శరవేగంగా తెలంగాణ రాష్ర్ట ప్రక్రియ | outrageous to abide by the Central Government in the case | Sakshi
Sakshi News home page

శరవేగంగా తెలంగాణ రాష్ర్ట ప్రక్రియ

Sep 5 2013 5:48 AM | Updated on Sep 1 2017 10:28 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు.

తూప్రాన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పాలాట గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత సోనియాగాంధీ తెలంగాణపై ప్రకటన చేశారన్నారు.  తాము చేపడు తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు తమ పా ర్టీలో చేరుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మినర్సింలుగౌడ్, వెంకట్‌రెడ్డి, ఆర్.నర్సింగ్‌రావుగౌడ్, ఆర్.కృష్ణగౌడ్, రమెశ్‌గౌడ్, శ్రీశైలం యాదవ్,  నాగరాజుగౌడ్, దీపక్‌రెడ్డి, పెంటాగౌడ్, భగవన్‌రెడ్డి, జావెద్‌పాపా, నరేన్‌రెడ్డి, సామల అశోక్, ఉమర్, సత్యనారాయణగౌడ్, అనిల్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement