కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్‌ బస్సు | Private Travels Bus Catches Fire At Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్‌ బస్సు

Jun 6 2019 8:29 AM | Updated on Jun 6 2019 2:42 PM

Private Travels Bus Catches Fire At Kurnool - Sakshi

ఆ సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు..

సాక్షి, కర్నూలు : జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగమర్రి మద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. దాదాపు కోటికి పైగా నష్టం జరిగినట్టుగా సమాచారం. బస్సు వెనుక భాగం నుంచి మంటలు మొదలైనట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement