న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ధ్వజం
ఏలూరు జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌వల్ల దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారికి ప్రాణరక్షణ లేకుండా పోయిందని ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులోని తన నివాసంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని బుల్డోజర్ పార్టీగా మారుస్తున్నారని విమర్శించారు. చింతమనేని దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్నాయని, గ్రామాల్లో ఆయన వర్గానికి చెందిన కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తన భూమిలో కొంతమంది అక్రమంగా రాళ్లు వేయగా వాటిని తొలగించినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ తదితర కేసులు నమోదు చేశారన్నారు. పెదపాడు తహసీల్దార్, పెదపాడు సీఐ వారి పరిధి దాటి.. టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులు చిన్నòÙడ్డు నిరి్మంచుకుని వ్యాపారం చేసుకుంటుండగా ఎమ్మెల్యే చింతమనేని ఆ షెడ్డును బుల్డోజర్‌తో కూలి్చవేశారని తెలిపారు. జగన్నాథపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పాలడుగు భానుప్రకాష్ ఇంటికి వెళ్లి చింతమనేని అనుచరులు దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
23 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాం
కాగా.. పాలడుగు భానుప్రకాష్, శ్రావణి దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. తాము 23 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నామని తెలిపారు. రూ.కోటితో భూమిని కొనుగోలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినప్పటికీ రిజి్రస్టేషన్ జరగకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా, తిరిగి తనపైనే కేసు నమోదు చేశారని భానుప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.


