బస్సును ఢీ కొట్టిన లారీ: ప్రయాణికులకు గాయాలు | Passengers injured in road accident, srikakulam district | Sakshi
Sakshi News home page

బస్సును ఢీ కొట్టిన లారీ: ప్రయాణికులకు గాయాలు

Apr 4 2015 8:43 AM | Updated on Apr 7 2019 3:24 PM

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం రహదారిపై ఆగి ఉన్న ఒడిశా బస్సును లారీ ఢీ కొట్టింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం రహదారిపై ఆగి ఉన్న ఒడిశా బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. టైరు పేలడం వల్ల లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement