బిగ్‌ అలర్ట్‌.. ఏపీలో రేపు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు | These Districts Of AP Are Likely To Record Highest Temperature On May 24 | Sakshi
Sakshi News home page

బిగ్‌ అలర్ట్‌.. ఏపీలో రేపు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

May 23 2026 9:24 PM | Updated on May 23 2026 9:30 PM

These Districts Of AP Are Likely To Record Highest Temperature On May 24

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ(శనివారం, మే 23) రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం,  పల్నాడు జిల్లా శ్రీనగర్ లో 45, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 42.5, ప్రకాశం జిల్లా కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపూడిలో 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రేపు(మే 24, ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం,  విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement