దేవుడు నన్ను మోసం చేశాడూ... | Nandamuri Harikrishna collapses due to yelder son janakiram died in road accident | Sakshi
Sakshi News home page

దేవుడు నన్ను మోసం చేసాడూ...

Dec 7 2014 5:31 AM | Updated on Sep 28 2018 3:39 PM

దేవుడు నన్ను మోసం చేశాడూ... - Sakshi

దేవుడు నన్ను మోసం చేశాడూ...

పెద్ద కుమారుడు జానకిరామ్ మరణవార్త వినగానే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ 'దేవుడు నన్ను మోసం చేశాడంటూ' విలపిస్తూ కుప్పకూలి పోయారు.

హైదరాబాద్ : పెద్ద కుమారుడు జానకిరామ్ మరణవార్త వినగానే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ 'దేవుడు నన్ను మోసం చేశాడంటూ' విలపిస్తూ కుప్పకూలి పోయారు. తన కుటుంబానికే ఇలా ఎందుకు జరగుతుందంటూ తీవ్ర ఆవేదన చెందారు. హరికృష్ణను ఓదార్చడం అక్కడే ఉన్న కుటుంబసభ్యులు, బంధువుల తరం కాలేదు. కుటుంబ సభ్యులతోపాటు జానకిరామ్ భార్య, పిల్లల తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు.

జానకిరామ్ మరణవార్త విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణ నివాసానికి  చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, బాబు కేబినెట్ లోని మంత్రులు హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద కుమారుడు జానకిరామ్ మృతితో హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని నందమూరి హరికృష్ణ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement