కన్యా రాశి: ఆలస్యమైనా విజయం.. ఈ రాశికి అనుకూలమైన సంవత్సరం | Kanya Rashi Ugadi Rashi Phalalu 2026-27 In Telugu, Know Your Sri Parabhava Nama Samvatsara Kanya Rashi Astrology Predictions | Sakshi
Sakshi News home page

Kanya Rashi Predictions: ఆలస్యమైనా విజయం.. ఈ రాశికి అనుకూలమైన సంవత్సరం

Mar 18 2026 6:28 AM | Updated on Mar 18 2026 11:24 AM

Kanya Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 3, అవమానం– 3.
ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)
హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)
చిత్త 1,2 పాదములు (పే, పో)

Kanya Rashi Ugadi Rashi Phalalu 2026-2027: ఈ సంవత్సరం గురువు మి«థునంలో (దశమం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (లాభం), అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (వ్యయం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (సప్తమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (షష్ఠం) కేతువు సింహంలో (వ్యయం); తర్వాత రాహువు మకరంలో (పంచమం) కేతువు కర్కాటకంలో (లాభం) సంచరిస్తారు.

రోజువారీ పనులు ఆలస్యమైనా ఆ ప్రభావం ఇతర కార్యక్రమాలపై పడకుండా చూసుకుంటారు. కుటుంబ విషయాలలో సానుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు. పనులు ఆలస్యమైనా, విజయవంతం. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త కొత్త ఖర్చులు పెరుగుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థక్షేత్ర దర్శనం, వాహన మార్పులు చేస్తారు. ఫైనాన్స్‌ వ్యాపారులకు లాభాలు. బాకీల వసూలు ఆలస్యం. నరాలు, గుండె సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు. మిగిలినవారికి అనుకూలం. ప్రమోషన్‌ వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్‌ ఉద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో నిదానంగా పనులు సానుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు మందకొడిగా సాగినా, ఫలితాలు లాభదాయకం. షేర్‌ వ్యాపారులకు లాభాలు మందగమనం. విద్యార్థులకు విద్యా వ్యాసంగం కుంటుపడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత. స్థిరాస్తి వ్యవహారాలలో సత్ఫలితాలు. ఈ రాశి స్త్రీలకు సకాలంలో ఏ పనీ సాగదు. అవసరానికి తగిన ఆర్థిక వెసులుబాటు దొరకని పరిస్థితి. గర్భిణులకు ఇబ్బందులు ఉండవు కాని, ఏదో తెలియని ఆందోళనకు లోనవుతారు.

సింహ రాశి: ఓర్పు ఉంటే మార్పు.. అక్టోబర్‌ తర్వాత అనుకూల పరిస్థితులు

ఉత్తర 2, 3, 4: ప్రమోషన్‌లు ఆలస్యం. పిల్లలు సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం అనుకూలం. 
హస్త: కిందిస్థాయి వారితో అవమానపడే పరిస్థితులు. తెలివిగా పనులు సాధించుకోగలుగుతారు. శ్రమాధిక్యత.  
చిత్త 1, 2: ఆర్థికంగా, శారీరకంగా శ్రమకు లోనవుతారు. ఇతరుల మీద ఆధారపడి పనులు పాడు చేసుకుంటారు.  
శాంతి మార్గం: దశరథకృత శని స్తోత్రం రోజూ పఠించండి. శ్రీరామ శ్శరణం మమ అని చెబుతూ ఆంజనేయస్వామికి రోజూ 11 ప్రదక్షిణలు చేయండి. బీదసాదలకు చెప్పులు, వస్త్రాలు దానం, శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం, షణ్ముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: పాత ఋణములు ఇబ్బందికరం. కొత్త ఋణాలు అవసరానికి అందవు. ఖర్చులు నియంత్రించలేరు. విద్యార్థులు, షేర్‌ వ్యాపారులు, ఫైనాన్‌ వ్యాపారులకు చికాకులు. సామాజిక గౌరవం. 

మే: కుటుంబ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారితో సమస్యలు. పనులు వాయిదా వేస్తుంటారు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం కాదు. జూన్‌: ఒత్తిడి లేకుండా పనులు నెరవేరవు. ఆర్థిక వెసులుబాటులో చికాకు పడతారు. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. ఋణ వ్యవహారాలు, స్నేహితులతో కలసి చేసే పనులలో ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది.

 జులై: వాగ్వాదాలు తరచుగా ఉంటాయి. భోజన అసౌకర్యం. వాహనాలు, పనిముట్ల వల్ల గాయాలు. పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రేగడం జరుగుతాయి. 

ఆగస్ట్‌: వ్యవహారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, కుటుంబ అనుకూలత తక్కువ. సమాజంలో విలువ పెరుగుతుంది. 

సెప్టెంబర్‌: తేలికగా పనులు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. విచిత్ర సందర్భాలు ఎదురవుతాయి. యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. 

అక్టోబర్‌: కొత్త కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. విజయాలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో శుభ పరిణామాలు. 

నవంబర్‌: రోజువారీ వ్యవహారాలు సరిగా సాగవు. సహకరించే వారు వ్యతిరేకించే అవకాశం ఉన్నది. సంబంధంలేని విషయాలలో అవమానాలు. అధిక ఖర్చులు, కలహాలు. 

డిసెంబర్‌: క్రమంగా మంచి మార్పులు. శుభవార్తలు వింటారు. లాభాలు బాగా అందుతాయి. సుఖశాంతులు, విజయావకాశాలు పెరుగుతాయి. 

జనవరి: పనులు ఆలస్యం. ఉద్యోగంలో ఒత్తిడి. వ్యాపారులకు పెట్టుబడులు అందినా, స్థిరమైన వ్యాపారం చేయలేని పరిస్థితి.

 ఫిబ్రవరి: అద్భుతమైన బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అకారణంగా విచిత్ర సమస్యలు వస్తుంటాయి. విద్యా విషయంతో గౌరవం పొందుతారు. కుటుంబ విషయాలు అనుకూలం. వృథా కాలక్షేపంతో పనులకు ఆటంకాలు.

 మార్చి: రోజువారీ పనులలో ఆలస్యం. అవమానకర ఘటనలు. తరచుగా వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఇబ్బందులు. శుభ, పుణ్యకార్యాలలో చికాకులు. 

Advertisement
 
Advertisement
Advertisement