అసిస్టెంట్‌ పైలట్‌పై 'పైలట్‌' అత్యాచారం! | Assistant Pilot Molested by Pilot | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ పైలట్‌పై 'పైలట్‌' అత్యాచారం!

Nov 22 2025 10:14 AM | Updated on Nov 22 2025 11:00 AM

Assistant Pilot Molested by Pilot

సాక్షి, హైదరాబాద్: మహిళా అసిస్టెంట్ పైలెట్ పై ఓ పైలెట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుండి పుట్టపర్తి చెన్నై మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం 4.20 నిమిషాలకు ఆ బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని ఓ హోటల్‌లో మహిళా అసిస్టెంట్ పైలెట్ తో పాటు మరో ఇద్దరు పైలెట్లు (male) బస చేశారు. 

అనంతరం ఇద్దరు పైలట్లతో కలిసి బయటికి వచ్చిన బాధితురాలు. అనంతరం సదరు పైలెట్ తనపై అత్యాచారం చేశాడంటూ హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసు నమోదు చేసిన పోలీసులు తిరిగి ఈ కేసును బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement