సెలవులకు టాటా..స్టేషన్‌ కిటకిట | People Waiting in Visakhapatnam Railway Station For Journey | Sakshi
Sakshi News home page

సెలవులకు టాటా..స్టేషన్‌ కిటకిట

Oct 14 2019 12:51 PM | Updated on Oct 21 2019 9:11 AM

People Waiting in Visakhapatnam Railway Station For Journey - Sakshi

రైల్వేస్టేషన్‌ వెలుపల బస్సుల కోసం ఎదురుచూపులు

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవులు ముగిశాయి. విశాఖకు వస్తున్న వారి.. విశాఖ వీడి వెళ్తున్న వారి ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలా వస్తూ పోతున్న వారితో రైల్వేస్టేషన్‌ కిటకిటలాడింది. స్టేషన్‌లో ఆదివారం ఇసకేస్తే రాలని పరిస్థితి కనిపించింది. ఆదివారంతో సెలవులు ముగిసినందున ఉదయం నుంచి రైల్వే స్టేషన్‌ జనసమ్మర్దంగా కనిపించింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీగా బయల్దేరాయి. అలాగే అటునుండి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్‌ రైళ్లు కూడా రద్దీగానే వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement