వ్యాన్ - లారీ ఢీ: ఒకరు మృతి | one killed in Road accident in chittoor district | Sakshi
Sakshi News home page

వ్యాన్ - లారీ ఢీ: ఒకరు మృతి

Jan 19 2016 8:14 AM | Updated on Aug 30 2018 3:58 PM

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరు వద్ద మంగళవారం తెల్లవారుజామున వ్యాన్ను లారీ ఢీకొట్టింది.

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరు వద్ద మంగళవారం తెల్లవారుజామున వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement