చెరువులో పడి వ్యక్తి మృతి | Old woman suiside | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Jul 20 2016 1:12 AM | Updated on Jul 12 2019 5:45 PM

పాలసముద్రం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రాగిమేకులపల్లికి చెందిన సుబ్బరాయప్ప(58) సోమవారం ఉదయం పాలసముద్రం చెరువులో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫిట్స్‌ రావడంతో చెరువులో పడి మృతి చెందాడు.

పాలసముద్రం చెరువులో పడి  ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రాగిమేకులపల్లికి చెందిన సుబ్బరాయప్ప(58) సోమవారం ఉదయం పాలసముద్రం చెరువులో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫిట్స్‌ రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు తొలుత బంధువుల ఊరు వెళ్లి ఉంటాడని అనుకున్నారు. అయితే మంగళవారం చెరువులో శవం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి శవాన్ని వెలికితీయించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement