ఏలూరు: మండే ఎండలో దాహార్తిని తీర్చే చలివేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఏలూరులోని 45వ డివిజన్ ఆదివారంపేటలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తొలగించారు అధికారులు.ఏలూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ జయప్రకాశ్ ఆదివారంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారులు ఆ చలివేంద్రాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం గురుభక్తి చాటుకున్నారు.
అధికారులను అడ్డుపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేయడంపై వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా తొలగించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఎర్రటి ఎండల్లో ప్రజల దాహం తీర్చే చలివేంద్రం మూసివేయడం అమానుషమని వైఎస్సార్‌సీపీ విమర్శించింది.


