ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు | private travel bus road accident in kurnool  | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

Feb 28 2018 7:55 AM | Updated on Aug 30 2018 4:20 PM

సాక్షి, కర్నూలు: జిల్లాలో ఓ ప్రైవేట్‌ బస్సు జాతీయ రహదారి 44పై ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ప్యాపిలి మండలం పొదొడ్డి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీర ట్రావెల్స్‌ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు  ప్రయాణికులతో బయలుదేరింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. 

ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇద్దరి డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement