breaking news
leela madhavarao
-
'ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు రావాల్సి ఉంది'
తెనాలి: రాష్ట్ర డీలర్లు చాకిరీ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం లేదని ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పండుగ రోజుల్లో కూడా ప్రజలకు కందిపప్పు, పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ చేయలేని పరిస్థితులలో రేషన్ డీలర్లు ఉన్నారని పేర్కొన్నారు. గత 20 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.3 కోట్లు రావాల్సి ఉందని లీలా మాధవరావు తెలిపారు. -
'ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు వెళతాం'
విజయవాడ: ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఏ క్షణాన్నైనా మెరుపు సమ్మెకు దిగుతామని జాతీయ ఉత్పత్తి, పంపిణీ పథకం నిర్వహణదారుల సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు తెలిపారు. పస్తుతానికి కార్డు దారుల ఇబ్బందులు, దీక్షలో కూర్చున్న రేషన్ డీలర్ల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలు ప్రారంభమైన నాటి నుంచి వడదెబ్బతో ఒక డీలర్ చనిపోగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు ఆయన మంగళవారం విజయవాడలో తెలిపారు. వీటన్నిటి దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. అయితే, రేషన్ ఇస్తూనే జూన్ 1వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.