ధర్నా చేపట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే | Rachamallu Siva Prasad Reddy protest for Textile workers | Sakshi
Sakshi News home page

ధర్నా చేపట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే

Dec 5 2017 11:36 AM | Updated on Aug 11 2018 7:29 PM

Rachamallu Siva Prasad Reddy protest for Textile workers - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేదు. దీంతో చేనేత కార్మికులు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వారికి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు మద్దతు పలికారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే వారికి మద్ధతుగా ధర్నాకు దిగారు. చేనేత కార్మికులకు పింఛన్ పంపిణీ చేసే వరకు తాను ధర్నా కొనసాగిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement