పాల్‌టెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య | Polytechnic student who committed suicide | Sakshi
Sakshi News home page

పాల్‌టెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

Apr 4 2016 11:23 AM | Updated on Nov 9 2018 5:02 PM

పాల్‌టెక్నిక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

పాల్‌టెక్నిక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పాల్‌టెక్నిక్ ద్వితియ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.


వివరాలు.. వీర్లపాడు మండల కేంద్రానికి చెందిన వాసవి(18) హాస్టల్‌లో ఉంటూ ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పాట్‌టెక్నిక్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతోంది. తను ప్రేమించిన వ్యక్తితో తన పెళ్లికి నిరాకరిస్తుండటంతో.. తల్లిదండ్రులతో గొడవ పడుతుండేది.

ఇదే విషయంపై ఆదివారం రాత్రి తమ్ముడు ఫోన్‌లో మందలించడంతో... మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.  ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది సేపటి క్రితం ఆమె ఫోన్‌కు తమ్ముడు ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రేమ వ్యవహారంలో తమ్ముడు మందలించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement