'ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు వెళతాం' | ration dealers will go for strike at any time | Sakshi
Sakshi News home page

'ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు వెళతాం'

May 27 2015 8:37 AM | Updated on Sep 3 2017 2:47 AM

ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు దిగుతామని జాతీయ ఉత్పత్తి, పంపిణీ పథకం నిర్వహణదారుల సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు తెలిపారు.

విజయవాడ: ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు దిగుతామని జాతీయ ఉత్పత్తి, పంపిణీ పథకం నిర్వహణదారుల సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు తెలిపారు. పస్తుతానికి కార్డు దారుల ఇబ్బందులు, దీక్షలో కూర్చున్న రేషన్ డీలర్ల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలు ప్రారంభమైన నాటి నుంచి వడదెబ్బతో ఒక డీలర్ చనిపోగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు ఆయన మంగళవారం విజయవాడలో తెలిపారు. వీటన్నిటి దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. అయితే, రేషన్ ఇస్తూనే జూన్ 1వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement