాటకంలో (ద్వితీయం) సంచరిస్తారు.
కుటుంబ విషయాలలో అనుకూలత ఉన్నా, సంవత్సరాంతంలో తెలియని భయాలు. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఆర్థిక కార్యకలాపాలలో సానుకూలత. ఫైనా¯Œ ్స వ్యాపారులకు అక్టోబర్ వరకు అనుకూలం. అక్టోబర్ నుంచి మానసిక సమస్యలు. ఉద్యోగులకు స్థానచలనం, ప్రమోషన్‌లలో సానుకూలతలు తక్కువ. వ్యాపారులు ఏడాది ప్రథమార్ధంలో బాగున్నా, ద్వితీయార్ధంలో ఒత్తిడి. షేర్ వ్యాపారులకు మధ్యమధ్యలో ఇబ్బందులు. విద్యార్థులకు సంవత్సరాంతంలో ప్రతికూలత. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి. స్థిరాస్తి వ్యవహారాలలో మోసాలు. ఈ రాశి స్త్రీలకు అక్టోబర్ వరకు సానుకూలంగానూ, అక్టోబర్ తర్వాత మానసిక ఒత్తిడితోనూ ఉంటుంది. గర్భిణులు సాధారణ జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి: ఏలినాటి శని ప్రభావం… ఈ రాశివారికి పరీక్షల సంవత్సరం
మృగశిర 3, 4: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయవద్దు. అనవసర శ్రమ ఎక్కువ.
ఆరుద్ర: ఖర్చులు నియంత్రించలేరు. ద్వితీయార్ధంలో మానసిక ఇబ్బందులు. ఆరోగ్య, ఋణ చికాకులు. పునర్వసు 1, 2, 3 : ప్రణాళిక లేని ఆర్థిక కార్యకలాపాలు. గోప్యత పాటించక చికాకులు, వృథా కాలక్షేపాలు.
శాంతి మార్గం: అక్టోబర్‌లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలు చేయించండి. స్వయంగా దత్తస్తవరాజం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అక్టోబర్ నుంచి దుర్గా సప్తశ్లోకీ పారాయణ ప్రతిరోజూ 11 సార్లు చేయండి. మినుములతో చేసిన పదార్థాలను దానం చేయండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.
ఏప్రిల్: పనులు అర్ధాంతరంగా వదిలేస్తారు. కుటుంబ సభ్యులతో సయోధ్య. తరచుగా వాహన సమస్యలుు.
మే: పెండింగ్ పనుల్లో వేగం. ఆర్థికంగా సానుకూలం. విద్యార్థులకు ప్రతికూలత. జూన్: అనవసర వ్యయం ఎక్కువ. వృథా ప్రయాణాలు. అకాల భోజనం. శుభకార్య ప్రయత్నాలు అనుకూలం.
జులై: ఉద్యోగులకు అధికారుల నుంచి రక్షణ లభించని స్థితి. కొత్త ఋణాలు దొరకకవు. పాత ఋణాలతో ఇబ్బందులు.
ఆగస్ట్: అవసరమైన పనులు వాయిదా. రోజువారీ పనులు ఆలస్యంు. విద్యార్థులకు విద్యాభంగం. స్థిరబుద్ధి ఉండదు.
సెప్టెంబర్: పుణ్య కార్యాలలో ఆటంకాలు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం.
అక్టోబర్: కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు, విజ్ఞాన విహారయాత్రలు. వృత్తి విషయాలు సానుకూలం. దురలవాట్లు ఉన్నవారికి ఇబ్బందులు. ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా మెలగుతారు.
నవంబర్: భార్యా పుత్ర కలహం పెరుగుతుంది. ఉద్యోగం వ్యాపారాలలో తోటివారితో కలహాలు. వాహన మరమ్మతు ఖర్చులు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా, పనులు లాభిస్తాయి.
డిసెంబర్: కాలం అనుకూలిస్తుంది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయాలు. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి: కుటుంబ విషయంలోను, బంధుమిత్రులతోను జాగ్రత్తలు పాటించాలి. ఆదాయ వ్యయాలపై నియంత్రణకు ప్రయత్నించండి. పాత ఋణములు, పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడండి. ఫిబ్రవరి: స్థిరచిత్తం ఉంచరు. సోమరితనంతో తోటివారితో కలహాలు. ఆర్థిక వనరులు బాగానే సమకూరుతాయి. అత్యవసరమైన పనుల్లో సరిగా దృష్టి ఉంచక ఇబ్బంది పడతారు. మార్చి: బుద్ధి కుశలతతో ఉద్యోగ విధి నిర్వహణలో గౌరవం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగా కాపాడుకుంటారు. వ్యాపారులు సమస్యలను అధిగమిస్తారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ప్రణాళికతో ఉంటారు. పుణ్య కార్యాలు చేస్తారు. స్థానచలన, ప్రమోష¯Œ లకు ప్రత్యేక ప్రయత్నాలు సాగిస్తారు. విద్యా వ్యాసంగం బాగుంటుంది.


