
సాక్షి, గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల 4న డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు గుంటూరు వెళ్లనున్నారు. గతంలో కూడా కలుషిత నీటి వల్ల అనారోగ్యానికి గురైన కుటుంబాలను పవన్ పరామర్శించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు నగరంలో విజృంభించిన డయేరియా కారణంగా సుమారు 200 మంది ఆస్పత్రిపాలయ్యారు. ముగ్గురు మృతి చెందారు. ఆస్పత్రిలో బెడ్‌లు లేకపోవడంతో రోగులు ఇబ్బందుల పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోకుంటే పవన్ ప్రత్యక్ష ఆందోళనకు దిగే యోచనలో ఉన్నట్లు సమాచారం.