తల్లిదండ్రులపై కొడుకు యాసిడ్ దాడి | parents attacked by son | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులపై కొడుకు యాసిడ్ దాడి

Oct 28 2014 6:57 PM | Updated on Aug 17 2018 2:10 PM

ఆస్తిపై కన్నేసిన కసాయి కొడుకు తల్లిదండ్రులనే మట్టుబెట్టాలనుకున్నాడు.

ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా): ఆస్తిపై కన్నేసిన కసాయి తనయుడు తల్లిదండ్రులనే మట్టుబెట్టాలనుకున్నాడు. బంధాలను మరిచిపోయిన ఓ యువకుడు అమానుషంగా తల్లిదండ్రలపై యాసిడ్ తో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. హనమంతరావు అనే వ్యక్తి తన మొదటి భార్య చనిపోవడంతో రమాదేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అతని ముందు భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు.

 

అయితే తన తండ్రి ఆస్తి ఎట్టిపరిస్ధితిల్లోనే తన చేతికే రావాలని యోచించిన ఆ యువకుడు.. హనుమంతరావుతో పాటు రమాదేవిపై యాసిడ్ తో దాడికి పూనుకున్నాడు. ఈ ఘటనలో రమాదేవి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా తండ్రి హనుమంతరావు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కుమారుడు యాసిడ్ తో దాడి చేసే సమయంలోతండ్రి ప్రక్కనే ఉన్న నీళ్ల తొట్టిలోకి  దూకడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement