'కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు' | raghu veera reddy takes on tdp sarkar | Sakshi
Sakshi News home page

'కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు'

Jun 12 2015 4:32 PM | Updated on Aug 10 2018 8:13 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా మరోసారి మండిపడ్డారు.

అనంత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా మరోసారి మండిపడ్డారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని రఘువీరా విమర్శించారు.  కేవలం పోలవరంతోనే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా  ఆయన స్పష్టం చేశారు.

 

పోలవరం ప్రాజెక్టును కేంద్రం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టిన 'ప్రాజెక్టు అనంత'పై టీడీపీ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement