'ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు రావాల్సి ఉంది' | andhra pradesh government did not recognize ration dealers service | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు రావాల్సి ఉంది'

Nov 11 2015 7:38 PM | Updated on Sep 3 2017 12:22 PM

రాష్ట్ర డీలర్లు చాకిరీ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్వించడం లేదని ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు వ్యాఖ్యానించారు.

తెనాలి: రాష్ట్ర డీలర్లు చాకిరీ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం లేదని ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం సాయంత్రం  మీడియాతో మాట్లాడారు. పండుగ రోజుల్లో కూడా ప్రజలకు కందిపప్పు, పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ చేయలేని పరిస్థితులలో రేషన్ డీలర్లు ఉన్నారని పేర్కొన్నారు. గత 20 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.3 కోట్లు రావాల్సి ఉందని లీలా మాధవరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement