31 బస్సులు సీజ్.. 55 కేసులు నమోదు | Private Travels 31 buses Siege .55 cases | Sakshi
Sakshi News home page

31 బస్సులు సీజ్.. 55 కేసులు నమోదు

Nov 5 2013 3:09 AM | Updated on Sep 2 2017 12:16 AM

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా దాడులు నిర్వహించి

ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా దాడులు నిర్వహించి బస్సుల నిర్వహణ, ఫిటినెస్, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 31 బస్సులను సీజ్ చేయగా, 55 కేసులు నమోదు చేశారు. ఏలూరులో 13 బస్సులు, తాడేపల్లిగూడెంలో 5, తణుకులో 6, భీమవరంలో 7 బస్సులు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టు కారియర్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు నిబంధనలను మీరితే సహించేది లేదని ఉప రవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి స్పష్టం చేశారు. ఇద్దరు డ్రైవర్లను విధిగా నియమించాలని, అత్యవసర ద్వారాల్లో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రయాణికులు కూడా బస్సుల్లో వాణిజ్య సరుకులు, వస్తువులు వేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement