పదోన్నతులపంచాయతీ | promotion to panchayati | Sakshi
Sakshi News home page

పదోన్నతుల పంచాయతీ

Mar 2 2014 3:48 AM | Updated on Sep 2 2017 4:14 AM

పంచాయతీ కార్యదర్శుల మధ్య పోస్టింగ్‌ల వివాదం తారా స్థాయికి చేరింది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లిందిv

 పంచాయతీ కార్యదర్శుల మధ్య పోస్టింగ్‌ల వివాదం తారా స్థాయికి చేరింది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.

 

జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న కొందరు జూనియర్ అసిస్టెంట్లు, ఇప్పటికే గ్రేడ్-3 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 22 మందికి ఇటీవల గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో కొంత మంది ప్రస్తుతం ఖాళీగా వున్న గ్రేడ్-1 పంచాయతీల్లో నియమించాలని కోరడంతో పంచాయతీ అధికారులు ఆ మేరకు నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.

 

అందుకు  గ్రేడ్-1 గ్రామ పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరం వ్యక్తం వ్యక్తం చేయడంతో వర్గాలుగా విడిపోయారు. రూ.5 లక్షల పైబడి ఆదాయం ఉన్న 61 గ్రామ పంచాయతీలను గుర్తించి గ్రేడ్-1 క్లస్టర్లుగా, రూ.2 నుంచి 3 లక్షల లోపు ఆదాయం ఉన్న 39 పంచాయతీలను గ్రేడ్-2 క్లస్టర్లుగా, రూ.లక్ష నుంచి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న 231 పంచాయతీలను గ్రేడ్-3 క్లస్టర్లుగా, లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న 661 గ్రామ పంచాయతీలను గ్రేడ్-4 క్లస్టర్లుగా గుర్తించారు.

అయితే ప్రస్తుతం గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి పొందిన వారిలో 17 మందిని గ్రేడ్-1 క్లస్టర్‌గా గుర్తించిన గ్రామాలకు కార్యదర్శులుగా నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రేడ్-2 కార్యదర్శులను గ్రేడ్-1 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో నియమిస్తే భవిష్యత్తులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో పునరాలోచించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అక్రమ నియామకాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది గ్రేడ్-1 కార్యదర్శులు జిల్లా పరిషత్ సీఈఓ విజయేందిరని కలిసి విన్నవించినట్లు తెలిసింది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement