‘క్రైం’ కిలాడీ | police reveals anchor harshavardhan gang secrets | Sakshi
Sakshi News home page

‘క్రైం’ కిలాడీ

Sep 11 2014 8:50 AM | Updated on Aug 28 2018 7:24 PM

‘క్రైం’ కిలాడీ - Sakshi

‘క్రైం’ కిలాడీ

సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్ చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు..

    * ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు
    *  రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెరుుల్
    *  రూ.13 లక్షలు వసూలు
    *  మరింత సొమ్ము కోసం బెదిరింపులు

ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్ చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అంటూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్‌టాప్‌గా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల విషయంలో బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి..’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు.

తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్‌మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూలు చేశారంటూ ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు.

రైల్వే ఇంజినీర్ నుంచి  రూ.13 లక్షలు వసూలు

హర్షవర్దన్ తన నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో సెక్షన్ సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో ఉంటున్నారు.

అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్‌నెట్‌లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహుకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దిరిశిపాముల విజయరత్నం బ్లాక్‌మెయిల్ చేశారు.

ఆ ఫొటోను నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరికొంత సొమ్ము ఇస్తేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు.

ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను ఏలూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్ బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు.
 
ముఠా సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు

హర్షవర్దన్ అనుచరులైన నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, ఏలూరుకు చెందిన విజయకుమార్, తాడేపల్లిగూడేనికి చెందిన విజయరత్నం, ఏలూరు కార్ల విడిభాగాల షోరూం నిర్వాహకుడు వీరంకి చిరంజీవి ఇళ్లల్లో పోలీసులు మంగళ, బుధవారాల్లో సోదాలు నిర్వహించారు. బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్న సీడీలు, ఇతర రికార్డుల కోసం పోలీసులు వారి గృహాలతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement