పెట్రోల్ బంక్లో దోపిడి దొంగలు బీభత్సం | Robbery at petrol pump in Vatticherukuru, Guntur district | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంక్లో దోపిడి దొంగలు బీభత్సం

Dec 2 2014 8:53 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని పెట్రోల్ బంక్పై దోపిడి దొంగలు సోమవారం అర్థరాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించారు.

గుంటూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని పెట్రోల్ బంక్పై దోపిడి దొంగలు సోమవారం అర్థరాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించారు. బంక్లోని ముగ్గురు సిబ్బందిని విచక్షణరహితంగా కొట్టి వారి వద్దనున్న నగదు... పెట్రోల్ బంక్లోని నగదును అపహరించి పరారైయ్యారు. దాడికి గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు పెట్రోల్ బంకుకు చేరుకుని గాయపడిన సిబ్బందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి... ప్రాధమిక చికిత్స అందించారు. దోపిడి జరిగిన తీరును పోలీసులు బంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement