thirst in summer
-
దాహం తీర్చండయ్యా..
ఒక రోజంతా తిండిలేకుండా ఉండగలవేమోగానీ ఒకపూట అందులోనూ ప్రచండ ఎండల్లో ఆరుబయట చుక్కనీరులేకుండా తిరగడం అస్సలు సాధ్యంకాని పని. వేసవికాలంలో నోరులేని మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు. అటవీప్రాంతాల్లోని వానరాలు, కొండముచ్చుల దాహార్తి ఇక ఎవరికీ పట్టదు. కొండ మీద స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చులు మండే ఎండల ధాటికి తాగడానికి నీరులేక రహదారి సమీపానికి వచ్చాయి. ఒక కొండముచ్చు ప్రాణాలకు తెగించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని దప్పిక తీర్చమని అరి్థంచింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జరిగింది. పుసాద్ పట్టణం సమీపంలోని ఖండాలా ఘాట్ గుండా గురువారం మధ్యాహ్నం ప్రయాణికులతో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు ఖండాలా ఘాట్ అటవీప్రాంతం గుండా వెళ్తుండగా హఠాత్తుగా ఒక కొంచముచ్చు రోడ్డు మధ్యలోకి వచ్చి ఆగింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగొచ్చి ఎంతలా అదిలించినా అది అస్సలు అక్కడి నుంచి కదల్లేదు. చుక్క నీరులేక దప్పికతో ఉందని దానిని తేరిపారా చూశాక డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే నీళ్లసీసాతో దానికి నీళ్లు పట్టాడు. ఆబగా అది నీళ్లు తాగడం చూసి సమీపంలోని డజనుపైగా కొండముచ్చులు సైతం రోడ్డు మీద కొచ్చి ప్రయాణికుల వైపు నిస్సహాయంగా చూడడం మొదలెట్టాయి. ఇదంతా గమనించిన ప్రయాణికుల మనసు చివుక్కుమంది. వెంటనే ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వెంట తెచ్చుకున్న నీళ్లసీసాలతో కొండముచ్చులకు నీళ్లు పట్టే ప్రయత్నంచేశారు. ఈ హృదయవిదారక దృశ్యాలను లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు వీడియో తీయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. అటవీప్రాంతంలో మధ్యాహ్నం ఎండకు తాగునీటి కోసం వెతికి వెతికి అవన్నీ నీరసించిపోయి కన్పించాయని ప్రయాణికులు తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న విదర్భ ప్రాంతంలో జనం నీళ్లకోసం ఎంతగానో శ్రమిస్తుంటే ఇక అటవీప్రాంతంలోని మూగజీవుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మండు వేసవిలో అటవీప్రాంతంలోని కోతుల కోసం అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల కృత్రిమ నీటికుంటలను ఏర్పాటుచేస్తున్నా అవి ఎండలకు చుక్కనీరులేకుండా పోతున్నాయి. ఖంఢాలా ఘాట్‌లో కోతులకు కనీసం నీటిసదుపాయం కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వడగాల్పుల వేసవిలో ఇళ్లలో ఉండే జనమే తిప్పలుపడుతుంటే ఇక కొండల్లో ఉండే కోతుల పరిస్థితి ఏంటి?. వన్యప్రాణాల గొంతులు పిడతగట్టుకుపోతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మారుతున్న వాతావరణ పరిస్థితుల ధాటికి వర్షాలు బాగా తగ్గిపోయి, పండ్ల చెట్లు నశించి అడవుల్లో వన్యప్రాణులకు సరైన తిండి కూడా దొరకట్లేదు’’అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశాడు. – ముంబై -
చలివేంద్రం తొలగింపుపై వైఎస్సార్సీపీ ఆందోళన
ఏలూరు: మండే ఎండలో దాహార్తిని తీర్చే చలివేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఏలూరులోని 45వ డివిజన్ ఆదివారంపేటలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తొలగించారు అధికారులు.ఏలూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ జయప్రకాశ్ ఆదివారంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారులు ఆ చలివేంద్రాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం గురుభక్తి చాటుకున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేయడంపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా తొలగించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఎర్రటి ఎండల్లో ప్రజల దాహం తీర్చే చలివేంద్రం మూసివేయడం అమానుషమని వైఎస్సార్సీపీ విమర్శించింది. -
TG: వన్యప్రాణుల దాహార్తి.. అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి,హైదరాబాద్: వేసవి మండుతోంది. మనుషులతో పాటు జంతువుల గొంతులు తడారిపోతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అడవిలో ఉండే వన్య ప్రాణులైతే తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల(సాసర్ పిట్)లో నీటిని తాగి వణ్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. Interesting camera trap pics from the forests of Telangana Thirsty Animals Find Refuge in Artificial Water Sources in Telangana. As the drought intensifies, thirsty animals are relying on artificial water sources provided by Forest officials. Despite a funding crunch, Forest… pic.twitter.com/JJCf0IK1nq — Sudhakar Udumula (@sudhakarudumula) April 2, 2024 రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్ దాకా ఉన్న అడవుల్లో పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు, పక్షులు, పాములు దాహం తీర్చుకుంటున్న పలు దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వీటిని తెలంగాణ అటవీ శాఖతో పాటు పలువురు వన్యప్రాణి ప్రేమికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ వైపు నిధుల కొరత వేధిస్తున్నా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు కొనియాడుతున్నారు. A waterhole being filled with water using solar power borewell in Birsaipet range of Utnoor #Telangana @TbiHindi @thebetterindia @IUCN @WorldBankWater @DoWRRDGR_MoJS @IUCN_Water pic.twitter.com/fHmwWxev1r — Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) March 31, 2024 -
నిండుకళ
వేసవిలో దాహం తీరాలంటే కుండలో నీళ్లే దివ్యౌషధం. ఇక మొన్నే జరిగిన ఉగాది పండుగకు షడ్రుచుల పచ్చడి చేయడానికి మట్టి కుండనే శ్రేష్టమైనదని తెలుసు. వీటిని స్వయంగా మనమే తయారు చేసుకుంటే.. సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో ఇటీవల జరిగిన పాటరీ వర్క్‌షాప్ ఇందుకు వేదికైంది. ఇంత మట్టి అంటితేనే షిట్ అంటూ చేతులను శుభ్రపరుచుకునే వాళ్లు.. కుమ్మరి చక్రం గిరగిరా తిప్పారు. మట్టి ముద్దను ముట్టుకోవడమే కాదు.. దానిని ముచ్చట గొలిపే రీతిలో మలిచారు. ..:: చీకోటి శ్రీనివాస్ పెళ్లయినా, బోనాల పండుగైనా, దీపావళి వేడుకైనా మట్టి పాత్రల కోసం కుమ్మరివాడలకు పరుగులు తీసేవారు ఊళ్లలో. కుమ్మరి చక్రం గిరగిరా తిరుగుతుండగా.. మట్టిముద్ద నుంచి కుండలు, ప్రమిదలు ఆకృతి దాల్చే విధానం చూస్తే అచ్చెరువనిపిస్తుంది. సిటీలో అన్ని రకాల మట్టి పాత్రలు లభ్యమవుతున్నా.. వాటి తయారీ ఎలాగో ఈ తరానికి తెలియదు. పట్నవాసంలో మట్టి వాసన ఎరగని మనుషులకు పల్లెల్లోని బతుకుదెరువు ఆటవిడుపుగా మారింది. కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు మట్టి పాత్రల తయారీపై అవగాహన కలిగించడానికి అవర్ సాక్రెడ్ స్పేస్‌లో నిర్వహించిన పాటరీ వర్క్‌షాప్ ఈ తరానికి ఓ పాఠమే నేర్పింది. వింత అనుభూతి ‘మమ్మీ పాట్ ఎలా తయారవుతుందో చూడు, డాడీ మనమూ ట్రైచేద్దాం! అంకుల్ ప్లీజ్ గివ్ మీ వన్ చాన్స్... ఎక్సలెంట్’ అంటూ మురిసిపోయిన చిన్నారి నియతి నుంచి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కార్మెల్ వరకు ఎవరి అనుభూతులు వాళ్లవే! నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కుమ్మరి ముత్యాలు.. వీళ్లందరికీ ఇన్‌స్ట్రక్టర్‌లా మారాడు. ఆయన సారె సాయంతో మట్టిపాత్రలు తయారు చేస్తుంటే... చూసి వావ్ అని అశ్చర్యపోవడమేకాదు, తయారీలోనూ భాగస్వాములయ్యారు. చిన్నా పెద్దా అంతా కలిసి.. మట్టి వాసనను ఆస్వాదించారు. సారెను తిప్పుతూ రకరకాల పాత్రల తయారీకి ప్రయత్నించారు. తాము సృష్టించిన పాత్రలను చూసుకుని మురిసిపోయారు. బాల్యం గుర్తొచ్చింది ‘మట్టి పాత్రల తయారీ చూస్తుంటే బాల్యం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మారేడ్‌పల్లిలో కుండల తయారీ చూస్తే ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండేది. ఇప్పుడు అలాంటి దృశ్యాలు చూడటం భాగ్యమైపోయింది. ఇలాంటి ప్రదర్శనల ద్వారా కొత్త తరం పిల్లలకు మన సంస్కృతి గురించి తెలియజెప్పిన వారమవుతాం’ అంటోంది అనుపమ. ‘అమేజింగ్... నేను కూడా పాట్ తయారు చేశా. మెత్తని బంకమట్టితో చక్రంపై పాట్స్ తయారు చేయడానికి ఎంత ఏకాగ్రత కావాలో! ముత్యాలు అంకుల్ కుండలు తయారు చేస్తుంటే అద్భుతం అనిపించింది. మట్టిపాత్రల తయారీ పట్ల పూర్తి అవగాహన వచ్చింది’ అని చెబుతోంది విద్యార్థిని శ్వేత. ‘అందరు పాట్స్ చేస్తుంటే చూశా. నాకూ ఒక చాన్స్ ఇమ్మన్నా. ఎంతో చక్కటి పాట్‌ను తయారు చేసుకున్నా, ఇంటికి వెళ్లాక చక్రం, మట్టి కొనుక్కుని నేనే అందమైన పాట్స్ తయారు చేసి, వాటిపై పెయింటింగ్స్ వేసి మా ప్రెండ్స్‌కి గిఫ్ట్ ఇస్తా’ అంటున్నాడు థర్డ్ క్లాస్ చదువుతున్న అరవ్. ‘పదిహేను నిమిషాలు కష్టపడ్డాను. పాట్ తయారు చేస్తుంటే చాలాసార్లు షేప్ మారింది. పూర్తయ్యేవరకు టెన్షన్ ఫీలయ్యా. మొత్తానికి నేననుకున్న తరహాలో పాట్ బయటకు తీశా. తయారు చేసుకోవడం ఒకెత్తయితే చక్రం నుంచి కట్‌చేసి బయటకు తీయడం మరో ఎత్తు’ అంటున్నాడు స్టూడెంట్ సంతోష్. మొత్తానికి పాట రీ వర్క్‌షాప్‌ను ఫుల్ ఎంజాయ్ చేసిన సిటీవాసులు.. తాము తయారు చేసిన మట్టిపాత్రలతో పాటు మధుర జ్ఞాపకాలనూ పదిలంగా మోసుకెళ్లారు.


