మండలంలోని బ్రాహ్మణగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Oct 29 2013 3:32 AM | Updated on Aug 30 2018 3:56 PM
చాగల్లు, న్యూస్‌లైన్ : మండలంలోని బ్రాహ్మణగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన పూటికుక్కల కోట సత్యనారాయణ (24), అతని స్నేహితుడు పేకేటి భగవాన్‌లు నిడదవోలు నుంచి సైకిల్‌పై వస్తుండగా బ్రాహ్మణగూడెం పద్మా వైన్ షాపు సమీపంలో చాగల్లు నుంచి పంచదార లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో సైకిల్‌పై నుంచి పడిన కోట సత్యనారాయణ తలపై లారీ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భగవాన్ గాయపడ్డాడు. చాగల్లు ఎస్సై ఎం.ఆనందరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు సత్యనారాయణకు భార్య దుర్గ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, టీడీపీ నాయకులు గారపాటి కాశీవిశ్వనాథం పరిశీలించారు. సత్యనారాయణ వలస పనులకు వెళ్లి భార్యకు డెలివరీ కావడంతో వారం క్రితమే వచ్చాడని, లారీ మృత్యురూపంలో కభళించిందని తండ్రి పోలినాయుడు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. రోడ్డుపై గోతులే ప్రమాదానికి కారణమని ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కోలాటి కాంతారావు కోరారు.
Advertisement


