ఆర్టీసీ బస్సు..ఆటో ఢీ | Road Accident In Prakasam 3 In Critical | Sakshi
Sakshi News home page

ముగ్గురి పరిస్థితి విషమం

Aug 21 2019 1:36 PM | Updated on Aug 21 2019 1:36 PM

Road Accident In Prakasam 3 In Critical - Sakshi

బస్సును ఢీకొన్న ఆటో వద్ద రక్తపు మరకలు,తీవ్ర గాయాలపాలైన ఆటో డ్రైవర్‌ 

 సాక్షి, ప్రకాశం(కనిగిరి) : ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన హైదరాబాద్‌ సర్వీసు బస్సు కనిగిరి వెళుతోంది. చింతలపాలెంకు చెందిన ఆటో కనిగిరి వైపు వెళుతుండగా రెండు వాహనాలు డిపో సమీపంలో ఢీ కొన్నాయి. దీంతో ఆటో నడుపుతున్న చెంచలరాజ్‌కు, ఆటోలో ప్రయాణిస్తున్న తలారి రాజుకు, ఎస్‌కే నాసర్‌బీ, ఎస్‌కే మాబులాకు గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్‌కు, నాసర్‌బీ, మాబులాకు తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈమేరకు ఎస్సై ఎస్‌. శివన్నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement