‘శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు’ | No need to plays body politics, says sai sri mother suma | Sakshi
Sakshi News home page

‘శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు’

May 15 2017 11:10 AM | Updated on Aug 10 2018 7:19 PM

శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు.

విజయవాడ: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని  వైద‍్యం అందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు. ఎమ్మెల్యేగా న్యాయం చేయాల్సిన బాధ్యత బోండా ఉమామహేశ్వరరావుకు లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 రోజులుగా తన గోడు చెబుతున్నా బోండా ఉమ స్పందించలేదని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్లే ఇల్లు అమ్ముకోలేక, తన బిడ్డను కోల్పోయానని సుమ భోరున విలపించారు. సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు.

  మరోవైపు సుమను వైఎస్‌ఆర్‌ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మ పరామర్శించారు. కాగా బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా  టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ నిన్న మధ్యాహ్నం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement