‘బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు’ | No Groups In Rajampet YSRCP Says Meda Mallikarjuna Reddy | Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు’

Feb 4 2019 1:49 PM | Updated on Feb 4 2019 2:11 PM

No Groups In Rajampet YSRCP Says Meda Mallikarjuna Reddy - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌సీపీలో ఎలాంటి గ్రూపులు లేవని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌ రెడ్డి తెలిపారు. రాజంపేటలో కొంతమంది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడి ప్రజలు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోరని, మంచిని ప్రోత్సహిస్తారని అభిప్రాయపడ్డారు.

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మేడా వెల్లడించారు. టీడీపీ నేతలకు రాజంపేటలో నేతలు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement