రియాజ్‌కు బెయిలు | Riaz bail | Sakshi
Sakshi News home page

రియాజ్‌కు బెయిలు

Aug 29 2014 3:53 AM | Updated on Sep 2 2017 12:35 PM

మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్ రియాజ్‌కు గురువారం బెయిలు మంజూరైంది. భాకరాపేట స్టేషన్లో నమోదైన ఎర్రచందనం కేసుకు సంబంధించి ఇతనికి బెయిల్ వచ్చింది.

సాక్షి, చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్ రియాజ్‌కు గురువారం బెయిలు మంజూరైంది. భాకరాపేట స్టేషన్లో నమోదైన ఎర్రచందనం కేసుకు సంబంధించి ఇతనికి బెయిల్ వచ్చింది. కర్ణాటకకు చెందిన రియాజ్ స్మగ్లర్ వీరప్పన్‌తో కలిసి సత్యమంగళం అడవుల్లో శ్రీగంధం స్మగ్లింగ్ చేసేవాడు. వీరప్పన్ మరణం అనంతరం ఇతను ఎర్రచంద నం స్మగ్లింగ్‌కు అలవాటు పడ్డాడు.

ఇతనిపై దాదాపు 20 కేసులు ఉన్నాయి. నెలన్నర కిందట రియాజ్‌ను చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. ఇతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని అప్పటి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రకటించారు. అయితే కలెక్టర్ సిద్ధార్థజైన్ పీడీ నమోదులో నిర్లక్ష్యం వహించారు. ఈ కారణంగానే రియాజ్‌కు బెయిల్ మంజూరైంది. రియాజ్ నెలకు 15 కోట్ల రూపాయలు స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్నాడు. రియాజ్‌తో పాటు తక్కిన అంతర్జాతీయ స్మగ్లర్లకు కూడా త్వరలో బెయిల్ రానున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement