నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో విజయనగరం జిల్లా గుర్ల తహశీల్దారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో గుర్ల తహశీల్దార్
Nov 25 2015 1:35 PM | Updated on Apr 4 2019 2:50 PM
	పార్వతీపురం: నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో విజయనగరం జిల్లా గుర్ల తహశీల్దారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం కొమరాడ తహశీల్దార్‌గా ఉమాకాంత్‌పాండే పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంతో కోటిపాం వీఆర్వో శారదకు కూడా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రస్తుతం గుర్ల మండల తహశీల్దారుగా పనిచేస్తున్న ఉమాకాంత్‌తో పాటు వీఆర్వో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
