హారతికి ఆనతి లేదు | Nara Chandrababu Naidu tour | Sakshi
Sakshi News home page

హారతికి ఆనతి లేదు

Aug 17 2014 12:18 AM | Updated on Aug 29 2018 3:33 PM

హారతికి ఆనతి లేదు - Sakshi

హారతికి ఆనతి లేదు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఫలితంగా ఉపమాక వెం కన్న ఆలయంలో హారతివ్వడం ఆగిపోయింది.

  •     ఉపమాక వెంకన్నకు ‘శీతల యంత్ర’ శాపం
  •      సీఎం వచ్చి వెళ్లాక హారతులందుకోని స్వామి
  • నక్కపల్లి రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఫలితంగా ఉపమాక వెం కన్న ఆలయంలో హారతివ్వడం ఆగిపోయింది. ఈ నెల 9న సీఎం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో అప్పటికప్పుడే ఏసీ(శీతల యంత్రం) ఏర్పాటు చేశారు. అది పాడైపోతుందని నాటి నుంచి స్వామికి హారతులివ్వ డం ఆపేశారు.

    శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. హారతుల విషయమై అర్చకులను నిలదీశారు. లోపల ఏసీ ఉండడంతో హారతులొద్దని అధికారులు చెప్పారం టూ అర్చకులు బదులివ్వడంతో పలువురు ఆ గ్రహం వ్యక్తంచేశారు.

    మరో తిరుపతిగా కీర్తిం చే ఉపమాక ఆలయంలో హారతులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఈవో శేఖర్‌బాబు వద్ద ప్రస్తావించగా సీఎం పర్యటనలో భాగం గా ఏసీ ఏర్పాటుచేసినప్పటి నుంచి హారతులు ఆపివేయడం వాస్తవమేనన్నారు. ఆ తర్వాత హారతులు పూర్తిగా నిలిపివేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement