బాలకృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు..!

Nandamuri Balakrishna Ex Personal Assistant Sentenced 3 Year Prison - Sakshi

సాక్షి, అనంతపురం : సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్‌ అసిస్టెంట్‌ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలన్నాయి. పీఏ దందాలను చాలాకాలం కిందటే బాలకృష్ణ, టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇక పార్టీ నేతల మధ్య కూడా విభేదాలకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ తన పీఏ శేఖర్‌కు ఫిబ్రవరిలోనే ఉద్వాసన పలికారు. శేఖర్‌పై 2008లో కేసు నమోదుకాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top