ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ | notification for andhra pradesh council Deputy chairman election issued | Sakshi
Sakshi News home page

ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

Sep 3 2014 9:53 AM | Updated on Mar 28 2019 5:27 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది.  ఈరోజు సాయంత్రం అయిదు గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ చైతన్య రాజు నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పోటీకి సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మధ్యాహ్నానికి తన అభ్యర్థిని ఖరారు చేయనుంది. అభ్యర్థుల రేసులో రుద్రరాజు పద్మరాజు, చెంగల్రాయుడు  ఉన్నట్లుగా తెలుస్తోంది. కౌన్సిల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీల సంఖ్య 41 ఉంది. పోటీ అనివార్యమైతే గురువారం ఎన్నిక జరగనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement