అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి | one dies of road accident | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి

May 11 2015 8:14 AM | Updated on Apr 3 2019 8:07 PM

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ మనుషులను బలితీసుకుంది.

కృష్ణా: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ మనుషులను బలితీసుకుంది. ఒక బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. కృష్ణా జిల్లా తోట వల్లూరు వద్ద సోమవారం ఉదయం ద్విచక్రవాహనాన్ని అంబులెన్స్ ఢీకొన్న సంఘటనలో దుర్గారావు అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సతీష్, చంద్రబాబు అనే యువకులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement